Site icon Sanchika

సినిమా క్విజ్-17

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎన్.టి.ఆర్, గుమ్మడి ‘తోడుదొంగలు’ అయితే, మరి కలర్‍లో వచ్చిన ‘తోడుదొంగలు’ ఎవరు?
  2. నటి లక్ష్మి తల్లి పేరు ఏమిటి?
  3. తెలుగులో మొట్టమొదటిసారి ఏ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు?
  4. ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ చిత్రానికి ఏ హిందీ సినిమా ఆధారం?
  5. నటి. కె.ఆర్. విజయ నటించిన హిందీ చిత్రం ఏది?
  6. యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ‘తులసి’ నవల తెలుగులో ఏ పేరిట సినిమాగా తీయబడింది?
  7. ఎన్.టి.ఆర్. ‘దాగుడుమూతలు’ సినిమా హిందీ వెర్షన్‍లో హీరో ఎవరు?
  8. హిందీ చిత్రం ‘మదర్ ఇండియా’లో ముఖ్య ప్రాత ‘నర్గీస్’ అయితే, తెలుగులో ఆ పాత్ర ధరించిన నటి ఎవరు?
  9. శోభన్ బాబు, కృష్ణంరాజు నటించిన ‘ఇద్దరూ ఇద్దరే’ చిత్రం ఏ హిందీ సినిమాకి ఆధారం?
  10. కె. విశ్వనాథ్ తీసిన ‘జీవనజ్యోతి’ చిత్రానికి కథ అందించినవారు ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జనవరి 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 17 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జనవరి 08 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 15 జవాబులు:

1.దొంగల్లో దొర 2. ఎ.ఎన్.ఆర్ తమిళ చిత్రం – మనిదన్ మూరవిల్లె; ఎన్.టి.ఆర్. గుండమ్మ కథ 3. ఎన్.టి.ఆర్. గారి ఇంటిగుట్టు 4. ఝూం ఝరాటా 5. కె.వి.ఎస్. శర్మ 6. అజిత్ సింగ్ పహిల్వాన్ 7. మహంకాళి వెంకయ్య 8. పెమ్మసాని రామకృష్ణ 9. జిక్కి 10. కె.వి.రెడ్డి

సినిమా క్విజ్ 15 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version