Site icon Sanchika

సినిమా క్విజ్-18

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. నటి జమున గారు హిందీలో సునీల్ దత్ గారి అక్కగా నటించిన చిత్రం పేరు?
  2. ఎ.ఎన్.ఆర్. నటించిన ‘అర్ధాంగి’ చిత్రాన్ని ఏ పేరుతో హిందీలో తీశారు?
  3. ఎ.ఎన్.ఆర్. హీరోగా వచ్చిన ‘పెళ్ళికానుక’ చిత్రం హిందీలో రీమేక్ అయింది. హీరో ఎవరు?
  4. గుమ్మడి గారు నటించిన హిందీ చిత్రం ఏది?
  5. జి.డి. మాడుగుల్కర్ వ్రాసిన మరాఠీ నవలను తెలుగులో సినిమాగా తీశారు. పేరు? (క్లూ: 1954లో వచ్చిన చిత్రానికి వై.ఆర్.స్వామి దర్శకులు, ఎన్.టి.రామారావు హీరో)
  6. ‘హరిశ్చంద్రుడే అబద్ధమాడితే’ అనే నవల ఆధారంగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ చిత్రం?
  7. కె.ఆర్. విజయ ముఖ్యపాత్రలో, ఎన్.టి.ఆర్. గెస్టుగా నటించిన ‘మేలుకొలుపు’కు ఏ హిందీ చిత్రం ఆధారం?
  8. హిందీలో వచ్చిన ‘అర్జున్’ చిత్రం తెలుగులో ఏ పేరున వచ్చింది?
  9. ఎస్.ఎస్. రాజమౌళి సినిమా ‘మర్యాద రామన్న’ హిందీలో ఏ పేరున వచ్చింది?
  10. నాట్యతార జయమాలిని ఏ 70 MM హిందీ చిత్రంలో నాట్యం చేసింది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జనవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 18 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జనవరి 15 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 16 జవాబులు:

  1. ఎడిటర్ 2. ఫర్జ్ (1967) 3. మంచలీ 4. సావన్ భాదో 5. ప్రేమలేఖలు 6. అదృష్టవంతులు 7. ముకాబ్‍లా 8. రాధా సలూజా 9. ఆర్. నాగేంద్ర రావు 10. రామ్ పోతినేని

సినిమా క్విజ్ 16 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

గమనిక:

సినిమా క్విజ్ 16లో రెండవ ప్రశ్న ‘నటి కాంచన తొలిసారిగా హిందీలో నటించిన చిత్రం’ కి జవాబుగా కొందరు ‘సువర్ణసుందరి’ (1957) అని జవాబిచ్చారు. ఆ సినిమాలో ఆవిడ వసుంధర పేరుతో నటించారు. అయినా, ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబు రాసిన వారిగా పరిగణించాము.

మరికొందరు తీన్ బహురాణియా అని రాశారు. అది 1968లో విడుదలయింది

Exit mobile version