[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- చిరంజీవి తెలుగులో నటించిన ‘యమకింకరుడు’ చిత్రానికి మూలమైన హీరో మెల్ గిబ్సన్ నటించిన ఆంగ్లం చిత్రం ఏది?
- చిరంజీవి తెలుగులో నటించిన ‘ఖైదీ’ చిత్రానికి ఏ ఇంగ్లీషు చిత్రం ఆధారం? హీరో సిల్వెస్టర్ స్టాలోన్.
- ‘ఇల్లరికం’ చిత్రంలో ఘంటసాల పాడిన ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్’ పాటకు ఆధారమైన హిందీ చిత్రం ఏది?
- బెంగాలీ చిత్రం ‘సన్యాసిరాజా’ను తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుతో ఏ పేరుతో తీశారు?
- బెంగాలీ చిత్రం ‘సాగరిక’ను తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుతో ఏ పేరుతో తీశారు?
- ‘అగ్నిసంస్కార్’ అనే బెంగాలీ చిత్రాన్ని తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుతో ఏ పేరుతో తీశారు?
- ‘అగ్నిపరీక్ష’ బెంగాలీ చిత్రాన్ని తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుతో ఏ పేరుతో తీశారు?
- ‘అమానుష్’ అనే హిందీ చిత్రాన్ని తెలుగులో సీనియర్ ఎన్.టి.ఆర్.తో ఏ పేరుతో తీశారు?
- బెంగాలీ రచయిత శరత్‍చంద్ర చటర్జీ ‘బడదీదీ’ నవలను తెలుగులో ఏ పేరిట అక్కినేని నాగేశ్వరరావుతో తీశారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 సెప్టెంబరు 20వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 2 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 సెప్టెంబరు 25 తేదీన వెలువడతాయి.