[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ చిత్రానికి ఎన్.టి.రామారావు కథ అందించారు? (జితేంద్ర, లీనాచందావర్కర్ నాయికానాయకులు)
- హాస్యనటుడు నగేష్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు. కైకాల సత్యనారాయణ ముఖ్యపాత్ర ధరించిన ఆ చిత్రం ఏది?
- తెలుగులో మొదటి అపరాధ పరిశోధన చిత్రం ఏది? ఇందులో ఎన్.టి.ఆర్., జమున ముఖ్య పాత్రధారులు. దర్శకత్వం పి. సుబ్రహ్మణ్యం.
- ఆంధ్రా దేవానంద్‍గా పిలువబడిన తెలుగు హీరో ఎవరు?
- విజయా వారి ‘పెళ్ళి చేసి చూడు’ చిత్రంలో ఘంటసాల పాడిన ‘ఎవడొస్తాడో చూస్తాగా’ పాటను ఎవరిపై చిత్రీకరించారు?
- కన్నడ హీరో రాజ్‌కుమార్ స్వయంగా తెలుగు మాట్లాడిన చిత్రం ‘శ్రీ కాళహస్తీ మహత్యం’. ఈ సినిమా పాటల రచయిత ఎవరు?
- ప్రఖ్యాత వైణికుడు ఎస్. బాలచందర్ నటించిన తెలుగు చిత్రం ఏది? ఇందులో ఎన్.టి.ఆర్., అంజలిదేవి నటించారు.
- ఎన్.టి.ఆర్., సావిత్రి నటించిన ‘కలసి ఉంటే కలదు సుఖం’ సినిమాకి ఆధారమైన తమిళ చిత్రం ‘భాగప్పిరివినై’లో వీరి పాత్రలు ఎవరు పోషించారు?
- కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో చలం, కన్నడ తార ఆరతి నటించిన చిత్రం ఏది?
- ఎ.వి.ఎం. వారి ‘భూకైలాస్’ చిత్రంలో ‘సుందరాంగ అందుకోరా’ పాటను పి. సుశీల గారు పాడగా తెరపై ఎవరి మీద చిత్రీకరించారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఫిబ్రవరి 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 24 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఫిబ్రవరి 26 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 22 జవాబులు:
1.డార్క్ నైట్ (బ్యాట్‌మాన్) 2. ది ప్యూజిటివ్ 3. వారసుడొచ్చాడు 4. శివాజీ గణేశన్, జయలలిత 5. ఎస్.పి. భయంకర్ 6. కామ్‌చోర్ 7. ఖైదీ నెంబరు 786 8. ది ఇన్‌టచబుల్స్ 9. అవర్ హాస్పిటాలిటీ 10. గోవుల గోపన్న (1968)
సినిమా క్విజ్ 22 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శ్రేయ ఎస్. క్షీరసాగర్
- సునీతా ప్రకాష్
- వనమాల రామలింగాచారి
- భరత్. టి
- హేమలత. డి
- సౌఖ్యశ్రీ. బి
- రేవతి. టి
- శ్రీమయి డి
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]