సినిమా క్విజ్-25

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు అక్కినేని ‘వెలుగు నీడలు’ చిత్రంలో ఏ పాట కండక్ట్ చేస్తూ కనిపిస్తారు?
  2. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘కొంజుం సలంగై’ – ‘మురిపించే మువ్వులు’గా వచ్చిన చిత్రంలో ‘నీ లీల పాడెద దేవా’ పాటని ఎస్. జానకి ఆలపిస్తే, నాదస్వరంతో వాయించినవారు ఎవరు?
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకరుగా, మహారాష్ట్ర గవర్నరుగా పని చేసిన తెలుగు నటుడు ఎవరు?
  4. మొదటిసారి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేట్ అందుకున్న మన సంగీత దర్శకుడు ఎవరు?
  5. హిందీ ‘ఆరాధన’ చిత్రంలో హిట్టయిన కిశోర్ కుమార్ పాడిన ‘రూప్ తేరా మస్తానా, ప్యార్ మేరా దీవానా’ పాటను తెలుగులో అనుకరించి ఎస్.పి. బాలు, పి. సుశీల గార్లు పాడిన చిత్రం ఏది?
  6. ఎవిఎమ్ ప్రొడక్షన్స్ వారు తమిళ సినిమా ‘పుగుంద వీడు’ ని తెలుగులో ఏ పేరుతో రీమేక్ చేశారు? (శోభన్ బాబు, కృష్ణ, చంద్రకళలు నటించారు)
  7. తమిళంలో కె. బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తెలుగులో దాసరి నారాయణరావు – నరసింహరాజు, శ్రీవిద్య, మాధవిలతో – ఏ పేరుతో తీశారు?
  8. మలయాళంలో వచ్చిన ‘భూమిదేవి పుష్పినయాయి’ చిత్రాన్ని తెలుగులో దాసరి నారాయణరావు – చలం, శ్రీవిద్య, కృష్ణంరాజు లతో – ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. 1970లో వచ్చిన ఎన్.టి.ఆర్, నాగభూషణం, కాంతారావు నటించిన ‘ఒకే కుటుంబం’ చిత్రంలో దాసరి నారాయణరావు ఏ పాటని వ్రాశారు?
  10. పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘కన్యాశుల్కం’ చిత్రంలో ఎన్.టి.ఆర్., జానకి నటించగా, న్యాయవాది పాత్ర పోషించిన గుమ్మడి గారు ‘భగవద్గీత’ పుస్తకాన్ని ఎవరికి బహుకరించారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఫిబ్రవరి 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 25 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 మార్చి 05 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 23 జవాబులు:

1.కోటలో పాగా 2. నీడలేని ఆడది 3. అర్జా జనార్దన రావు 4. వాడే వీడు 5. నాటకాల రాయుడు 6. బి. ఎన్. రెడ్డి 7. ముద్దుల మావయ్య 8. శరత్ కుమార్ 9. ఈడియట్ 10. ఠాగూర్

సినిమా క్విజ్ 22 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • ఎం. అరుణ
  • మణి నాగేంద్రరావు బి.
  • మత్స్యరాజ విజయ
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రేయ ఎస్. క్షీరసాగర్
  • సునీతా ప్రకాష్
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here