సినిమా క్విజ్-29

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అంతం’ చిత్రంలో నాగార్జున, ఊర్మిల, సిల్క్ స్మిత నటించగా ముగ్గురు సంగీత దర్శకత్వం వహించారు. వారి పేర్లు?
  2. హిందీ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించిన దాసరి నారాయణరావు చిత్రం ఏది?
  3. 2002లో నీలకంఠ గారు తన దర్శకత్వంలో కృష్ణ కుమార్తె మంజుల గారితో సినిమా తీసి, నేషనల్ ఫిల్మ్ అవార్డు, మరియు మూడు నంది అవార్డులు అందుకున్నారు. ఆ చిత్రం పేరు?
  4. సి.ఎస్. రావు గారి దర్శకత్వంలో ‘వన్ థౌజండ్ బెడ్ రూమ్స్’ అనే ఇంగ్లీషు నవల ఆధారంగా హైదరాబాద్ మూవీస్ పతాకంపై జగ్గయ్య, జమున, కాంతారావులతో తీసిన చిత్రం ఏది?
  5. 1982లో దర్శకుడు బాపు, సురేష్ (తొలి పరిచయం), విజయ శాంతి గార్లతో అందించిన చిత్రం ఏది? ఈ సినిమాకి కథ ముళ్లపూడి, సంగీతం ఎం.ఎస్. విశ్వనాథన్.
  6. 1954లో తమిళ దర్శకులు టి.ఆర్. రామన్న గారు ఎంజి రామచంద్రన్‍, శివాజీ గణేశన్‍లతో మొదటి/చివరి చిత్రం తీశారు. కె.వి. మహదేవన్ సంగీతం అందించిన ఆ చిత్రం పేరు?
  7. ‘షావుకారు’ చిత్రాన్ని కాస్త మార్పులతో 1965లో విజయవారు చాణక్య దర్శకత్వంలో విజయనిర్మల, జై శంకర్, ఎవిఎమ్ రాజన్‍లు నటించిన బంపర్ హిట్ తమిళ చిత్రం ఏది?
  8. 1958లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, సావిత్రిలు నటించిన ‘ఇంటిగుట్టు’ ఆధారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్‍తో తీసిన చిత్రం ఏది?
  9. కృష్ణన్ పంజు దర్శకత్వంలో వచ్చిన ‘కుళాయుం దైవమున్’ చిత్రాన్ని తెలుగులో వారే జమున, హరనాథ్ లను పెట్టి (1975లో) హిట్ కొట్టిన చిత్రం పేరు?
  10. మలయాళ చిత్రం ‘యక్షగానం’ తెలుగులో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ, అంజలీ దేవి, విజయనిర్మల నటించిన ఆత్మ కథాచిత్రం ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మార్చి 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 28 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఏప్రిల్ 02 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 27 జవాబులు:

1.కె.వి. మహదేవన్ (చిత్రం పేరు తై వందాల్ వళి పిరక్కుం) 2. సుందర పురుషన్ 3. వివాహ బంధం 4. కులదైవం 5. మధుర స్వప్నం (1982) 6. రక్త తిలకం (1988) 7. రాజా విక్రమార్క (1990) 8. పోలీస్ రిపోర్ట్ (1989) 9. తెనాలి రామకృష్ణ 10. పరివర్తన

సినిమా క్విజ్ 27 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయ
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here