సినిమా క్విజ్-3

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మొదటి రోజుల్లో తెర మీద కన్పించి పాడిన చిత్రం ఏది?
  2. ఎన్.టి.ఆర్., కాంతారావుల ఒకే పేరు గల చిత్రం ఏది?
  3. ఎన్.టి.ఆర్. సావిత్రి, బి. సరోజా దేవిలు నటించిన ఏ చిత్రంలో ఎన్.టి.ఆర్. స్వయంగా మాట్లాడక వేరేవారు వాయిస్ ఇచ్చారు?
  4. ఎన్.టి.ఆర్, జగ్గయ్య, అంజలీదేవి, జమునలు నటించిన చిత్రంలో జమున తండ్రిగా నటించినది ఎవరు?
  5. కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన ‘నా పేరే భగవాన్’ చిత్రానికి ఏ హిందీ సినిమా మాతృక?
  6. ‘జీవితమే సఫలము, రాగసుధా భరితము’ అను పాట జిక్కి పాడారు. ఆ పాటకి హిందీ మాతృక ఏ చిత్రం లోనిది?
  7. హిందీ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి సంగీత దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఏది?
  8. హిందీ నటి ‘నూతన్’ పాడిన తెలుగు చిత్రం ఏది?
  9. హిందీ సంగీత దర్శకుడు సి. రామచంద్ర తొలిసారిగా సంగీతం అందించిన తెలుగు చిత్రం ఏది?
  10. నటి జమున స్వంతంగా పాట పాడిన చిత్రం ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 సెప్టెంబరు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 3 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 అక్టోబరు 02 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 1 జవాబులు:

అడ్డం:   

1.కృష్ణ 2. జయంతి 3. గుమ్మడి 4. ఇరుగుపొరుగు 5. దైవబలం 6. విజయగౌరి 7. మూగనోము 8.నీరాజనం 9. జీవిత చక్రం 10. ఝండా ఉంఛా రహే హమారా

సినిమా క్విజ్ 1 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • సి. గోవింద రావు
  • సిహెచ్.వి.బృందావనరావు
  • గోనుగుంట మురళీకృష్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మణి నాగేంద్ర రావు బి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామలింగయ్య టి
  • ఎస్. సునితా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here