[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ప్రఖ్యాత హిందీ ఛాయాగ్రాహకుడు (తాంత్రిక ఛాయాగ్రహణంలో సిద్ధహస్తులు) అయిన ‘బాబూభాయి మిస్త్రీ’ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఏది? ఎన్.టి.ఆర్, రామకృష్ణ, వాణిశ్రీ తారాగణం.
- ఛాయాగ్రాహకుడు ఎస్. వెంకటరత్నం – ఎన్.టి.ఆర్., జయప్రదలతో నిర్మించిన చిత్రానికి రచన డి.వి. నరసరాజు. దర్శకత్వం టి. రామారావు. ఆ సినిమా పేరు?
- ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి – వి. మధుసూదనరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జగ్గయ్య, వాణిశ్రీ, జయసుధలతో నిర్మించిన చిత్రం ఏది?
- తాంత్రిక ఛాయాగ్రాహకులు ‘రవికాంత్ నగాయిచ్’ తొలి చిత్రం ఎన్.టి.ఆర్. గారి ‘సీతారామకళ్యాణం’ అయితే, చివరి చిత్రం ఏది?
- ప్రఖ్యాత దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం పేరు?
- కోటయ్య గారి వాసు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయసుధ నటించిన చిత్రం ఏది?
- దర్శకులు వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం పేరు?
- కృష్ణ హీరోగా నటించిన ‘కెప్టెన్ కృష్ణ’ సినిమాకి సంగీతం అందించినది ఎవరు?
- విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన సినిమా స్కోప్ చిత్రం ఏది? ఛాయాగ్రహణం ఎస్.ఎస్.లాల్.
- అక్కినేని నాగేశ్వరరావు గారు ఏ చిత్రం షూటింగులో ఉండగా ‘మశూచి’ వ్యాధి బారిన పడ్డారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఏప్రిల్ 04వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 30 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఏప్రిల్ 09 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 28 జవాబులు:
1.కైకాల సత్యనారాయణ 2. శ్రీ రాజరాజేశ్వరి కాఫీ క్లబ్ 3. ఎస్.వి.రంగారావు, నాగభూషణం, అందరూ దొంగలే 4. రోటీ 5. పెళ్ళి కాని తండ్రి 6. ఆర్. నాగేశ్వరరావు 7. యాదేఁ 8. లక్షాధికారి 9. రేలంగి 10. విద్యా సిన్హా 11. సోహ్రాబ్ మోడీ తీసిన ఝాన్సీ కీ రాణి (1953)
సినిమా క్విజ్ 28 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- జానకి సుభద్ర పెయ్యేటి
- మణి నాగేంద్రరావు బి.
- మత్స్యరాజ విజయ
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సునీతా ప్రకాష్
- శంభర వెంకట రామ జోగారావు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]