Site icon Sanchika

సినిమా క్విజ్-31

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలు నటించిన ‘అర్ధాంగి’ చిత్రాన్ని హిందీలో టి. ప్రకాశరావు దర్శకత్వంలో, మార్కస్‍ బాట్లే ఛాయాగ్రహణంలో గురు దత్, మాలా సిన్హా నటించగా ఏ పేరుతో తీశారు?
  2. రాజేష్ ఖన్నా, మీనా కుమారి, ముంతాజ్‍లు నటించిన హిందీ చిత్రం ‘దుష్మన్’ – తెలుగులో శోభన్ బాబు, వాణిశ్రీ నటించగా ఏ పేరుతో రీమేక్ అయింది?
  3. హిందీ నటుడు గోవింద హీరోగా నటించిన ‘ఆంఖేఁ’ చిత్రం తెలుగులో వెంకటేష్ హీరోగా ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. హిందీలో సుభాష్ ఘాయ్ కొత్త హీరో హీరోయిన్లతో నిర్మించిన చిత్రం ‘హీరో’, తెలుగులో నాగార్జున తొలి చిత్రంగా ఏ పేరుతో రీమేక్ అయింది?
  5. మన్‍మోహన్ దేశాయి హిందీలో తీసిన ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ హిట్ చిత్రం తెలుగులో ఏ పేరున వచ్చింది?
  6. హిందీ చిత్ర నిర్మాత, నటుడు, దర్శకుడు అయిన మనోజ్ కుమార్ తీసిన ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ చిత్రం తెలుగులో ఏ పేరుతో రీమేక్ అయింది?
  7. శశి కపూర్, జయప్రదలు నటించిన ‘సిందూర్’ చిత్రం తెలుగులో కృష్ణంరాజు, జయప్రదలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. అమితాబ్ బచ్చన్, జీనత్ అమన్, ప్రాణ్‍లు నటించిన హిందీ చిత్రం ‘డాన్’ తెలుగులో ప్రభాస్ హీరోగా ఏ పేరుతో రీమేక్ అయింది?
  9. వి. మధుసూదన రావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీలు నటించిన ‘అండమాన్ అమ్మాయి’కి ఏ తమిళ చిత్రం ఆధారం?
  10. ‘నింగితో నేల అన్నది నను తాకరాదని’ ఘంటసాల పాడిన యీ పాట నాగేశ్వరరావు, కాంచనలు నటించిన ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలోనిది. దీనికి ఆధారమైన జెమినీ వారి శివాజీ గణేశన్ చిత్రం ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఏప్రిల్ 11వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 31 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఏప్రిల్ 16 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 29 జవాబులు:

1.ఆర్.డి. బర్మన్, ఎం.ఎం. కీరవాణి, మణిశర్మ 2. మజ్ను 3. షో 4. పెళ్ళి కాని పిల్లలు 5. పెళ్ళీడు పిల్లలు 6. గూండుక్కిళి 7. ఎంగవీట్టు పెణ్ 8. అల వైకుంఠపురంలో 9. లేత మనసులు 10. దేవుడే గెలిచాడు

సినిమా క్విజ్ 29 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version