సినిమా క్విజ్-35

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో – ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, ఉదయ కుమార్‍లతో – తోట సుబ్బరావు నిర్మించిన ‘భువన సుందరి కథ’లో చాకలి తిప్పడు పాత్రధారి ఎవరు?
  2. కదిరి వెంకటరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గుణసుందరి కథ’లో ముఖ్యపాత్రధారులు కస్తూరి శివరావు, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, రేలంగి కాకుండా శ్రీరంజని పతిగా నటించిన గంధర్వుడెవరు?
  3. ఛాయాచిత్ర పతాకం క్రింద మొదటిసారిగా 1964లో కె. ప్రత్యగాత్మ – ఎన్.టి.ఆర్., జమున, గుమ్మడి, జగ్గయ్యలతో తీసిన చిత్రానికి సంగీత దర్శకులు ఎవరు?
  4. అక్కినేని నాగేశ్వరరావు, జమున నటించిన ‘శ్రీకృష్ణమాయ’ చిత్రానికి సంగీతం టి.వి.రాజు అందించగా, దర్శకత్వం వహించినది ఎవరు?
  5. ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ధర్మేంద్ర, ఆశా పరేఖ్‍లు నటించిన ‘సమాధి’ (1972) చిత్రం తెలుగులో ఏ పేరిట రీమేక్ అయింది? (క్లూ: తెలుగులో ఎస్.డి. లాల్ దర్శకులు. శోభన్‍బాబు, జయచిత్రలు నటించారు).
  6. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి తమిళచిత్రం ‘మంత్రి కుమారి’కి కథ సమకూర్చగా; తెలుగులో మోడరన్ థియేటర్ వారు ఎన్.టి.ఆర్., గుమ్మడి, కృష్ణకుమారి గార్లతో నిర్మించగా, తెలుగులో కథ, మాటలు, పాటలు ‘ఆరుద్ర’ వ్రాశారని టైటిల్ కార్డులో వేసిన చిత్రం ఏది?
  7. నటుడు నాగభూషణం రవి ఆర్ట్ థియేటర్స్ పతాకంపై, ఎన్.టి.ఆర్., లక్ష్మి, కాంతారావు, రాజశ్రీలతో ‘ఒకే కుటుంబం’ చిత్రం నిర్మించగా, అందులో ‘జేమ్స్’ పాత్రలో నటించినది ఎవరు?
  8. ఎన్.టి.ఆర్., బి. సరోజాదేవి నటించిన ‘మాయని మమత’ చిత్రానికి దర్శకులు. కె. కామేశ్వర రావు. అందులో అశ్వత్థామ సంగీత దర్శకత్వంలో ఘంటసాల పాడిన ‘రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం’ పాటని రచించనదెవరు?
  9. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకం క్రింద నాగేశ్వరరావు, భారతి నటించిన ఏ చిత్రానికి డి. యోగానంద్ దర్శకుడు?
  10. యు. విశ్వేశ్వరరావు తీసిన సస్పెను, జానపద చిత్రం ‘కంచుకోట’లో ఎన్.టి.ఆర్. కు తండ్రిగా చిత్తూరు వి. నాగయ్య గారు నటిస్తే, పినతండ్రిగా వేసిన నటుడు ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మే 9వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 35 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 మే 14 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 33 జవాబులు:

1.మంచివాడు (1974) 2. ధర్మపత్ని (1941) 3. ప్రేమ తరంగాలు (1980) 4. అనుబంధం (1984) 5. మరపు రాని మనిషి (1973) 6. రాజకీయ చదరంగం 7. వీలునామా 8. ఖయామత్ (1983) 9. తడినాధ వరప్రసాద్ 10. ఖైదీ కాళీదాసు

సినిమా క్విజ్ 33 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సునీతా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here