సినిమా క్విజ్-37

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. అక్కినేని ‘పెళ్ళి సందడి’ చిత్రంలో – ‘రావే ప్రేమలతా’; ఎన్.టి.ఆర్. ‘జయసింహ’ చిత్రంలో – ‘మది లోని మధుర భావం’ పాటలను ఘంటసాలతో కలిసి పాడిన గాయని ఎవరు?
  2. సి.వి.శ్రీధర్ దర్శకత్వంలో శశికపూర్ పక్కన నాయికగా రాజశ్రీ నటించిన చిత్రం ఏది?
  3. ‘తీస్కో కోక కోల, వేస్కో రమ్ము సారా’ పాటని యల్.ఆర్. ఈశ్వరి ఏ సినిమా కోసం పాడారు?
  4. “బాలకా! నీ వెంత కవ్వించినా, నీ పై కనికరమే కలుగుతోంది, కసి రేగడం లేదురా బాలకా!” ఈ డైలాగు ఎస్.వి.రంగారావు – అక్కినేనితో ఏ చిత్రంలో అన్నారు?
  5. 1954లో ఎం.ఎస్. శ్రీరాములు నాయుడు గారు మూడు భాషలలో ఒకేసారి తీసిన చిత్రాలు ఏవి? హీరోలెవరు?
  6. తాతినేని రామారావు దర్శకత్వంలో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించగా శోభన్ బాబు, జయసుధ నటించిన సినిమా ఏది?
  7. మృణాల్ సేన్ దర్శకత్వంలో జి. వి. నారాయణరావు, ఎం.కె. వాసుదేవరావు నటించగా 1977లో విడుదలై నేషనల్ అవార్డు పొందిన చిత్రం ఏది?
  8. అక్కినేని నాగేశ్వరరావుకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సంవత్సరం?
  9. 1972లో తెలుగులో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా ఫిలిం‍ఫేర్ అవార్డు ఎవరికి దక్కింది?
  10. జకార్తా ఫిలిం ఫెస్టివల్‍లో కళాదర్శకులు టివిఎస్ శర్మ గారికి, ఎస్.వి.రంగారావు గారికి దేనికి అవార్డులు వచ్చాయి?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మే 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 37 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 మే 28 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 35 జవాబులు:

1.ఉదయ కుమార్ 2. వి. శివరాం 3. ఎస్. రాజేశ్వరరావు, టి. చలపతిరావు 4. సి.ఎస్.రావు 5. నిండు మనిషి (1978) 6. వీరకంకణం 7. సి.హెచ్. నారాయణరావు 8. దేవులపల్లి కృష్ణశాస్త్రి 9. జై జవాన్ 10. ఉదయ కుమార్

సినిమా క్విజ్ 35 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మణినాగేంద్రరావు బొండాడ
  • మత్స్యరాజ విజయలక్షి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రేయ ఎస్. క్షీరసాగర్
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • యం.రేణుమతి
  • కొన్నే ప్రశాంత్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here