Site icon Sanchika

సినిమా క్విజ్-39

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎ.కె. వేలన్ నిర్మాతగా, ఆయనే దర్శకత్వం వహించగా ఎన్.టి.ఆర్., దేవికలు నటించిన చిత్రం (1966) ఏది?
  2. జగ్గయ్య, షావుకారు జానకిలు నటించిన ‘భలే బావ’ చిత్రానికి దర్శకులు ఎవరు?
  3. తెరపై నాయిక శ్రీరంజని (జూ) అభినయించగా, ‘మల్లెపూలు మొల్లపూలు కల్వపూలు కావాలా’ అని రావుల బాలసరస్వతి ఏ చిత్రంలో పాడారు? (క్లూ: 1954లో వచ్చిన జెమినీ వారి చిత్రం. హీరో శ్రీరామ్.)
  4. ధ్రా సిస్టర్స్‌గా పేరుపొందిన నటీమణులెవరు? (క్లూ: ఈ సోదరీమణులిద్దరూ ఎన్.టి.ఆర్ గారి ‘సీతారామ కళ్యాణం’ (1961) సినిమాలో నటించారు)
  5. ట్రావెన్‍కూర్ సిస్టర్స్‌గా పేరుపొందిన నటీమణులెవరు?
  6. ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ అనే పాటని ఘంటసాల ఆలపించగా, టి. ప్రకాశరావు దర్శకత్వంలో తొలిసారిగా పరిచయమైన ‘హేమలత’ నటించిన చిత్రం ఏది?
  7. సైన్స్ పట్టభద్రుడు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, నాటకాలలో వేషాలు వేసిన జె.వి.రమణమూర్తి మొదటి సినిమా ఏది? (క్లూ: దర్శకుడు కె.బి. తిలక్)
  8. కారెక్టర్ ఆర్టిస్ట్ రావు గోపాలరావు గొంతు సరిగా లేదని విల‍న్‍గా వేసిన ఏ చిత్రంలో ఆయనకి డబ్బింగ్ చెప్పించారు?
  9. 1953లో ద్వారా నటీమణి జమునతో కలిసి (ఒకే సినిమాతో) వెండితెరకు ఒక ప్రముఖ హాస్య నటుడు పరిచయం అయ్యారు? నేటి ప్రసిద్ధ హీరోకి మామగారైన ఆయన ఎవరు? ఆ చిత్రం ఏది?
  10. 1959లో వచ్చిన హిందీ చిత్రం ‘ధూల్ కా ఫూల్’ ఆధారంగా తెలుగులో శివాజీ గణేశన్, కృష్ణంరాజు, జగ్గయ్య, వాణిశ్రీ, జయసుధ నటించిన చిత్రం ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జూన్ 06వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 39 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూన్ 11 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 37 జవాబులు:

1.రావు బాల సరస్వతి 2. ప్యార్ కియే జా 3. రౌడీలకు రౌడీలు 4. మాయాబజార్ 5. మళై కళ్ళన్ -ఎంజిఆర్, అగ్గిరాముడు-ఎన్.టి.ఆర్., ఆజాద్- దిలీప్ కుమార్‍ 6. రాజు వెడలె 7. ఒక ఊరి కథ 8. 1990 9. ఎన్.టి.ఆర్., బడిపంతులు సినిమాకి 10. నర్తనశాల చిత్రంలో కీచక పాత్రకు ఎస్.వి.రంగారావు గారికి, ఉత్తమ కళాదర్శకులుగా టివిఎస్ శర్మ గారికి

సినిమా క్విజ్ 37 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version