Site icon Sanchika

సినిమా క్విజ్-4

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కిళాంబి వేంకట నరసింహాచార్యులు గారు ___ పేరుతో ప్రసిద్ధులు.
  2. డా. సి. నారాయణ రెడ్డి గారు ఏ చిత్రంలో తాను రాసిన పాటను స్టేజీపై తానే పాడుకున్నారు?
  3. ‘ఓహో బస్తీ దొరసాని, బాగా ముస్తాబయింది అందాచందాల రాణి’ పాట ఏ చిత్రం లోనిది? ఆ పాట మాతృక అయిన హిందీ చిత్రం ఏది?
  4. ‘రావె రాధా రాణీ రావే, రాధ నీవే కృష్ణుడ నేనే’ అను పాట ‘శాంతినివాసం’ సినిమా లోనిది. ఈ పాట మాతృక అయిన హిందీ చిత్రం పేరేమిటి?
  5. ‘కానిస్టేబుల్ కూతురు’ చిత్రానికి కథను సమకూర్చినది ఎవరు?
  6. ‘రాము’ (ఎన్.టి.ఆర్) చిత్రానికి కథ వ్రాసినది ఎవరు?
  7. విశ్వనాథన్-రామ్మూర్తి గార్లు తెలుగులో మొట్టమొదట సంగీతం సమకూర్చిన చిత్రం పేరేమిటి?
  8. ‘అందాల సీమా సుధా నిలయం, ఈ లోకమే దివ్య ప్రేమమయం’ పాటను రమేష్ నాయుడి సంగీత దర్శకత్వంలో పాడినది ఎవరు?
  9. పేకేటి శివరాం దర్శకత్వం వహించిన ఎన్.టి.ఆర్ చిత్రం ‘కులగౌరవం’ కు సంగీత దర్శకుడు ఎవరు?
  10. ఎన్.టి.ఆర్, కృష్ణంరాజు, రామకృష్ణలు నటించిన సినిమా ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 అక్టోబరు 04వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 4 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 అక్టోబరు 09 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 2 జవాబులు:

1.మాడ్ మాక్స్ 2. ఫస్ట్ బ్లడ్ 3. తుమ్ సా నహీ దేఖా 4. రాజా రమేష్ 5. ఆరాధన 6. ఆత్మబలం 7. మాంగల్యబలం 8. ఎదురీత 9. బాటసారి

సినిమా క్విజ్ 2 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version