Site icon Sanchika

సినిమా క్విజ్-41

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. వై.ఆర్. స్వామి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించిన ‘వద్దంటే డబ్బు’ సినిమాలో జిక్కి పాడిన ‘అల్లది, అవతల, అదిగో, నా ప్రియా కుటీర వాటిక’ అనే పాటని షావుకారు జానకి తెరపై అభినయించారు. ఈ సినిమా సంగీత దర్శకులు ఎవరు?
  2. దర్శకులు ఎస్. వి. రంగారావు ఏ సినిమా కోసం ‘నవ్వని పువ్వే నవ్వింది తన తుమ్మెద రాజును రమ్మంది’ అనే పాటను ఘంటసాల, సుశీల గార్లు పాడగా – హరనాథ్, జమునలపై చిత్రీకరించారు?
  3. ‘రేయి ఆగిపోనీ, రేపు ఆగిపోనీ, యీ ప్రేమ వాహిని అలా సాగిపోనీ’ అనే సి. నారాయణ రెడ్డి పాటని సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో ఏ సినిమా కోసం – పి. సుశీల, మహమ్మద్ రఫీ పాడారు?
  4. దర్శకులు డి. యోగానంద్ – ఘంటసాల సంగీత దర్శకత్వంలో – ఘంటసాల, పి. లీల పాడిన ‘ఛమక్ ఛమక్ తారా ఝణక్ ఝణక్ తారా’ అనే పాటను అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవిపై ఏ సినిమాలో చిత్రీకరించారు?
  5. శ్రీశ్రీ రచించిన ‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాటని ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల పాడిన పాట అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏ చిత్రం లోనిది?
  6. దర్శకులు వి. మధుసూదనరావు ఏ సినిమా కోసం – టివి రాజు సంగీత దర్శకత్వంలో – ఘంటసాల, పి. సుశీల పాడిన ‘రావోయి రాజా, మనసైన రాజా’ పాటను ఎన్.టి.ఆర్., దేవికలపై చిత్రీకరించారు?
  7. మల్లాది రామకృష్ణ శాస్త్రి వ్రాయగా – ఘంటసాల సంగీత దర్శకత్వంలో – ఘంటసాల, పి. లీల పాడిన ‘ఎందాక ఎందాకా ఎందాకా, అందాక అందాక అందాకా’ అనే పాటను ఏ సినిమా కోసం వేదాంతం రాఘవయ్య – ఎన్.టి.ఆర్., జమునపై చిత్రీకరించారు?
  8. స్వరబ్రహ్మ కె. వి. మహదేవన్ తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన తెలుగు సినిమాకి పాటలు ఆచార్య ఆత్రేయ వ్రాశారు. జగ్గయ్య, జి. వరలక్ష్మి, సి.ఎస్.ఆర్. నటించిన ఈ చిత్రానికి దర్శకులు భీమవరపు నరసింహారావు. ఆ సినిమా ఏది?
  9. ఆచార్య ఆత్రేయ వ్రాయగా పి.బి.శ్రీనివాస్ తన మధురమైన కంఠంతో ఎన్.టి.ఆర్. గారికి ప్లేబాక్ ఇచ్చిన ‘తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా’ అనే పాటకి విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం అందించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరేమిటి?
  10. సి. నారాయణ రెడ్డి వ్రాసిన ‘చెలికాడు నిన్నే పిలువా చేర రావేలా’ అనే పాటను ఎస్. రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో ఏ సినిమా కోసం ఘంటసాల, పి. సుశీల పాడారు? ఈ సినిమాకి దర్శకులు కోటయ్యగారి ప్రత్యగాత్మ.

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జూన్ 20వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 41 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూన్ 26 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 39 జవాబులు:

1.మంగళసూత్రం 2. రజనీకాంత్ సబ్నవీస్ 3. రాజీ నా ప్రాణం 4. స్వర్ణ, మణి (గీతాంజలి) 5. లలిత, పద్మిని, రాగిణి 6. పల్లెటూరు 7. ఎం.ఎల్.ఎ. (1957) 8. జగత్‍ కిలాడీలు 9. అల్లు రామలింగయ్య, పుట్టిల్లు సినిమా 10. జీవన తీరాలు (1977)

సినిమా క్విజ్ 39 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version