[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ఆరుద్ర రచించగా, ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతంలో ఘంటసాల, సుశీల పాడిన ‘నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి’ పాటని దర్శకులు కె. బాలచందర్ ఏ సినిమా కోసం శోభన్ బాబు, రాజశ్రీలపై చిత్రీకరించారు?
- శ్రీశ్రీ రచించిన ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై’ పాటను ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో ఘంటసాల పాడగా, ఏ సినిమా కోసం దర్శకులు ఆదుర్తి సుబ్బారావు అక్కినేని నాగేశ్వరరావుపై చిత్రీకరించారు?
- ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో ఎ. ఎం. రాజా పాడిన ‘చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా’ పాట ఏ సినిమాలోది? (దర్శకులు పి. ఎస్. రామకృష్ణారావు)
- తాపీ చాణ్యక దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కోసం ఘంటసాల, సుశీల పాడిన ‘ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసీ’ అనే పాటని ఎన్.టి.ఆర్., అంజలీదేవిపై చిత్రీకరించారు?
- పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, గుమ్మడి నటించిన ఏ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీతంలో శ్రీశ్రీ రచించిన ‘నందుని చరితం వినుమా’ అనే పాటని చిత్రీకరించారు?
- ఆచార్య ఆత్రేయ రచించిన ‘దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం’ పాటను కె.వి. మహదేవన్ సంగీతంలో ఘంటసాల, పి.సుశీల పాడగా, ఏ సినిమా కోసం దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి లపై చిత్రీకరించారు?
- పింగళి నాగేంద్రరావు రచించగా, స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాల పాడిన ‘ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ’ పాట ఏ సినిమాలోది? ఎన్.టి.రామారావు, శ్రీరంజని, సావిత్రి నటించిన ఈ సినిమాకి కమలాకర కామేశ్వరరావు తొలిసారి దర్శకత్వం వహించారు.
- కథ, మాటలు, పాటలు అని టైటిల్ కార్డులో సదాశివబ్రహ్మం అనే వేశారు. కానీ యీ చిత్రానికి కథ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ‘నౌకాడూబీ’ (Ship wreck). ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, రేలంగి, అంజలీ దేవి, సావిత్రి ఉన్న ఈ చిత్రానికి టి.ప్రకాశరావు దర్శకులు. సినిమా పేరేమిటి?
- ‘తాయారమ్మ బంగారయ్య’, ‘దేవతలారా దీవించండి’ చిత్రాల దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు – ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తికి ఏమవుతారు?
- ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి ‘చిట్టి చెల్లెలు’ చిత్రంలో అల్లుడు పాత్రధారి హరనాథ్‌ను చంపేసిన మామ పాత్రధారి ఎవరు? ఇందులో ఎన్.టి.ఆర్. చెల్లెలిగా వాణిశ్రీ నటించారు.
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జూన్ 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 42 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూలై 02 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 40 జవాబులు:
1.కుంకుమ రేఖ (1960) 2. ఖత్రోం కే ఖిలాడీ (1988) 3. కిరాయి దాదా 4. మూగజీవులు 5. సుల్తాన్ (1999) 6. అధిపతి 7. గుడ్ బై, లెనిన్ 8. సంజయ్ దత్ 9. చుట్టరికాలు 10. ఆమె ఎవరు?
సినిమా క్విజ్ 40 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మణి నాగేంద్ర రావు బి.
- పారుపల్లి అజయ్ కుమార్
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సునీతా ప్రకాష్
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రేయా ఎస్. క్షీరసాగర్
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వనమాల రామలింగాచారి
- దీప్తి మహంతి
- జి. స్వప్న
- యం.రేణుమతి
- కొన్నె ప్రశాంత్
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]