సినిమా క్విజ్-48

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఐ.ఎన్. మూర్తి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారిలు నటించిన ఏ చిత్రానికి (1963) ‘శైలజానంద ముఖర్జీ’ కథ సమకూర్చారు?
  2. తమిళ నిర్మాత, దర్శకులు టి.ఆర్. రామన్న- ఎం.జి.ఆర్., బి. సరోజాదేవితో ‘పెరియ యిడత్తు పెణ్’; తెలుగులో ఐ.ఎన్. మూర్తి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి తో ఒకే సారి తీశారు. తెలుగు సినిమా పేరు?
  3. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనం’ అన్న పాట ఏ సినిమా లోది? (క్లూ. దర్శకత్వం: ఎస్.ఎస్. రవిచంద్రన్. బాలకృష్ణ, భానుప్రియ హీరో హీరోయిన్‍లు)
  4. రచయిత డి. వి. నరసరాజు దిలీప్ కుమార్ గారి ఏ హిందీ చిత్రానికి కథ, స్క్రీన్‍ప్లే అందించారు?
  5. కె.వి. నందన్‍రావు దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీలు నటించిన ఏ సినిమాకి దాసరి నారాయణరావు తొలిసారిగా సంభాషణలు అందించారు?
  6. పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వంలో నటుడు నాగభూషణం, రాజసులోచనలు నటించిన చిత్రం ఏది?
  7. కె. ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో పి. సుశీల పాట పాడిన హిందీ చిత్రం ఏది?
  8. ఎస్.ఎస్.ఆర్.శర్మ దర్శకత్వంలో, చెళ్లపిళ్ళ సత్యం గారు సంగీత దర్శకత్వం వహించిన ఏ చిత్రంలో హరనాథ్, జమున ప్రధాన పాత్రలు పోషించారు?
  9. గాయని పి. లీల, హీరో ఎన్.టి.ఆర్.ల తొలి చిత్రం ఏది?
  10. కైకాల సత్యనారాయణ తొలిసారిగా హీరోగా నటించిన సినిమాలో జమున నాయిక. పి. చెంగయ్య దర్శకత్వంలో, ఎం. సుబ్రహ్మణ్యరాజు సంగీతం అందించిన ఆ చిత్రం పేరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఆగస్ట్ 08 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 48 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఆగస్ట్ 13 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 46 జవాబులు:

1.మంచు భక్తవత్సలం నాయుడు 2. కొణిదెల శివశంకర వరప్రసాద్ 3. శివాజీ రావు గైక్వాడ్ 4. కిళాంబి వెంకట నరసింహాచార్యులు 5. భాగవతుల సదాశివశంకర శాస్త్రి 6. ఇందుకూరి రామకృష్ణంరాజు 7. కుసుమకుమారి/గ్రేసీ 8. ప్రమీలా దేవి 9. జ్ఞానదేశికన్ 10. ది కార్సికన్ బ్రదర్స్

సినిమా క్విజ్ 46 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాశ్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రేయా ఎస్. క్షీరసాగర్
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • యం.రేణుమతి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here