సినిమా క్విజ్-53

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. నటుడు శరత్‍బాబు అసలు పేరు?
  2. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, రంభ, రావుగోపాలరావు నటించిన తెలుగు సినిమా అక్షయ్ కుమార్, జుహీ చావ్లా, ఖాదర్‍ఖాన్‍లతో ఏ పేరిట హిందీలో రీమేక్ అయింది (హిందీ సినిమా పేరు)?
  3. సి.వి. రంగనాథ్ దాస్ దర్శకత్వం వహించిన సాధనా వారి ‘సంతానం’ చిత్రంలో నాగేశ్వరరావు-సావిత్రి, అమర్‍నాథ్-శ్రీరంజని జంటలుగా నటించారు. ఈ సినిమాలో చలం పక్కన జోడీగా నటించినది ఎవరు?
  4. 1951లో విజయావారు ‘పాతాళభైరవి’ చిత్రంలో ఎన్.టి.ఆర్., మాలతి గార్లు హీరో హీరోయిన్‍లుగా చేశారు. 1959లో పొన్నలూరి బ్రదర్స్ వారు తీసిన ‘దైవబలం’ చిత్రంలో మాలతి ఎన్.టి.ఆర్.‍ పక్కన ఏ పాత్ర పోషించారు?
  5. ఎన్.టి.ఆర్. మూడు పాత్రలు ధరించి, దర్శకత్వం వహించిన ‘దానవీరశూరకర్ణ’ సినిమాలో ఇంద్రుని పాత్ర పోషించిన నటుడు ఎవరు?
  6. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘పూవా?తలైయా?’ ఏ పేరిట తెలుగులో రీమేక్ అయింది?
  7. సముద్రాల రాఘవాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘వినాయక చవితి’ చిత్రంలో ఎన్.టి.ఆర్. కృష్ణుడిగా, సత్యభామగా జమున నటించారు. రుక్మిణీదేవి పాత్రలో నటించిన నటి ఎవరు?
  8. ఆర్.కె. ధర్మరాజు కథ, పెండ్యాల సంగీతం అందించగా; స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించి కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించగా ఎన్.టి.ఆర్, జమున, అంజలీదేవిలు నటించిన చిత్రం ఏది?
  9. లలితాశివజ్యోతి వారి ‘లవకుశ’ చిత్రంలో రామునిగా ఎన్.టి.ఆర్., సీతగా అంజలీదేవి నటించగా, ఋష్యశృంగునిగా నటించినది ఎవరు?
  10. 1977లో రంగనాథ్, జయప్రదలతో తీసిన ‘అందమె ఆనందం’ సినిమాకి దర్శకుడు ఎవరు?
  11. 1952లో జెమిని ఎస్.ఎస్.వాసన్ గారు తమిళం, తెలుగు భాషల్లో నాగేంద్రరావు దర్శకత్వంలో – విక్టర్ ఫ్లెమింగ్ గారి అమెరికన్ ఫిల్మ్ ‘ది వే ఆఫ్ ఆల్ ఫ్లెష్’ ఆధారంగా కన్నాంబ, ఎం.కె. రాధ, జెమినీ గణేశన్, శ్రీరాం లతో సినిమా తీసి ఘోర పరాజయం పొందారు. దీన్ని తాళలేక ఎస్.ఎస్.వాసన్ గారు ఆ సినిమా ప్రింట్లనన్నింటిని తగులబెట్టించారు. తెలుగు సినిమా పేరేమిటి?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 సెప్టెంబర్ 12 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 53 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 సెప్టెంబర్ 17 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 51 జవాబులు:

1. కె. వి. ఎన్. శర్మ 2. శ్రీ నిత్యానంద్ 3. సి. మోహన్ దాస్ 4. ఎస్. పి. కోదండపాణి 5. టి. వి. రాజు 6. బి.శంకర్ 7. గుమ్మడి వెంకటేశ్వరరావు 8. ఎస్.వి. రంగారావు 9. సుకన్య 10. నాగభూషణం

సినిమా క్విజ్ 51 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మణి నాగేంద్రరావు బి.
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సరస్వతి పొన్నాడ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • కొన్నె ప్రశాంత్
  • యం.రేణుమతి
  • జి. రాధిక
  • టి. సౌఖ్య
  • కె. గాయత్రి
  • వికాస్ చౌదరి ఎస్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here