సినిమా క్విజ్-54

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన అన్నపూర్ణ వారి ‘వెలుగునీడలు’ చిత్రంలో జగ్గయ్య డాక్టర్ రఘునాథ్ పాత్రలో నటించారు. అతని చిన్న వయసులో ఆ పాత్రలో నటించినది ఎవరు?
  2. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలు నటించిన అన్నపూర్ణ వారి ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంలో డాక్టర్ శ్రీదేవి పాత్రలో నటించినది ఎవరు?
  3. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ, మీనా, నగ్మా నటించిన చిత్రంలో హిందీ గాయని ‘ఆశా భోస్లే’ పాడారు. ఆ సినిమా ఏది?
  4. దర్శక నిర్మాత కె.వి.రెడ్డి దరకత్వంలో విజయావారి ‘జగదేకవీరుని కథ’లో ఎన్.టి.ఆర్. కథానాయకుడు కాగా, అతని భార్యలలో ఒకరైన నాగకన్య (ఎల్. విజయలక్ష్మి) తండ్రిగా నటించిన నటుడు ఎవరు?
  5. ఆర్. ఆర్. పిక్చర్స్ పతాకంపై టి.ఆర్. రామన్న దర్శకత్వంలొ వచ్చిన ‘మంచీ-చెడు’ చిత్రంలో ఎన్.టి.ఆర్., బి. సరోజ నటించగా, ఎన్.టి.ఆర్. తండ్రి పాత్ర పోషించిన నాగభూషణంకు భార్యగా నటించినది ఎవరు?
  6. తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లె’ చిత్రం తెలుగులోనూ, హిందీలోనూ రీమేక్ అయింది. మూడు చిత్రాలలోనూ నటించిన ఒకే హీరోయిన్ పేరు?
  7. బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు నటించిన ‘మన ఊరి పాండవులు’ ఏ కన్నడ చిత్రానికి రీమేక్ (క్లూ. దర్శకుడు ఎస్.ఆర్. పుట్టణ్ణ కణగల్)?
  8. బాపు దర్శకత్వంలో మాస్టర్ ప్రభాకర్, నాగభూషణం నటించిన ‘బాలరాజు కథ’ ఏ తమిళ చిత్రానికి రీమేక్?
  9. బాపు దర్శకత్వంలో చంద్రమోహన్, విజయనిర్మల నటించిగా 1968లో వచ్చిన ‘బంగారు పిచుక’ సినిమాని 1994లో తిరిగి నరేష్, దివ్యవాణిలతో బాపు ఏ పేరుతో తీశారు?
  10. బాపు దర్శకత్వంలో అల్లరి నరేష్, చార్మి నటించిన ‘సుందరకాండ’ సినిమాకి ఏ హాలీవుడ్ చిత్రం ఆధారం?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 సెప్టెంబర్ 19 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 54 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 సెప్టెంబర్ 24 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 52 జవాబులు:

1.మంచి రోజులు వచ్చాయి (1972) 2. జానీ దోస్త్ 3. రాయలసీమ 4. దీవానా మస్తానా (1997) 5. ధూళిపాళ సీతారామశాస్త్రి 6. జి. వరలక్ష్మి 7. సుమ 8. ముక్కామల కృష్ణమూర్తి 9. మార్కస్ బార్ట్లే, టి.జి.లింగప్ప 10. కలెక్టర్ జానకి

సినిమా క్విజ్ 52 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మణి నాగేంద్రరావు బి.
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • కొన్నె ప్రశాంత్
  • యం.రేణుమతి
  • జి. రాధిక
  • హెచ్. లత
  • నందు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here