[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- కన్నడంలో రాజ్‍కుమార్, భారతి, కల్పనలతో తీసిన ‘బిడుగడ’ అనే సినిమాకి ప్రేరణ 1946లో వచ్చిన The Man Who Dared, 1956లో వచ్చిన Beyond a Reasonable Doubt అనే రెండు ఆంగ్ల చిత్రాలని చెప్తారు. ఈ సినిమాల ఇతివృత్తాలనే పోలివుండే యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెలుగులో వచ్చిన సినిమా ఏది? (నవల పేరు, సినిమా పేరు ఒకటే).
- బి. దొరైరాజ్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ‘చందనద గొంబె’ (1979)లో అనంత్ నాగ్, లక్ష్మి, లోకేష్ నటించారు. డి. సత్యం దర్శకత్వంలో రామకృష్ణ, చంద్రమోహన్, సుజాతలు నటించగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు సినిమా పేరు?
- 1983లో రాజేష్ ఖన్నా, టీనా మునీమ్, పద్మినీ కొల్హాపురి నటించిన ‘సౌతన్’ అనే హిందీ చిత్రాన్ని కృష్ణ, జయపద్ర, సుహాసినిలతో తెలుగులో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- 1974లో విడుదలైన తమిళ చిత్రం ‘ఎంగమ్మ శపథం’లో ముత్తురామన్, శివకుమార్, జయచిత్రలు నటించారు. జివిఆర్ శేషగిరి రావు దర్శకత్వంలో చంద్రమోహన్, చంద్రకళ, లక్ష్మిలు నటించగా తెలుగులో ఏ పేరుతో రీమేక్ అయింది?
- 1996లో వచ్చిన ‘ఈ పూజయుమ్ కాదన్ను’ అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో జగపతిబాబు, సౌందర్యలతో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- ప్రముఖ నిర్మాత, దర్శకుడు పి. పుల్లయ్య భార్య, నటి శాంతకుమారి గారి అసలు పేరు?
- ‘గూడుపుఠాణి’ చిత్రంలో కృష్ణ, శుభలు ప్రధాన పాత్రలలో నటించారు. నిజ జీవితంలో (సినిమాల్లో కాదు) ‘శుభ’ గారి తండ్రి ఎవరు?
- ప్రముఖ హిందీ నటి, ట్రాజెడీ క్వీన్ అని పేరు పొందిన మీనాకుమారి అసలు పేరు?
- ప్రముఖ హిందీ హీరో సంజీవ్ కుమార్ అసలు పేరు ఏమిటి?
- ప్రముఖ హిందీ హీరోయిన్, సునీల్ దత్ భార్య, సంజయ్ దత్ అమ్మ ‘నర్గీస్’ గారి అసలు పేరు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 సెప్టెంబర్ 26 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 55 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 అక్టోబర్ 1 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 53 జవాబులు:
1.సత్యనారాయణ దీక్షితులు 2. మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడీ 3. కుసుమ కుమారి 4. తల్లి 5. చలపతిరావు 6. బొమ్మా బొరుసా (1971) 7. కృష్ణకుమారి 8. దీక్ష (1974) 9. వల్లభజోస్యుల శివరాం 10. సింగీతం శ్రీనివాసరావు 11. ముగ్గురు కొడుకులు
సినిమా క్విజ్ 53 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మణి నాగేంద్రరావు బి.
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- కొన్నె ప్రశాంత్
- పి. మహేష్
- ఎస్. లక్ష్మణ్
- జి. మమత
- జె. భార్గవి
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]