Site icon Sanchika

సినిమా క్విజ్-6

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. శివాజీ గణేశన్, పద్మిని నటించిన ‘మరకతం’ అనే తమిళ చిత్రం ఆధారంగా తీసిన తెలుగు చిత్రం ఏది?
  2. ‘ఇంటికి దీపం యిల్లాలే’ చిత్రంలో ఎన్‍టిఆర్ పోషించిన పాత్రను తమిళంలో ఎవరు పోషించారు?
  3. నాగభూషణం నిర్మించిన ‘ఒకే కుటుంబం’ చిత్రానికి తమిళ మాతృక ఏది?
  4. ‘తోడు నీడ’ (ఎన్‌టిఆర్, జమున, భానుమతి) చిత్రం ఏ పేరున హిందీలో వచ్చింది?
  5. దాదా మిరాసి దర్శకత్వంలో వచ్చిన ఎన్‍టిఆర్ సినిమా ఏది?
  6. ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో, ఎ.ఎన్.ఆర్, ఎన్‌టిఆర్ లు నటించారు. హిందీలో ఎవరెవరు వీరి పాత్రల్లో నటించారు?
  7. ‘మన్ డోలే తెరా తన్ డోలే’ హిట్ పాట హిందీలో లతా మంగేష్కర్ పాడగా, తెలుగులో ఎ.ఎం.రాజా, సుశీలలు పాడారు. ఆ చిత్రం ఏది?
  8. అక్కినేని, వాణిశ్రీ నటించిన ‘పవిత్రబంధం’ చిత్రం ఏ తమిళ చిత్రానికి ఆధారం?
  9. పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి గార్లు పాడిన ‘సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను’ పాట ఏ చిత్రం లోనిది?
  10. ‘పడుచుదనం రైలుబండి పోతున్నది, వయసు వాళ్ళకందులో చోటున్నది’ పాట ఏ చిత్రం లోనిది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 అక్టోబరు 18వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 6 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 అక్టోబరు 23 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 4 జవాబులు:

1.ఆచార్య ఆత్రేయ 2. మొగుడా? పెళ్ళామా? 3. అభిమానం, సిఐడి 4. ఉజాలా 5. సి. వి. శ్రీధర్ 6. జావర్ సీతారామన్ 7. మా గోపి 8. తలత్ మహమూద్ 9. టి. జి.లింగప్ప 10. మంచికి మరో పేరు

సినిమా క్విజ్ 4 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version