Site icon Sanchika

సినిమా క్విజ్-60

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రాధ (తొలి పరిచయం) నటించిన ‘గోపాలకృష్ణుడు’ (1982) సినిమాకి శివాజీ గణేశన్ హీరోగా నటించిన ఏ తమిళ చిత్రం ఆధారం?
  2. మిద్దె రామారావు నిర్మాతగా, ఎస్. ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి, రాధిక, నటించిన ‘పల్లెటూరి మొనగాడు’ సినిమాకి ఏ తమిళ చిత్రం మూలం?
  3. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, రఘువరన్, సుజిత నటించిన ‘పసివాడి ప్రాణం’ చిత్రానికి ఏ మలయాళ చిత్రం మూలం? (క్లూ: ఫాజిల్ దర్శకత్వంలో ముమ్ముట్టి, సురేష్ గోపి, సుజిత నటించారు)
  4. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రాజీవ్ కృష్ణ, సులేఖలు నటించిన ‘ఆహా’ (1997) చిత్రం – అక్కినేని నాగార్జున నిర్మాణంలో సురేష్ కృష్ణ దర్శకత్వంలో జగపతిబాబు, రఘువరన్, సంఘవి, జయసుధలు నటించగా తెలుగులో ఏ పేరిట రీమేక్ అయింది?
  5. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించిన ‘శ్రీకృష్ణతులాభారం’ (1966) సినిమాలో జాంబవతిగా ఎవరు నటించారు?
  6. కన్నడంలో కాశీనాథ్, భవ్య నటించిన ‘అవళె నన్న హెండ్తి’ (1987) చిత్రాన్ని రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, అశ్వనిలతో – తెలుగులో ఏ పేరిట రీమేక్ చేశారు?
  7. తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయప్రద నటించిన ‘యమగోల’ చిత్రం – డి. యోగానంద్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, శ్రీప్రియ నటించగా తమిళంలో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో శోభన్ బాబు, జయప్రద, శారదలు నటించిన ‘సంసారం’ (1988) చిత్రం – శివాజీ గణేశన్, పద్మిని, విసులు నటించిన ఏ తమిళ చిత్రానికి రీమేక్?
  9. ఎస్. ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి, మాధవి, లక్ష్మి నటించిన ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాకి – ఎస్. ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్, పూర్ణిమాదేవి, వసుమతి నటించిన ఏ తమిళ చిత్రం మూలం?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 అక్టోబర్ 31 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 60 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 నవంబర్ 05 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 58 జవాబులు:

1.పుణ్యవతి 2. మొనగాళ్ళకు మొనగాడు (1966) 3. అనాడీ (1959, రాజ్ కపూర్, నూతన్) 4. చల్లని నీడ 5. పట్నం వచ్చిన పతివ్రతలు (1982) 6. మంకుతిమ్మ 7. హబ్బ (1999) 8. గురజాడ కృష్ణదాసు వెంకటేష్ 9. దేవుని గెలిచిన మానవుడు 10. కిళుక్కుం (1991)

సినిమా క్విజ్ 58 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version