సినిమా క్విజ్-7

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. సావిత్రి, రామశర్మ నటించిన తెలుగు చిత్రం ఏది?
  2. రేలంగి, అంజలీదేవి హీరోహీరోయిన్‍లుగా నటించిన చిత్రం పేరు?
  3. రేలంగి, సావిత్రి నాయికానాయకులుగా నటించిన చిత్రం పేరు?
  4. సూర్యకాంతం, ఎస్.వి.రంగారావులు ఎన్నో చిత్రాలలో దంపతులుగా నటించారు. కానీ ఈ చిత్రంలో సూర్యకాంతం కుమారుడిగా ఎస్.వి.రంగారావు నటించారు?
  5. విజయ ప్రొడక్షన్స్ వారి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో నటించని ప్రముఖ హీరోయిన్ ఎవరు?
  6. తెలుగులో మొదటి సినిమా స్కోప్ చిత్రం (బ్లాక్ అండ్ వైట్, పాక్షికంగా) ఏది?
  7. తెలుగులో మొదటి కలర్ సినిమా స్కోప్ చిత్రం (పాక్షికంగా) ఏది?
  8. మలయాళంలో నిర్మించిన ‘పునర్జన్మం’ చిత్రాన్ని (ప్రేమ్ నజీర్, జయభారతి) తెలుగులో ఎవరితో తీశారు, ఆ సినిమా పేరేమిటి?
  9. కన్నడ హీరో రాజ్‌కుమార్ నటించిన, ఏడాది పాటుగా నడిచిన చిత్రం ‘బంగారద మనుష్య’ను తెలుగులో ఏ పేరుతో నిర్మించారు?
  10. కన్నడ చిత్రం ‘సొసె తంద సౌభాగ్య’ లోని ‘రవివర్మ న కుంజెద’ పాట పి.బి.శ్రీనివాస్ పాడగా, దీన్ని తెలుగులో ఏ చిత్రంలో బాలు పాడారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 అక్టోబరు 25వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 7 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 అక్టోబరు 30 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 5 జవాబులు:

1.సీతాకళ్యాణం (1934) 2. మారుతి టాకీస్, విజయవాడ 3. మినర్వ టాకీస్, మద్రాసు, 1949 4. టి.పి. రాజ్యలక్ష్మి, 1948 లో వచ్చిన ‘కామవల్లి’ చిత్రం 5. పి. భానుమతి, చండీరాణి చిత్రం. 6. ప్రేమ విజయం, 1936 7. కాంచనమాల 8. పల్నాటి యుద్ధం 9. బర్సాత్

సినిమా క్విజ్ 5 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి.బృందావనరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • ఎస్. సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • తాతిరాజు జగం

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

~

గమనిక:

“దక్షిణ భారతదేశంలో (మద్రాసు) నిర్మింపబడిన తొలి తెలుగు చిత్రం ఏది?” అనే ప్రశ్నకి ఎక్కువమంది 1931లో విడుదలయిన ‘భక్తప్రహ్లాద’ అని రాశారు. ‘భక్తప్రహ్లాద’ సినిమాని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారని గమనించగలరు. తెలుగువారు తీసిన 1921 నాటి ‘భీష్మ ప్రతిజ్ఞ’ తొలి మూకీ చిత్రం దక్షిణ భారతదేశంలోనే చిత్రీకరణ జరుపుకున్నది.

“దక్షిణ భారతదేశంలోని మొదటి ఎయిర్ కండీషన్డ్ థియేటర్ ఏది?” అన్న ప్రశ్నకు కొందరు శ్రీధర్ థియేటర్, ఎర్నాకుళం అని రాశారు. ఇది 1964లో నిర్మితమైనది. మద్రాసులోని మినర్వ టాకీస్ 1949లోనే నిర్మితమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here