Site icon Sanchika

సినిమా క్విజ్-71

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ నటించిన ‘ప్రేమ్‍నగర్’ (1971) చిత్రం హిందీలో కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో, రాజేష్ ఖన్నా, హేమమాలినిలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. వి. రామచంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, కృష్ణ, కాంతారావు, జగ్గయ్య, జయలలిత, విజయనిర్మలలు నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) చిత్రాన్ని హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో సంజీవ్‍కుమార్, అశోక్ కుమార్, జితేంద్ర, జీనత్ అమన్, జయప్రదలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. ‘బాలు బెళగితు’ అనే కన్నడ సినిమా ఆధారంగా వి. మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ, కాంచన నటించిన ‘మంచివాడు’ (1974) చిత్రం హిందీలో జంబులింగం దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, తనూజ, మౌసమీ ఛటర్జీలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. ‘యావ జన్మద మైత్రి’ అనే కన్నడ సినిమా ఆధారంగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, శారద, జయంతి నటించిన ‘శారద’ (1973) చిత్రాన్ని హిందీలో సి.వి. రాజేంద్రన్ దర్శకత్వంలో జితేంద్ర, జమున, హేమమాలిని లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. ‘నాగరహావు’ అనే కన్నడ సినిమా ఆధారంగా కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో శోభన్ బాబు, లక్ష్మి, చంద్రకళ, ఆచార్య ఆత్రేయలు నటించిన ‘కోడెనాగు’ (1974) చిత్రం హిందీలో ఎస్.ఆర్. పుట్టణ్ణ కనగల్ దర్శకత్వంలో రిషీకపూర్, నీతూ సింగ్, మౌసమీ ఛటర్జీలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., వాణిశ్రీ, బి. సరోజ నటించిన ‘మనుషుల్లో దేవుడు’ (1974) చిత్రాన్ని హిందీలో చందర్ వోహ్రా దర్శకత్వంలో జితేంద్ర, రీనారాయ్, ఆశా పరేఖ్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. ‘భూతయ్య నమగ అయ్యు’ అనే కన్నడ సినిమా ఆధారంగా జెమినీ ఎస్.ఎస్. బాలన్ దర్శకత్వంలో శోభన్ బాబు, మంజుల, జయంతి, లోకేష్ నటించిన ‘అందరూ మంచివారే’ (1975) చిత్రం హిందీలో ఎస్.ఎస్. బాలన్ దర్శకత్వంలో రాకేష్ పాండే, మంజుల, జయశ్రీ గడ్కర్‍లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. బాపు దర్శకత్వంలో శ్రీధర్, సంగీత, నూతన్ ప్రసాద్, రావుగోపాలరావు నటించిన ‘ముత్యాలముగ్గు’ (1975) సినిమాని హిందీలో మురుగన్ కుమార్ దర్శకత్వంలో విజయ్ అరోరా, బిందియా గోస్వామిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. కె. బాపయ్య దర్శకత్వంలో శోభన్ బాబు, జయచిత్ర, జయసుధలు నటించిన ‘సోగ్గాడు’ (1975) చిత్రం హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, నాజ్‍నీన్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్, జయప్రదలు నటించిన ‘సిరిసిరిమువ్వ’ (1976) చిత్రాన్ని కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రిషీకపూర్, జయప్రదలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జనవరి 16 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 71 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జనవరి 21 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 69 జవాబులు:

1.ఘర్ ఘర్ కీ కహానీ (1988) 2. ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్ (1988) 3. ఘర్ సంసార్ (1986) 4. హమారా దిల్ ఆప్ కే పాస్ హై (2000) 5. హకీకత్ (1985) 6. హిమ్మత్ ఔర్ మెహనత్ (1987) 7. హమ్ ఆప్ కే దిల్ మే రహతే హై (1999) 8. హం దోనో (1985) 9. ఇన్సాఫ్ కీ ఆవాజ్ (1986) 10. బిదాయి (1974)

సినిమా క్విజ్ 69 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version