సినిమా క్విజ్-73

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఆర్. త్యాగరాజన్ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రీధర్, రతి అగ్నిహోత్రి లతో ఏకకాలంలో తమిళంలో ‘అన్బుక్కు నాన్ అడిమై’ పేరు తోనూ, తెలుగులో ‘మాయదారి కృష్ణుడు’ (1980) పేరుతోనూ వచ్చిన సినిమా హిందీలో రాజన్ సిప్పీ దర్శకత్వంలో జితేంద్ర, జయప్రద, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయప్రద, రావు గోపాలరావు నటించిన ‘యమగోల’ (1977) చిత్రాన్ని హిందీలో తాతినేని దర్శకత్వంలో జితేంద్ర, జయప్రద లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. ‘తంగపతకం’ అనే తమిళ చిత్రం ఆధారంగా కొన్ని మార్పులతో ఎన్.టి.ఆర్., జయంతి, శ్రీదేవి నటించిగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కొండవీటి సింహం’ (1981) సినిమా హిందీలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జితేంద్ర, హేమ మాలిని, అగ్నిహోత్రి లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయచిత్ర, శ్రీదేవి నటించిన ‘బొబ్బిలిపులి’ (1982) చిత్రాన్ని హిందీలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో జితేంద్ర, డింపుల్ కపాడియా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, రేవతి నటించిన ‘ప్రేమ’ (1989) సినిమా హిందీలో సురేష్ కృష్ణ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, రేవతి లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. ఎం. మల్లికార్జునరావు దర్శకత్వంలో కృష్ణ, శోభన్ బాబు, జయలలిత నటించిన ‘గూఢచారి 116’ (1966) చిత్రాన్ని హిందీలో రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో జితేంద్ర, బబిత లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. వి. మధుసూదన రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జగ్గయ్య, వాసంతి, కృష్ణకుమారి నటించిన ‘గుడిగంటలు’ (1963) సినిమా హిందీలో ఏ. భీమ్‍సింగ్ దర్శకత్వంలో దిలీప్ కుమార్, మనోజ్ కుమార్, వహీదా రెహ్మాన్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. ‘తులాభారం’ అనే మలయాళ చిత్రం ఆధారంగా శోభన్ బాబు, కాంచన లతో దర్శకులు వి. మధుసూదన రావు తీసిన ‘మనుషులు మారాలి’ (1969) చిత్రాన్ని హిందీలో వి. మధుసూదన రావు దర్శకత్వంలో పరీక్షిత్ సహ్నీ, శారదలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. అక్కినేని, కృష్ణకుమారిలతో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో హిందీ రచయిత గుల్షన్ నందా నవల ఆధారంగా తీసిన ‘పునర్జన్మ’ (1963) సినిమా హిందీలో చందర్ వోహ్రా దర్శకత్వంలో సంజీవ్ కుమార్, జితేంద్ర, ముంతాజ్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద నటించిన ‘దేవత’ (1982) చిత్రాన్ని హిందీలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జితేంద్ర, శ్రీదేవి, జయప్రదలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జనవరి 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 73 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఫిబ్రవరి 04 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 71 జవాబులు:

1.ప్రేమ్‍నగర్ (1974) 2. టక్కర్ (1980) 3. హంషకల్ (1975) 4. దుల్హన్ (1975) 5. జహ్రీలా ఇన్సాన్ (1975) 6. ఉధార్ కా సిందూర్ (1976) 7. ఏక్ గాఁవ్ కీ కహానీ (1976) 8. జీవన్ జ్యోతి (1976) 9. దిల్‍దార్ (1977) 10. సర్‍గమ్ (1979)

సినిమా క్విజ్ 71 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ఎ. ఎండి. జాకీర్ హుస్సేన్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here