సినిమా క్విజ్-74

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా అందించిన కథ (Mundhanai Mudichu) తో జంద్యాల దర్శకత్వంలో రాధిక, చంద్రమోహన్ నటించిన ‘మూడు ముళ్ళు’ (1985) సినిమా హిందీలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, శ్రీదేవిలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, జయప్రద నటించిన ‘ఊరికి మొనగాడు’ (1981) చిత్రాన్ని హిందీలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జితేంద్ర, శ్రీదేవిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్, సులక్షణ నటించిన ‘శుభోదయం’ (1980) సినిమా హిందీలో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రాకేష్ రోషన్, జయప్రదలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని, సుజాత, జయసుధలు నటించిన ‘ఏడంతస్తుల మేడ’ (1980) చిత్రాన్ని హిందీలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో జితేంద్ర, రీనా రాయ్, వినోద్ మెహ్రాలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., శారద, శ్రీదేవి నటించిన ‘జస్టిస్ చౌదరి’ (1982) సినిమా హిందీలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జితేంద్ర, శ్రీదేవి, హేమ మాలిని లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో జె.వి. సోమయాజు, మంజు భార్గవి, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి నటించిన ‘శంకరాభరణం’ (1980) చిత్రాన్ని హిందీలో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో గిరీష్ కర్నాడ్, జయప్రద, ఊర్మిళలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వెంకటేష్, మీనా నటించిన ‘సూర్యవంశం’ (1998) సినిమా హిందీలో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, సౌందర్య, జయసుధలతో ఏ పెరుతో రీమేక్ అయింది?
  8. ‘చిన్న తంబి’ అనే తమిళ చిత్రం ఆధారంగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్, మీనా నటించిన ‘చంటి’ (1991) చిత్రాన్ని హిందీలో కె. మురళీమోహనరావు దర్శకత్వంలో వెంకటేష్ (పరిచయం), కరిష్మా కపూర్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. ‘నాట్టామై’ అనే తమిళ చిత్రం ఆధారంగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు, రజనీకాంత్, భానుప్రియ, సౌందర్య నటించిన ‘పెదరాయుడు’ (1995) సినిమా హిందీలో తాతినేని రామారావు దర్శకత్వంలొ అనీల్ కపూర్, రజనీకాంత్, రవీనా టాండన్, రేఖలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. కోడి రామకృష్ణ దర్శకత్వంలో డా. రాజశేఖర్, జీవిత, ఎం.ఎస్. రెడ్డి (నిర్మాత) నటించిన ‘అంకుశం’ (1989) చిత్రాన్ని హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి, జుహీ చావ్లాలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఫిబ్రవరి 06 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 74 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఫిబ్రవరి 11 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 72 జవాబులు:

1.జుదాయి (1980) 2. జ్యోతి బనే జ్వాలా (1980) 3. హమ్ పాంచ్ (1980) 4. ఏక్ దూజే కేలియే (1981) 5. సితార (1980) 6. మెహెందీ రంగ్ లాయేగీ (1982) 7. మాంగ్ భరో సజనా (1980) 8. శ్రీమాన్ శ్రీమతి (1982) 9. నిశానా (1980) 10. మవాలి (1983)

సినిమా క్విజ్ 72 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ఎ. ఎండి. జాకీర్ హుస్సేన్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • దీప్తి మహంతి
  • మచ్చ గోవర్దన్
  • ఠాగూర్ ఉపేందర్ సింగ్
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here