సినిమా క్విజ్-79

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన ‘పెళ్ళిసందడి’ (1996) సినిమా హిందీలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సంజయ్ కపూర్, మధుబాల, ఊర్మిల మటోంద్కర్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  2. వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో సుమన్, విజయశాంతి నటించిన ‘మొండి మొగుడు – పెంకి పెళ్ళాం’ (1992) చిత్రాన్ని హిందీలో పంకజ్ పరాశర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, శ్రీదేవిలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  3. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించిన ‘పెళ్ళిచూపులు’ (2016) సినిమా హిందీలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో జాకీ భగ్‍నాని, కృత్తికా కమ్రలతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  4. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, రంభ, రావు గోపాలరావు నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ (1992) చిత్రాన్ని హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, జుహీ చావ్లా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  5. కె. బాపయ్య దర్శకత్వంలో చిరంజీవి, మాధవి, సుమలత నటించిన ‘చట్టంతో పోరాటం’ (1985) సినిమా హిందీలో కె. బాపయ్య దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, జయప్రద, పద్మినీ కొల్హాపురీ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  6. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి నటించిన ‘తొలి ప్రేమ’ (1998) చిత్రాన్ని హిందీలో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తుషార్ కపూర్, కరీనా కపూర్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆకాష్, రేఖ నటించిన ‘ఆనందం’ (2001) సినిమా హిందీలో నూపుర్ ఆస్తానా దర్శకత్వంలో సాహిబ్ సలీం, సబా ఆజాద్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  8. కన్నడ చిత్రం ‘జిమ్మి గళ్ళు’ ఆధారంగా కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కృష్ణ, రాధ, శారద, విజయశాంతి నటించిన ‘ముద్దాయి’ (1987) చిత్రాన్ని హిందీలో కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో జితేంద్ర, హేమమాలిని, శత్రుఘన్ సిన్హా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  9. ఎ. మోహనగాంధీ దర్శకత్వంలో వినోద్ కుమార్, రోజా, చరణ్ రాజ్ నటించిన ‘పోలీస్ బ్రదర్స్’ (1992) సినిమా హిందీలో టి. రామారావు దర్శకత్వంలో ఆదిత్య పంచోలి, గోవింద, కరిష్మా కపూర్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
  10. జి. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వేణు తొట్టెంపూడి, షహీన్ నటించిన ‘చిరునవ్వుతో’ (2000) చిత్రాన్ని హిందీలో పి. సోమ శేఖర్ దర్శకత్వంలో గష్‍మీర్ మహజని, ట్వింకిల్ పటేల్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మార్చి 12 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 79 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మార్చి 17 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 77 జవాబులు:

1.స్వర్గ్-నరక్ (1978) 2. తర్‍కీబ్ (1984) 3. ఉధార్ కీ జిందగీ (1994) 4. తడప్ (2021) 5. స్వాతి (1986) 6. తేవర్ (2015) 7. సన్ ఆఫ్ సర్దార్ (2012) 8. షర్త్: ది ఛాలెంజ్ (2004) 9. షహజాదా (2023) 10. శుభ్ కామ్నా (1983)

సినిమా క్విజ్ 77 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి. రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here