[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్, మహేశ్వరి, సుజాత, పృథ్వీ నటించిన ‘పెళ్ళి’ (1997) సినిమా హిందీలో వినయ్ శుక్లా దర్శకత్వంలో సంజయ్ కపూర్, జయా బచ్చన్, అనుపం ఖేర్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్, సిమ్రాన్, రంగనాథ్, కె. విశ్వనాథ్ నటించిన ‘కలిసుందాం రా’ (2000) చిత్రాన్ని హిందీలో కె. రవిశంకర్ దర్శకత్వంలో ఫర్దీన్ ఖాన్, రిచా పల్లార్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వేణు తొట్టెంపూడి, లయ, నటించిన ‘స్వయంవరం’ (1999) సినిమా హిందీలో సంజయ్ చహల్ దర్శకత్వంలో తుషార్ కపూర్, రాజ్ బబ్బర్, ఈషా దేవల్ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో చిరంజీవి, బ్రహ్మానందం, రంభ నటించిన ‘బావగారూ బాగున్నారా’ (1998) చిత్రాన్ని హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవిందా, ఊర్మిళ, నగ్మా లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- శివనాగేశ్వరరావు దర్శకత్వంలో జె.డి.చక్రవర్తి, చిన్నా, జయసుధ, రేణుకా సాహ్ని నటించిన ‘మనీ’ (1993) సినిమా హిందీలో ఈశ్వర్ నివాస్ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్, పర్దీన్ ఖాన్, సోనాలి బింద్రే, ట్వింకిల్ ఖన్నా లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని, ఇలియానా, సాయాజీ షిండే నటించిన ‘దేవదాసు’ (1998) చిత్రాన్ని హిందీలో అభిరాజ్. కె. మీనావాలా దర్శకత్వంలో ఆయూష్ వర్మ, వరీనా హుసేన్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ పోతినేని, హన్సికా మోత్వాని, సోనూ సూద్ నటించిన ‘కందిరీగ’ (2011) సినిమా హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో నర్గిస్ ఫక్రీ, వరుణ్ ధావన్, ఇలియానా లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- Periya Idathu Penn (1963) అనే తమిళ చిత్రం ఆధారం, ఐ.ఎన్. మూర్తి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, కృష్ణకుమారి, రాజనాల, పద్మనాభం నటించిన ‘శభాష్ సూరి’ (1964) చిత్రాన్ని హిందీలో టి.ఆర్. రామన్న దర్శకత్వంలో జితేంద్ర, రీనా చందవర్కర్, మీనా కుమారి లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- ఇరు కొడుగల్ అనే తమిళ చిత్రం ఆధారంగా, ఎస్. ఎస్. బాలన్ దర్శకత్వంలో జగ్గయ్య, జమున, జయంతి నటించిన ‘కలెక్టర్ జానకి’ (1972) సినిమా హిందీలో ఎస్. ఎస్. బాలన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, మాలా సిన్హా, అరుణా ఇరానీ లతో ఏ పేరుతో రీమేక్ అయింది?
- ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతి బాబు, ఆమని, రోజా, అన్నపూర్ణ నటించిన ‘శుభలగ్నం’ (1994) చిత్రాన్ని హిందీలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీదేవి, ఊర్మిళా మతోంద్కర్ లతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
- చక్రవర్తి సంగీత దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయప్రద, రావుగోపాల రావు నటించిన ‘యమగోల’ చిత్రం టైటిల్ మ్యూజిక్‍ను, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వంలో జితేంద్ర, జయప్రద, మదన్ పూరీ నటించిన ఏ చిత్రానికి వాడుకున్నారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఏప్రిల్ 02 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 82 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఏప్రిల్ 07 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 80 జవాబులు:
1.నయా కదమ్ (1984) 2. ప్రస్థానం (2019) 3. తేజస్విని (1994) 4. ప్రతీకార్ (1991) 5. రక్ష (1982) 6. రమయ్యా వస్తవయ్యా (2013) 7. రెడీ (2011) 8. రాణీ మేరా నామ్ (1972) 9. రాకీ: ది రెబెల్ (2006) 10. రౌడీ రాథోడ్ (2012)
సినిమా క్విజ్ 80 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి. రాజు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సునీతా ప్రకాష్
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్నకుమారి
- టి. మమన్ బాబు
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]