సినిమా క్విజ్-83

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

తమిళ చిత్రాల నుండి అనువాదాలైన తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. జెమినీ గణేశన్, సావిత్రి. కమలహాసన్ (బాలతార) నటించిన ‘కళత్తూర్ కణ్ణమ్మ’ (1960) చిత్రానికి దర్శకుడు ఏ. భీంసింగ్. ఈ సినిమా తెలుగులో ఏ పేరున డబ్బింగ్ అయింది? (ఈ చిత్రాన్ని అక్కినేని, జమునలతో స్ట్రెయిట్‌గా తీసిన చిత్రం ‘మూగ నోము’.)
  2. డి.యోగానంద్ దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, భానుమతి గార్లలో తీసిన 1956 చిత్రం ‘మధురై వీరన్’. ఇది తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  3. ఎం.జి.ఆర్ ‘స్వీయ దర్శకత్వంలో ఎం.జి.ఆర్, భానుమతి, బి. సరోజ దేవిలు నటించిన వర్ణచిత్రం ‘నాడోడిమణ్ణన్’ (1958) తెలుగులో ఏ పేరున అనువాదమైంది? (తెలుగులో చాలా రోజులు ఆడింది.)
  4. కృష్ణన్-పంజు దర్శకత్వంలో శివాజీ గణేషన్, పండరీబాయి, ఏ.కె. రాజేంద్రన్ నటించిన ‘పరాశక్తి’ (1952) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?-
  5. బి.ఆర్.పంతులు దర్శకత్వంలో శివాజీ గణేషన్, జమున, T. R. రాజకుమారి నటించిన ‘తంగమలై రగసియం’ (1957) చిత్రం తెలుగులో ఏ పేరున అనువాదమైంది?
  6. దర్శకుడు A. తిరుముగం, జెమినీ గణేషన్, బి. సరోజాదేవి కన్నాంబ గార్లలో తీసిన ‘వాళ వెత్త దైవం’ (1959) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  7. కృష్ణన్ – పంజు దర్శకత్వంలో నగేష్, K.R.విజయ, ముత్తురామన్ లతో తీసిన ‘సర్వర్ సుందరం’ (1964) చిత్రం ఏ పేరున తెలుగులో డబ్ అయింది? (ఈ చిత్రం తెలుగునాట శతదినోత్సవం చేసుకుంది.)
  8. కె. బాలచందర్ దర్శకత్వంలో కమలహాసన్, వై. విజయ, జయప్రదలతో తీసిన చిత్రం ‘మన్మధలీలై’ (1976) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  9. V. రాజేంద్రన్ దర్శకత్వంలో రజనీకాంత్, మాధవి నటించిన ‘గర్జనమ్’ (1981) చిత్రం తెలుగులో ఏ పేరున డబ్ అయింది?
  10. దర్శకుడు V.శ్రీధర్, కమలహాసన్, రజనీకాంత్, శ్రీప్రియ, జయచిత్రలతో తీసిన ‘ఇలమై ఊంజల్ ఆడుకిరతు’ (1978) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఏప్రిల్ 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 83 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఏప్రిల్ 14 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 81 జవాబులు:

1.సాజన్ చలే ససురాల్ (1996) 2. సంజోగ్ (1985) 3. సంతాన్ (1993) 4. జోడీదార్ (1997) 5. జీనా సిర్ఫ్ మేరే లియే (2002) 6. జీత్ (1972) 7. జై హో (2014) 8. కబీర్ సింగ్ (2019) 9. కానూన్ అప్నా అప్నా (1989) 10. కిక్ (2014)

సినిమా క్విజ్ 81 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి. రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • దీప్తి మహంతి
  • ఎం. గోవర్ధన్ నేత

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here