[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.
ప్రశ్నలు:
- టి.ఆర్. రఘునాథ్ దర్శకత్వంలో శ్రీరాం, వైజయంతి మాల నటించిన చిత్రం ‘మర్మవీరన్’ (1956) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: ఇందులో T.R. జెమినీ గణేశన్, S. V. రంగారావు, R. నాగేశ్వరరావులు గెస్ట్ పాత్రలు ధరించారు.)
- దర్శకుడు R. తిరుముగం తీసిన ‘నీలమలై తిరుడన్’ (1957) చిత్రంలో రంజన్, అంజలీ దీవి నటించారు. ఈ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?(ఈ చిత్రం హక్కులు నిర్మాత డూండి తీసుకుని, డబ్ చేసి లక్షాధికారి అయ్యాడు)
- టి.ఆర్. సుందరం దర్శకుడిగా ఎం.జి.ఆర్, భానుమతిలు నటించిన ‘అలీబాబావూ నాప్పతి తిరుడన్’ (1956) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
- రాజ్‍కపూర్, నర్గీస్, ప్రాణ్‌లు నటించిన హిందీ చిత్రం ‘ఆహ్’ (1953)కి దర్శకుడు రాజా నవాథె. ఈ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (ఈ చిత్రానికి తెలుగులో ఆరుద్ర గారు పాటలు రాశారు).
- దర్శకుడు ఎ.సి. త్రిలోక చందర్, శివాజీ గణేశన్, జయలలిత, మేజర్ సౌందర రాజన్ గార్లతో తీసిన ‘దైవమగన్’ (1969) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (ఈ చిత్రం తెలుగులో స్ట్రెయిట్ చిత్రంగా కూడా వచ్చింది.)
- యోగానంద్ దర్శకత్వంలో జెమినీ గణేశన్, అంజలీదేవి గార్లతో తీసిన ‘భూలోక రంభై’ (1958) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- దర్శకుడు భారతిరాజా, కమల్ హాసన్, శ్రీదేవి, భాగ్యరాజ్ లతో తీసిన ‘శిగప్పు రోజిగళ్’ (1978) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
- పి.నీలకంఠన్ దర్శకత్వంలో ఎమ్.జి. రామచంద్రన్, అంజలీదేవి. ఎస్.వరలక్ష్మి గార్లతో తీసిన ‘చక్రవర్తి తిరుమగళ్’ (1957) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- దర్శకుడు ఎం.వి. రామన్, జెమినీ గణేశన్, సావిత్రిలతో తమిళంలో తీసిన మొట్టమొదటి టెన్నికలర్ చిత్రం ‘కొంజుం సలైంగై’ (1962) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (తెలుగులో హిట్ అయింది.)
- పి. పుల్లయ్య దర్శకత్వంలో, శివాజీ గణేశన్, సావిత్రిలు నటించిన ‘తలవంచని వీరుడు’ (1957) తెలుగు చిత్రం, ఏ తమిళ చిత్రానికి డబ్బింగయింది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఏప్రిల్ 16 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 84 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఏప్రిల్ 21 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 82 జవాబులు:
1.కోయీ మేరే దిల్ సే పూఛే (2002) 2. కుఛ్ తుమ్ కహో కుఛ్ హమ్ కహే (2002) 3. క్యా దిల్ నే కహా (2002) 4. కుఁవారా (2000) 5. లవ్ కే లియే కుఛ్ భీ కరేగా (2001) 6. లవ్ యాత్రి (2018) 7. మై తేరా హీరో (2014) 8. జవాబ్ (1965) 9. సంజోగ్ (1973) 10. జుదాయి (1997) 11. లోక్ పర్‍లోక్ (1979)
సినిమా క్విజ్ 82 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి. రాజు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సునీతా ప్రకాష్
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్నకుమారి
- కె. శాంతి
- టి. మమన్
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]