[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.
ప్రశ్నలు:
- నితేష్ తివారి దర్శకత్వంలో అమీర్ ఖాన్, ఫతిమా సనా షేక్, సన్యా మల్హోత్ర నటించిన చిత్రం ‘దంగల్’ (2016) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- కన్నడంలో బి. ఆర్. పంతులు దర్శకత్వంలో రాజ్‍కుమార్, భారతి, జయంతి, యం.వి. రాజమ్మ, ఆర్. నాగేంద్రరావు, బి. ఆర్. పంతులు నటించిన ‘శ్రీకృష్ణదేవరాయ’ (1970) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
- రోహిత శెట్టి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె, సత్యరాజ్‌లు నటించిన ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ (2013) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- టి.ఎమ్. బాలు దర్శకత్వంలో (యితడు మరణించాక K. విశ్వనాధన్ సినిమాని పూర్తి చేశారు) కమల్ హాసన్, శ్రీదేవిలు నటించిన ‘శంకర్‌లాల్’ (1981) చిత్రం తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
- కె. ఆర్. జయ దర్శకత్వంలో సూర్య, జ్యోతికలు నటించిన ‘ఉయిరిల్ కాలాంతతు’ (Uyirile Kalanthathu 2000) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వంలో అజిత్, త్రిష, అనుష్క శెట్టి నటించిన చిత్రం ‘యెన్నై అరిందాల్’ (2015) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
- చింబుదేవన్ దర్శకత్వంలో విజయ్, శ్రీదేవి, సుదీప్, శృతిహాసన్ నటించిన ‘పులి’ (2015) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- పి. వాసు దర్శకత్వంలో రజనీకాంత్, మీనా, జగపతి బాబు నటించిన ‘కుసేలన్’ (2008) చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
- దాదా మిరాసి దర్శకత్వంలో శివాజీ గణేశన్, షావుకారు జానకి, బి. సరోజాదేవి నటించిన ‘పుథియ పరవై’ (1964) చిత్రాన్ని తెలుగులో ఏ పేరిట డబ్ చేశారు?
- ఎం.ఎ. తిరుముగం దర్శకత్వంలో ఎం.జి.ఆర్, బి. సరోజా దేవి, కన్నాంబ నటించిన ‘తాయ్ సొల్లయ్ తట్టదె’ (1962) సినిమా తెలుగులో ఏ పేరితో డబ్ అయింది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 మే 21 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 90 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 మే 26 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 88 జవాబులు:
1.మహావీర మయూర (1975) 2. ప్రేమాలయం (1994) 3. కల్యాణ రాముడు (1979) 4. ఆరు (2005) 5. వాలి (1999) 6. తుపాకి (2012) 7. నరసింహ (1999) 8. పతిభక్తి (1958) 9. వీరసామ్రాజ్యం (1961) 10. భాగ్యవంతులు (1961)
సినిమా క్విజ్ 88 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సునీతా ప్రకాష్
- శంబర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్నకుమారి
- కె. గాయత్రి
- కె. ప్రశాంత్
- M. మమన్ బాబు
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]