[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.
ప్రశ్నలు:
- కన్నడంలో తొలిసారిగా 25 వారాలు ఆడిన కన్నడ సినిమాగా పేరుపొందిన ‘స్కూల్ మాస్టార్’ (1958) అనే చిత్రంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, బి. సరోజా దేవి, ఉదయకుమార్, దర్శకుడు బి.ఆర్. పంతులు నటించారు. ఈ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: తరువాతి కాలంలో ఇదే సినిమాని ఎన్.టి.రామారావు, అంజలీదేవితో తెలుగులో స్ట్రెయిట్ సినిమాగా తీశారు)
- పి. నీలకంఠన్ దర్శకత్వంలో ఎంజిఆర్, ఇ.వి. సరోజ, అశోకన్, ఎం.ఆర్. రాధ నటించిన ‘కొడుతు వైతవల్’ (1963) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- ఎస్. ఎ. మురుగేష్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, లలిత నటించిన ‘ఉలగం పలవితం’ (1955) సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
- సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్ హాసన్ (ద్విపాత్రాభినయం), రవీనా టాండన్, మనీషా కొయిరాలా, శరత్ బాబు, గొల్లపూడి నటించిన ‘అలవందన్’ (2001) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రీదేవి, సిల్క్ స్మిత, ఎస్. వరలక్ష్మి నటించిన ‘అడుత వారిసు’ (1983) సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: తెలుగు వెర్షన్ విజయవాడలో డబ్బింగ్ సినిమాల కోసం కొత్త రికార్డును నెలకొల్పింది, తెలుగు వెర్షన్ పేరే మహేష్ బాబు సినిమాకీ ఉంది)
- ఎ.సి. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ (త్రిపాత్రాభినయం), జయలలిత, మేజర్ సౌందరాజన్ నటించిన ‘దైవ మగన్’ (1969) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వంలో రజనీకాంత్, రతి అగ్నిహోత్రి, సుమలత, జై శంకర్ నటించిన ‘మురాట్టు కలై’ (1980) సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: “ప్రేమిస్తే చేస్తాను స్నేహము పగపడితే చూస్తాను అంతం” అనే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాట తెలుగు వెర్షన్ లోనిది)
- విష్ణువర్ధన్ దర్శకత్వంలో అజిత్, నయనతార, తాప్సీ, దగ్గుబాటి రాణా నటించిన ‘ఆర్రంభం’ (2013) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- హరి దర్శకత్వంలో సూర్య, అసిన్, ప్రభుదేవా, నాజర్ నటించిన ‘వేల్’ (2007) సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
- ఆర్. నాగేంద్రరావు దర్శకత్వంలో ఆర్. సుదర్శన్, కళ్యాణ కుమార్, బి. సరోజా దేవి నటించిన ‘విజయనగర వీరపుత్ర’ (1969) చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జూన్ 11 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 92 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జూన్ 16 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 90 జవాబులు:
1.యుద్ధం (2016) 2. శ్రీకృష్ణదేవరాయలు (1975) 3. చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ (2013) 4. అందగాడు (1981) 5. పోరాటం (2000) 6. ఎంతవాడు గాని (2015) 7. పులి (2015) 8. కథానాయకుడు (2008) 9. సింగపూర్ సి.ఐ.డి. (1965) 10. ఇద్దరు కొడుకులు (1962)
సినిమా క్విజ్ 90 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంబర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- కె. శాంతి
- జి. స్వప్నకుమారి
- కొన్నె ప్రశాంత్
- టి. మమన్ బాబు
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]