సినిమా క్విజ్-94

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో విష్ణువర్ధన్, సుహాసిని, రూపాదేవి నటించిన ‘బంధన’ (1984) కన్నడ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  2. మోహన్ లాల్, సత్యరాజ్, రాహుల్ దేవ్ నటించిన ‘లైలా ఓ లైలా’ (2015) అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  3. వినయన్ దర్శకత్వంలో సురేష్ గోపి, మీనా నటించిన ‘బ్లాక్ కాట్’ (2015) అనే మలయాళ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  4. మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, విక్రమ్, ప్రభు, ఐశ్వర్య రాయ్, ప్రియమణి నటించిన ‘రావణ్’ (2010) అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  5. ఐ.వి.శశి దర్శకత్వంలో కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ‘గురు’ (1980) అనే తమిళ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  6. కె.వి. ఆనంద దర్శకత్వంలో సూర్య, ప్రభు, తమన్నా నటించిన ‘అయాన్’ (2009) అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  7. అజిత్, నయనతార, జగపతి బాబు నటించిన ‘విశ్వాసం’ (2019) అనే తమిళ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  8. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, కీర్తి సురేష్ నటించిన ‘సర్కార్’ (2018) అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  9. రంజిత్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, దినేష్ రవి నటించిన ‘కబాలి’ (2016) అనే తమిళ చిత్రం తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  10. బి.ఆర్. పంతులు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., శివాజీ గణేశన్, సావిత్రి, దేవిక నటించిన ‘కర్ణన్’ (1964) అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జూన్ 25 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 94 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జూన్ 30 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 92 జవాబులు:

1.బడిపంతులు (1958) 2. అదృష్టవతి (1963) 3. అంతా పెద్దలే (1959) 4. అభయ్ (2001) 5. టక్కరి దొంగ (1983) 6. కోటీశ్వరుడు (1969) 7. ఊరికొక్కడు (1982) 8. ఆట ఆరంభం (2013) 9. దేవా (2007) 10. విజయనగర వీరపుత్రుని కథ (1969)

సినిమా క్విజ్ 92 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • శంబర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు
  • కె. శాంతి గాయత్రి
  • కొన్నె ప్రశాంత్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here