[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.
ప్రశ్నలు:
- ఎవిఎం వారు తమిళంలో ఎ.సి. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో విశ్వనాథన్, రామ్మూర్తిల సంగీత దర్శకత్వంలో – ఆనందన్, సచ్చు, ఇవి సరోజ, అశోకన్‍లతో తీసిన ‘వీర తిరుమగన్’ (1962) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- కె. శంకర్ దర్శకత్వంలో ఎం.జి.ఆర్., బి. సరోజా దేవి నటించిన ‘పణత్తోటం’ (1963) అనే తమిళ సినిమా తెలుగు ఏ పేరుతో డబ్ అయింది?
- టి. ఆర్. రామన్న దర్శకత్వంలో శివాజీ గణేశన్, కె.ఆర్. విజయ, రాజశ్రీ నటించిన ‘సొర్గం’ (1970) సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (క్లూ: తెలుగు వెర్షన్ పేరుతోనే జయసుధ ప్రధాన పాత్రలో నటించిన 1981లో విడుదలైన డైరక్ట్ సినిమా కూడా ఉంది)
- సి. సుందర్ దర్శకత్వంలో రజనీకాంత్, సౌందర్య, రంభ నటించిన ‘అరుణాచలం’ (1997) అనే తమిళ సినిమా తెలుగు ఏ పేరుతో డబ్ అయింది?
- లింగుసామి దర్శకత్వంలో అజిత్, త్రిష నటించిన ‘జి’ (Ji) (2005) అనే సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- హరి దర్శకత్వంలో సూర్య, ప్రకాశ్ రాజ్, అనుష్క శెట్టి నటించిన ‘సింగం’ (2010) అనే తమిళ సినిమా తెలుగు ఏ పేరుతో డబ్ అయింది?
- కె. విజయన్ దర్శకత్వంలో కమలహాసన్, శరత్ బాబు, మాధవి నటించిన ‘సట్టం’ (1983) అనే సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ నటించిన ‘జోధా అక్బర్’ (2008) అనే హిందీ సినిమా తెలుగు ఏ పేరుతో డబ్ అయింది?
- బి.ఎస్. రంగా దర్శకత్వంలో రాజ్ కుమార్, ఉదయ కుమార్, నరసింహ రాజు నటించిన ‘మహిషాసురమర్దని’ (1959) అనే కన్నడ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
- షాజీ కైలాశ్ దర్శకత్వంలో సురేశ్ గోపి, శోభన నటించిన ‘కమీషనర్’ (1994) అనే మలయాళ సినిమా తెలుగు ఏ పేరుతో డబ్ అయింది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జూలై 02 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 95 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జూలై 07 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 93 జవాబులు:
1.దగాకోరులు (1980) 2. పోలీస్ సామ్రాజ్యం (2005) 3. రంగేళి (1995) 4. సూర్య S/o కృష్ణన్ (2008) 5. ఆనంద జ్యోతి/దొంగ బంగారం (1964) 6. అడవి వీరులు (1971) 7. విప్లవం వర్ధిల్లాలి (1970) 8. మాస్ రాజా (2005) 9. యోధ (1992) 10. కెప్టెన్ ప్రభాకర్ (1994)
సినిమా క్విజ్ 93 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సునీతా ప్రకాష్
- శంబర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్నకుమారి
- టి. మమన్ బాబు
- కె. శాంతి గాయత్రి
- కొన్నె ప్రశాంత్
- టి.ఆర్. మాల
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]