[dropcap]ఆం[/dropcap]ద్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (గుంటూరు జిల్లా శాఖ) ఆధ్వర్యంలో చలపాక ప్రకాశ్ రచించిన ‘కరోనా నానీలు’ హిందీ అనువాదం ‘కరోనా కా కొహరామ్‘ పుస్తకావిష్కరణ 10 డిసెంబరు 2022 శనివారం సాయంత్రం 6 గంటలకు గుంటూరు పుస్తక మహోత్సవ ప్రాంగణం, ఏ.ఎల్.బి.ఇడి. కాలేజీ, లాడ్జ్ సెంటర్, గుంటూరు నందు జరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రచయిత సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు అధ్యక్షత వహిస్తారు.
అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
విశ్రాంత హిందీ అధ్యాపకురాలు, కవయిత్రి షేక్ కాశీంబి గారు పుస్తకాన్ని సమీక్షిస్తారు.
హిందీ అనువాద రచయిత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డా. వెన్నా వల్లభరావు గారు ప్రసంగిస్తారు.
మూల గ్రంథ రచయిత చలపాక ప్రకాశ్ గారు ప్రసంగిస్తారు.
సాహితీ ప్రియులందరికీ ఆహ్వానం.