కరోనాలో ఉల్లాసంగా ఉత్సాహంగా

0
1

[dropcap]క[/dropcap]రోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతోంది. ప్రజలంతా ఒక రకమైన నిర్లిప్తతతో కాలం గడుపుతున్నారు. ఎందరినో అనారోగ్యం పాలు చేసి, మరెందరో మరణాలకు కారణమవుతోంది కరోనా. అయితే ప్రపంచాన్ని వణికించిన అంటువ్యాధి ఇది ఒకటే కాదు, దీని కన్నా ముందు మానవజాతి ఎన్నో సంక్రమణ వ్యాధులను ఎదుర్కుని, మనుగడ కొనసాగించింది. అలాంటి కొన్ని వ్యాధులను ప్రస్తావిస్తాను.

అనాది కాలం నుండి అంటే క్రీ.పూ. 1200 క్రితం నుండి మద్య అమెరికాకు చెందిన పనామా, హౌండురస్, నికరాగ్వా వంటి దేశాలు అంటువ్యాధులతో ఎన్నో సంవత్సరాలు అల్లాడిపోయాయి. వ్యాధులతో ఆర్ధిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. కాలం గడిచే కొద్దీ రోగాలను తట్టుకున్నాయి. అయితే పనామా దేశం కాలువ త్రవ్వి ఎన్నో వేలాది కోట్లు సంపాదించింది, సంపాదిస్తోంది. పనామా కాలువతో ఆ దేశ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 2018లో నేను పనామా, నికరాగ్వా, హౌండురస్ దేశాలు చూశాను. ఇప్పుడు ఆ రోగాలు లేవు. అవి ఎంతో పురోభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి.

అలాగే క్రీ.శ. 1591లో హైదరాబాదులో ప్లేగు వ్యాపించి ప్రజలు అల్లాడిపోయారు. కాని కాలక్రమంలో వ్యాధి క్షీణించి, ప్లేగుని జయించారు. ఇందుకు గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్‌ని నిర్మించాడు.

1820-22లో చైనా నుండి జపాన్‌కి వెళ్ళే నౌకలలో కలరా వచ్చింది. అది మొత్తం ఆసియా ఖండానికి ప్రాకి, అనేక దేశాలను వణికించి ప్రక్కన వున్న ఖండాలలో కూడా ప్రాకింది. థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 1821లో బ్రిటిష్ బలగాలు ఓమన్ నుంచి ఇండియాకి నుండి వస్తూ పర్షియన్ గల్ఫ్ నుండి మనకి ఈ కలరాని అంటించారు. ఈ వ్యాధితో టర్కీ, సిరియా, రష్యా కొంత భాగం ఆరు సంవత్సరాలు గడగడలాడాయి.

అంటువ్యాధులు వస్తుంటాయి, కొన్నిటి ప్రభావం అనుకున్నా దానికన్నా తీవ్రంగా ఉంటుంది. మరీ అతిగా భయపడకుండా శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రభుత్వాలు చెప్పే సూచనలు పాటించాలి.

కరోనా విషయంలో ఇళ్ళల్లోనే ఉండమని, సామాజిక దూరం పాటించని, సబ్బుతో చేతులు కడుక్కోమని చెబుతున్నారు. మన ఆరోగ్యం కోసం, మన సంక్షేమం కోసం ఇవన్నీ పాటించవలసిందే.

1665లో గ్రేట్ ప్లేగ్ వచ్చినప్పుడు కేంబ్రిడ్జి నుండి అందరు విద్యార్ధులను ఇంటికి పంపేసారట. న్యూటన్ వయసు అప్పుడు 20 సంవత్సరాలు. కాల్‌క్యులస్, మోటార్ ఆప్టిక్స్, గ్రావిటేషన్ ఫోర్స్ వంటివి అతనే కనుగొన్నాడు. సామాజిక దూరం పాటిస్తూ, తోటలోని ఆపిల్ చెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుండగా గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని  కనుగొన్నాడు. అంటే, ఆ కాలంలోనే ‘social distance’ ని పాటించారు.

సోషల్ డిస్టన్స్, లాక్‌డౌన్ అంటే భయపడనక్కరలేదు. వాటిని సానుకూల అంశాలుగా పరిగణించాలి.

నెల్సన్ మండేలా ఏకంగా 27 సంవత్సరాలు ఒకే గదిలో జైలు జీవితం గడిపి దక్షిణాఫ్రికాకి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగించారు. అందరికీ దూరంగా, ఒంటరిగా కాలం గడిపినా, ఆయన రగిలించిన స్ఫూర్తి ఎందరికో మార్గదర్శకమైంది.

మనం కొద్దిరోజుల లాక్‌డౌన్‌కే అమ్మో అనుకుంటున్నాం, నాకు కజకిస్థాన్‌లో పరిచయమైన ఒక కెనడా మహిళ గురించి చెబితే, ఆశ్చర్యపోతారు. ఆమె ఉత్తర ధ్రువ ప్రాంతంలోని నీటి జంతువులపై పరిశోధన చేస్తారు. సంవత్సరంలో 3 నెలలు ఆమె ఒక్కతే ఈ ధ్రువప్రాంతంలో పని చేస్తారు. మిగతా నెలలు  ప్రపంచమంతా తిరుగుతున్నారు. అతిశీతలమైన ధ్రువప్రాంతంలో ఒంటరి మహిళ!

మరి వ్యోమగాముల మాటేమిటి? ఆరు నెలలకు పైగా భూమికి దూరంగా అంతరిక్షంలో ఉంటూ విభిన్నమైన వాతావరణంలో పరిశోధనలు చేస్తూంటారే? సునీతా విలియమ్స్ కుటుంబానికి దూరంగా ఆరు నెలలు అంతరిక్షంలో ఉన్నారే. ఏదైనా సాధించాలనే లక్ష్యం బలంగా ఉన్నప్పుడు – ఆటంకాలు ఏమీ చేయలేవు.

అలాగే నార్వేజియన్ దేశాలలోని కొన్ని ప్రాంతాలలో ఆరునెలల పాటు సూర్యోదయం ఉండదు. ఆ కాలమంతా అక్కడివారు చీకటిలోనే జీవిస్తారు, సర్దుబాటు చేసుకుని! వీటన్నింటికీ ఎంతో మనోబలం ఉండాలి! ఆటంకాలను అధిగమించగలమన్న ధైర్యం ఉండాలి.

కరోనా విషయానికొస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకుంటే దీనిని సులువుగా ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు. హారీ పాటర్ నవలా రచయిత్రి జె.కె. రౌలింగ్‌కి తనకి కోవిడ్-19 లక్షణాలు కనబడుతున్నాయని అనుమానం వచ్చిందట. అప్పుడామె భర్త ఆమెతో బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయించి, గోరు వెచ్చటి నీళ్ళు తాగించి, మందులు వాడితే ఆ లక్షణాలు మాయమయ్యాయని ఆమె చెప్పింది.

***

సోషల్ డిస్టన్స్ అనేది మనం ఇప్పుడు పాటించాల్సిన సమయం. ఇంట్లో కూర్చుని భయపడుతూ వుండక్కర్లేదు. మనం మన పరిధిలోనే విజయం సాధించగలమని ఆలోచించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మనం ఇప్పుడు చక్కగా డాన్సు, యోగా, నడక, పరుగు అన్ని వ్యాయామాలతో దేహదారుఢ్యం పెంచుకొని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.

మీ కిష్టమైన వంటలు, పండ్లు తినండి. Juices త్రాగండి. భయాందోళనలు వీడి, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు ప్రతి రోజు చేయండి. మీలో ఉత్సాహాన్ని నింపుకోండి. పాటలు, ఆటలతో సమయం గడపండి. ఇవన్నీ మీకు ఉపకరిస్తాయి.

పుస్తకాలు చదవండి, కథలు రాయండి, పాటలు, కవితలు రాయండి. ఎగురుతున్న పక్షిలా ఉండండి, గెంతుతున్న బంతిలా ఎగరండి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి.

ఈ సందర్భంగా నేను కరోనాపై వ్రాసిన ఈ కవితను చదవండి:

కరోనా వద్దు వద్దు
ఆరోగ్యమే ముద్దు ముద్దు.
ఆకాశమే హద్దు హద్దు.
మానవునితో కలవ వద్దు.
కరచలనం చేయవద్దు.
~
మాస్కులు ధరిద్దాం.
విడివడిగా పాటిద్దాం
మన హద్దు.
కరోనాని పారద్రోలదాం.
ధైర్యంగా, ఆరోగ్యంగా
సంతోషంగా, ఉత్సాహంగా.

ఇలాంటివే మీకు తోచిన విధంగా మీరూ రాయచ్చు.

ఆత్మీయులతో మాట్లాడండి. ఎంత క్లిష్టమైన పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను అని ధైర్యంగా వుండండి. మనసు లోని ధైర్యాన్ని కోల్పోకండి. కరోనా కరోనా అని భయపడకండి.

సోషల్ డిస్టన్స్‌ని మెయిన్‌టెయిన్ చేయండి.  Stay at home, be safe.

ప్లేగుని జయంచిన దరహాసంతో చార్మినార్ నిర్మించుకున్నాము.

మనమంతా కల్సి సిపాయిలుగా మారుదాం. గుంపులా కాదు. విడి విడిగా ఒక్కొక్కరిగా సాముహికంగా పోరాటం చేద్దాం. ఈ సమాజ పురోగతికి పాటుపడదాం, మనల్ని మనం కాపాడుకుందాం.

పైన చెప్పుకున్న వ్యక్తుల జీవితాలు మరోసారి గుర్తు చేసుకోండి. మనము ఈ lock-down periodలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపవచ్చును. మన కుటుంబ సభ్యులతో ఎన్నో పనులు నిర్వర్తించుకోవచ్చు ప్రేమ ఆప్యాయతలతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here