Site icon Sanchika

Countermelody పాటలు

[dropcap]పా[/dropcap]శ్చాత్య సంగీతంలో countermelody లేదా countersubject తెలియవస్తూ ఉంటుంది. Counterphrase లేదా countermelody అంటే ఒక phrase లేదా ఒక melodyపై మరొక phrase, melody వ్యాపించి లేదా అమరి (overlap అయి) ఉండడం లేదా Counter గా ఉండడం. సంగీతంలో ఈ విధానం లేదా నిర్మాణం ఒక గొప్ప విషయం. సంగీత సృజనకారుల గొప్పతనాన్ని ఇది తెలియజేస్తూ ఉంటుంది.

ఈ countermelody లేదా countersubjectను మనదేశ సినిమా పాటల్లోకి కొందరు సంగీత దర్శకులు తీసుకోచ్చారు. మనదేశ సినిమాల్లో counter – melody ని తొలిసారి ప్రయోగించింది సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్. 1942లో విడుదలైన రోటీ హిందీ సినిమాలో గాయని సితారా & బృందం పాడిన పాట “జీవన్ ఉభ్డాఎ…” ద్వారా అనిల్ బిశ్వాస్ countermelodyని మనదేశంలో తొలిసారి ప్రయోగించారు.

పాట లింక్:

https://www.saregama.com/song/jeevan-ubhraye-nain-rasiaye_161349

అనిల్ బిశ్వాస్ తరువాత దేశంలో ఇలాంటి ప్రయోగం‌ చేసిన సంగీత దర్శకుడు సజ్జాద్‌ హుస్సైన్. 1951లో‌‌ వచ్చిన సయ్యాన్ సినిమాలో‌ “వో రాత్ దిన్ వో షామ్ కీ…” పాటలో counter melodies ఉంటాయి. లతామంగేశ్కర్ పాడారు.

పాట లింక్:

https://youtu.be/DT8uWGwISxs

శంకర్-జైకిషన్ సంగీతంలో 1955లో వచ్చిన శ్రీ 420 సినిమాలో “ప్యార్ హువా ఇక్ రార్ హువా…” పాట countermelodiesతో గొప్పగా ఉంటుంది. మన్నాడే, లతామంగేశ్కర్ పాడారు.

పాట లింక్:

https://youtu.be/xjxyculMGzE?feature=shared

ఆ తరువాత సంగీత‌ దర్శకుడు సి.రామచంద్ర ఆ పద్ధతిలో 1957లో  నౌ షేర్ వా – ఎ – ఆదిల్ సినిమాలో‌  “ఆజా ఆజా రాత్ ధలీ…” పాటను చేశారు. లతామంగేశ్కర్ పాడారు.

పాట లింక్:

https://youtu.be/BsBn90bSLzg

1967లో వచ్చిన బహారోన్ కే సప్నే సినిమాలో సంగీత దర్శకుడు ఆర్.డీ. బర్మన్ “క్యా జానూ సజన్…” పాటను countermelodies తో గొప్పగా చేశారు. గానం లతామంగేశ్కర్.

పాట లింక్:

https://youtu.be/R7r2VmBHBUs?feature=shared

1987లో‌ మళ్లీ ఆర్. డీ. బర్మన్ ఇజాజత్ సినిమాలో “కత్ రా కత్ రా మిల్తి హై…” అన్న పాటను‌ ఆ పద్ధతిలో‌ చేశారు. ఆశాభోన్‌స్లే పాడారు.

పాట లింక్:

https://youtu.be/PZzK3CVzLKo?feature=shared

దక్షిణాది సినిమాలో countermelody లేదా countersubjectను సంగీత దర్శకుడు ఇళయరాజా తీసుకొచ్చారు. 1978లో వచ్చిన కార్ట్రినిలే వరుమ్ గీదం తమిళ్ష్ సినిమాలో “కణ్డేన్ ఎంగుమ్ పూమగళ్ నాట్టియమ్…” పాటను ఇళయరాజా ఈ విధానంలో చేశారు; ఎస్. జానకి పాడారు.

పాట లింక్:

https://youtu.be/SNp1Yf4F1qY?feature=shared

చిట్టుక్కురివి (1978) తమిళ్ష్ సినిమాలో “ఎన్ కణ్మణీ ఉన్ కాదలి…” అన్న గొప్ప పాటను ఈ నిర్మాణంలో చేశారు ఇళయరాజా. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, పీ. సుశీల పాడారు.

పాట లింక్:

https://youtu.be/1q27kfl2hwg?feature=shared

1979లో వచ్చిన ఆఱిలిరున్దు అఱుబదు వరై తమిళ్ష్ సినిమాలో ఇళయరాజా ఈ విధానంలో “కణ్మణియే కాదల్ ఎన్బదు కావియమో…” పాటను చేశారు. ఎస్. జానకి, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాడారు.

పాట లింక్:

https://youtu.be/hxmCCrILAjc?feature=shared

1985లో వచ్చిన పగల్ నిలవు అన్న తమిళ్ష్ సినిమాలో ఇళయరాజా ఈ విధానంలో “పూమాలైయే తోళ్ సేరవా…” పాటను చేశారు. ఇళయరాజా, ఎస్. జానకి పాడారు.

పాట లింక్:

https://youtu.be/HxCOcxJYfjY?feature=shared

ఇలా counter phrases, melodiesతో ఉండే పాటలు మనదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని మాత్రమే వచ్చాయి. పాటలోనో, వాద్య సంగీత నిర్మాణంలోనో countermelody లేదా countersubject  ఉండడం విశేషాంశం; సంగీత సృజనకారుల ప్రతిభకు, తెలివికి, తెలివిడికి, గొప్పతనానికి మచ్చుతునక.

Exit mobile version