Site icon Sanchika

దైవనీతి

మహత్యాల భూమి
ఎందరో దేవతలు
అదెందరో దేవుళ్ళు
ప్రవక్తలు..
ప్రవచనకారులు..
కోటి ఖ్యాతి సూత్రాలు
ముక్కోటి నీతి తత్వాలు
ఒక్క మనిషి తత్వం తప్ప!
మనిషికి మనిషికి
మధ్య దూరం.. దుమారం
ద్వేషం.. విద్వేషం
హెచ్చు.. తక్కువ
సురులు.. అసురులు
అగ్రజులు.. అంటరానివారు
కాపీర్లు.. మేచ్లులు.. హీదేన్లు
ఇక్కడ ముఖ్యం
మతం.. కులం..
అంద విశ్వాసాలు.. భక్తి
మనిషి కాదు
నొసటి బొట్టు
గడ్డం
శిరోమండనం
శిలువ ధారణ
తలకాయ ఒక్కటే
తోకలే వేరు వేరు
ఈ విలువలు
మానవ విలువలు
ఈ నీతి
మానవ నీతి
దైవనీతి కాదు.

Exit mobile version