Site icon Sanchika

దాని లెక్కలా అది వుంది

“ఈ విశ్వానికి ఉనికి దేవుని నింకా వచ్చిందంటే దేవుడెట్లవొచ్చె

అనే కొచ్చన్ వొస్తుంది కదనా?”

“అవునురా”

“పోనీ విశ్వానికి ఆది ఆంతము లేదు అందామా?”

“శానా జనము అన్నింది అదేరా”

“అవును కదా”

“మనము ఉండాము, పోతాము – అట్లే విశ్వం వుండి పోతుంది అంటే?”

 “అదెట్లంటాం మనమంటే మనుషులం ఈ మన్ను నింకా వొస్తిమి

మంట్లోకే పోతాం…. కాని విశ్వం ఏడనింకా వొచ్చె, ఏడకి పోతుంది

అని చెప్పేది?”

“ఇదీ నిజమే… శూన్యంలో వుంది శూన్యమైపోతుంది అందామా?”

“దానికేం మనకి ఎట్లతోస్తే అట్ల అనుకోవచ్చు కాని విశ్వం

దాని లెక్కలా అది వుంటేమో?”

‘ఏమోరా, కాని విశ్వం ఉనికిలా వుంది, మనకి ఉనికి వుంది

అనుకొందాం”

“అంతేనా”

***

దాని లెక్కలా అది వుంది = దాని ప్రకారం అది వుంది.

Exit mobile version