[22.7.2024 నుండి దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన కవితని అందిస్తున్నాము.]
[dropcap]దా[/dropcap]శరథి కవితలో
పేదోడి ఆకలి దప్పులు
గుండె మంటలు
భగ్గు మంటాయి
కవి ప్రజల గోస వినిపిస్తాడు
పాలక పక్షానికి
దాశరథి కృష్ణమాచార్య
అక్షరాలా అదే చేసాడు
నవాబును ఎదిరించాడు
కటకటాల పాలయ్యాడు
అయినా పాడాడు
పేదోడి పాట
దాశరథి గరీబోల్ల కవి
అమీరులకు చుర కత్తి
దోపిడికి వ్యతిరేకం
దోపిడి దారులకు
సింహస్వప్నం
దాశరథికి మరణం లేదు
తెలుగు భాష ఉన్నంత వరకు
తెలుగు కవితలు
చదివే పాఠకులు
వున్నంత వరకు