అమవస నిశిలో నిరాశను
జ్యోతి కాంతితో తొలగించి
ఆశాదీపాలు వెలిగించు
పర్వ దినం దీపావళి పండుగ
మన అజ్ఞానపు చీకటిని
తొలగించే సంకేతముల
కేతనములు ఎగురవేయు
దీపావళి టపాసుల రూపులో
మమతల మతాబులు
నవ్వుల కాకరపువ్వొత్తులు
ఆత్మీయ తారాజువ్వలు
ప్రేమ చిచ్చు బుడ్లు
వలపుల టపాకాయలు
వెలిగించి చీకటి తొలగించి
ఆనంద కాంతులు వెదజల్లి
సమతా మమతలను పెంచే
ఈ దీపావళి పండుగ మెండుగ