[dropcap]అ[/dropcap]జ్ఞానపు అమవస నిశిలో
తిమిరంలో తిరిగే నరుడే
నరకుడు కళ్ళున్న అంధుడు
దారి తెలియని పాంధుడు
చక్రి జ్ఞాన చక్రముతో నరకగా
మూసిన కనులు తెరవగ
వెలుగులు దీపాల వెలుగులు
జ్ఞాన దీపాల కాంతులు
అరిషడ్వర్గాల చీకటిలో కుటిలో
కూరుకు పోయిన నర నరకుడు
నవ నరునిగా మారిన రోజు
పండగే కదా, దీపావళి పండగే కదా