Site icon Sanchika

దేహమును ప్రేమించుమన్న

[శ్రీ ఫణి మాధవ్ కస్తూరి రచించిన ఈ కవితని  వేరే కవయిత్రి తమ పేరు మీద పంపేరు. రచయిత్రి మీద ఉన్న నమ్మకంతో ఈ కవితని  సంచికలో ప్రచురించాము. ఈ కవితని ఫణి మాధవ్ 2012లో రచించి తమ బ్లాగులో పోస్ట్ చేశారు. సాధారణంగా సంచికలో కథలు/కవితలు ప్రచురించే ముందు అవి అంతర్జాలంలో ఎక్కడైనా మునుకు పోస్ట్ చేయబడినాయా అని చెక్ చేసుకుంటాము. కానీ ఈ కవిత మా దృష్టికి రాలేదు. అందువల్ల సంచికలో ప్రచురించడం జరిగింది. సంచిక ఉన్నత ప్రామాణికాలను పాటించే పత్రిక. అలాంటి పత్రికకకు, ఇలా వేరేవారి రచనలను తమ పేర్లతో పంపవద్దని మనవి. తనది కాని దాని ద్వారా పేరు తెచ్చుకోవాలను ఆశపడటం కూడని పని. సంచిక అలాంటి పనులకు ప్రోత్సాహం ఇవ్వదు. అందుకే, ఫణి మాధవ్ గారిని క్షమార్పణలు వేడుకుంటూ ఈ కవితను ఫణి మాధవ్ గారి పేరిట  పునః ప్రచురిస్తున్నాము. సామాన్యంగా, ఇతర మాధ్యమాలలో ప్రచురితమైన రచనలను సంచికలో ప్రచురించడం జరగదు. కానీ ఇదొక ప్రత్యేక సందర్భంగా పరిగణించి, అసలు రచయిత హక్కుని కాపాడుతూ సంచికలో వారి పేరి మీదే ప్రచురిస్తున్నాము. తమవి కాని రచనలను తమ పేరుతో సంచికకు పంపవద్దని మనవి.]

[dropcap]దే[/dropcap]హమును ప్రేమించుమన్న।
మంచి సైజులో వుంచుమన్నా॥
దేహమంటే పొట్ట కాదోయ్।
యోగా చేసి బాగుపడవోయ్॥

వంటపై మీటింగ్ కట్టిపెట్టి।
గంట వాకింగ్ మొదలుపెట్టోయ్ ॥ దేహమును ॥
పిజ్జా, బర్గర్ కట్టిపెట్టి।
ఆవిరిడ్లీ లాగించవోయ్॥

ఆకుకూరలో సేవ వుంది।
చూపు కోసం మంచి దన్నది॥
రేకు టిన్నులో కోకు కన్నా।
బోరుల మిచ్చే నీరు మిన్న ॥ దేహమును ॥

మెట్టు, మెట్టు ఎక్కిన అందలం।
ఆనందం, ఆరోగ్యం పదిలం. ॥ దేహమును ॥

గురుజాడలో పేరడీ…
గరజాడకు నివాళి

Exit mobile version