Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-14

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]దే[/dropcap]శంలోకి మొఘలుల రాకతో సమాజంలో విదేశీ, స్వదేశీ మత విభజన పరిపూర్ణమైంది. పదో శతాబ్దం నుంచే మంగోలుల ప్రభావం మన సమాజంలో అబ్జార్బ్‌ కావడం మొదలైంది. పదిహేనో శతాబ్దం వచ్చేసరికి మంగోలులు మొఘలులుగా మారి మన దేశంలో అధిక భాగాన్ని స్వాధీనం చేసుకొని రాజ్యమేలారు. చంగీజ్‌ఖాన్‌, తైమూర్‌లంగ్‌కు చెందిన దాదాపు పదకొండో వారసుడు బాబర్‌ ఉత్తర భారతదేశంలో ఢిల్లీ రాజధానిని చేసుకొని మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1526 ఏప్రిల్‌ 21న మొదటి పానిపట్‌ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఢిల్లీ రాజు ఇబ్రహిం లోడీ ఓడిపోవడంతో బాబర్‌ అధికారాన్ని హస్తగతం చేసుకొన్నాడు. మంగోలు, తురుష్క, అఫ్గానీలతో పాటు కొంతవరకు పర్షియన్లు బాబర్‌ సైన్యంలో ఉన్నారు. అప్పటికి అరబ్బుల ప్రభావం దాదాపుగా దేశంనుంచి తొలగిపోయింది. బాబర్‌ దాదాపు 12 వేల సైన్యంతో ఇబ్రహిం లోడీపైకి దూసుకొచ్చాడు. లోడీ రాజ్యంలో అనైక్యత, అనిశ్చితి బాబర్‌కు కలిసివచ్చింది. అందువల్లే దాదాపు 40 వేలకు పైగా సైన్యం ఉన్నప్పటికీ.. బాబర్‌ సులువుగా లోడీని ఓడించాడు. ఫిరంగుల కంటే.. బాణాలతోనే బాబర్‌ యుద్ధం గెలిచినట్టు చరిత్ర చెప్తున్నది. 1527లో మేవాడ్‌ రాజపుత్రులతో బాబర్‌ సైన్యం యుద్ధం చేసింది. రాజా సంగ్రామసింహుడు రాజపుత్రులందరినీ ఐక్యం చేసి యుద్ధంలో నిలిచాడు. అక్బర్‌ అధికారంలోకి వచ్చేదాకా మొఘలులతో రాజ్‌పుత్‌లు వారిని ఎదిరించి పక్కలో బల్లెంలా కొనసాగారు. దాదాపు 150 ఏండ్లపాటు మేవాడ్‌ రాజ్యం మొఘలులకు కొరుకుడు పడలేదు.

బాబర్‌ రాజ్యం స్థాపించిన తరువాత మొఘలులు అలియాస్‌ మంగోలుల వంశం పూర్తిగా భారత్‌లోనే స్థిరపడిపోయింది. దాదాపు ఏడు తరాలు ఢిల్లీ రాజ్యాన్ని పాలించాయి. ఉత్తరభారతం నుంచి దక్కన్‌లో కొంతభాగం వరకూ మొఘల్‌ సామ్రాజ్యం విస్తరించింది. ఇందులోనూ అక్కడక్కడ స్వతంత్ర రాజ్యాలు కొనసాగాయి. మిగతా దక్షిణ భారతదేశం మాత్రం వారి వశం కాలేదు. తైమూర్‌ నుంచి ఔరంగజేబ్‌ దాకా మొఘలులు.. ఇంకా చెప్పాలంటే.. అరబ్బు అయిన మహమ్మద్‌ బిన్‌ ఖాసిం నుంచి కూడా హిందువులను, బౌద్ధులను ఎక్కడికక్కడ ఊచకోత కోస్తూ దేశంలోకి విస్తరించారే తప్ప మన మార్క్సిస్టు చరిత్రకారుల దగ్గరినుంచి.. ఇంకా చెప్పాలంటే ఘనత వహించిన ప్రధాని నెహ్రూ సైతం వీరిని సాధు జంతువులుగా చూపాలని తెగ ప్రయత్నంచేశారు. అలాగే మనకు చరిత్ర పాఠాలు బోధించారు. అలాగే సినిమాలు తీశారు. జాగ్రత్తగా గమనిస్తే ఖాసిం దగ్గరి నుంచి ఔరంగజేబ్‌ దాకా ఒకే తరహాలో ఇస్లాం పాకుతూ వచ్చింది. పైశాచికంగా ఊచకోతలు.. మహిళల మాన హరణాలు.. బానిసత్వం.. వెట్టి.. క్రూరత్వం.. వెరసి ఈ దేశంలోకి ఇస్లాం అనే మతం చొరబడి పాతుకొనిపోయింది. క్రీస్తుశకం 624 నుంచి 18వ శతాబ్దంలో మొఘల్‌ సామ్రాజ్యం అంతమయ్యే వరకు అత్యంత క్రూరంగా, భయానకంగా.. సాగిన అరబ్బులు, మంగోలుల ఊచకోతల్లో ఎంతమంది హతులయ్యారన్నది లెక్కల్లో చెప్పడం కూడా కష్టం. ఇవాళ దేశంలో శిథిల కోటల శకలాల కింద, శిథిల దేవాలయాల రాళ్ల కింద.. ఆలయాలపై కట్టిన ప్రార్థనా మందిరాల పునాదుల్లో ఎన్ని అస్తికలు దొరుకుతాయో.. ఎంత రక్తం ఆ మట్టిలో ఇంకిపోయిందో చెప్పటం ఎవరికైనా కష్టమే. ఈ ఊచకోతల గురించి మార్క్సిస్టు చరిత్రకారులు చాలా చాలా చెప్పొచ్చు. మహా మేధావి మహమ్మద్‌ హబీబ్‌.. ఘజ్‌నీ ఊచకోతల గురించి సుల్తాన్‌ మహమ్మద్‌ ఘజ్‌నీ అన్న గ్రంథంలో వక్కాణించింది ఏమంటే.. వ్యాపారంలో సంపాదించిన అంతులేని సంపదతో భారతదేశం బంగారు వెండి గుట్టల్లా కనిపించిందట. సిరిసంపదలన్నింటినీ.. గుడులలో బోషాణాల్లో భద్రపరిచేవారట. దేవాలయాలు సేఫ్‌ డిపాజిట్‌ లాకర్లలా ఉన్నాయిట. దేశంలోని సంపద అంతటినీ కొద్ది స్థలాల్లో కేంద్రీకృతం చేసి భారతీయులే ఘజ్‌నీ లాంటి వారిని దోచుకోవడానికి దారులు ఏర్పరిచారట.

It was impossible that the Indian temples should not sooner or later tempt someone strong and unscrupulous enough for the impious deed. nor was it expected that man of Mahmud’s character would allow the tolerance which Islam inculcates to restrain him from taking possession of the gold when Indians themselves had simplified his work by concentrating the wealth on the country at a few places (p.82 sultan Mahmud of Ghazni)

ఇంతగా సెలవిచ్చిన హబీబ్‌ గారు.. అమ్మాయి  అందంగా వుండి రేపిస్టును రెఛ్చగొట్టిందన్నట్టుంది ఈ వాదన.  ఇంతకీ  దేవాలయాల్లో అంత సంపద ఎందుకు దాచి ఉంచారో చెప్పలేదు. కేవలం దోపిడీ కోసమే ఘజ్‌నీ లాంటి వారు వచ్చి ఉన్నట్టయితే.. నగరాలకు నగరాలను ఎందుకు తగలబెట్టినట్టు.. మధురలో ఆడవాళ్లను, పిల్లలను బానిసలను చేసి.. లెక్కకు కూడా అందనంతమంది మగవాళ్లను ఎందుకు ఊచకోత కోసినట్టు.. తైమూర్‌లంగ్‌ ఒక్క రోజులో లక్ష మంది హిందువులను తన సైన్యానికి పోటీ పెట్టి ఎందుకు చంపించినట్టు? ఆలయాలను, విగ్రహాలను పదే పదే ఎందుకు ధ్వంసం చేసినట్టు. ఒకసారి దోపిడీ పూర్తయ్యాక మళ్లీ మళ్లీ ఎందుకు దాడులు చేసినట్టు.. ఇస్లాం రాజులంతా వందలాది, వేలాది ఆలయాల పునాదులమీద వాళ్ల ప్రార్థనామందిరాలు ఎందుకు నిర్మించినట్టు.. హబీబ్‌కు ఇవేవీ కనిపించలేదు. ఇంతకు ముందరి వ్యాసాల్లో చెప్పుకొన్నట్టు.. కేవలం సంపదను దోచుకోవడానికే దాడులు పరిమితం కాలేదు. అత్యంత తీవ్రమైన మతోన్మాదానికి దారితీశాయి. అరేబియాలోనూ.. పర్షియాలోనూ.. భారత్‌లోనూ.. మతమే   దోపిడీకి ఆధారభూతమైంది. అరేబియాలో మహా మానవహననానికి దారితీసి.. అక్కడ అంతకుముందు ఉన్న మతాలను  మూలాలు లేకుండా చేశారు. పర్షియాలోనూ అదే జరిగింది. భారత్‌లోనూ.. ఈ ఉన్మాదం పెచ్చుమీరింది. ఇస్లాము.. పరమతసహనం.. శాంతి వచనాలకు గత పదిహేను వందల సంవత్సరాల్లో ఏ దశలోనూ చోటు లేనే లేదు. ‘హిందూ కాఫిర్లు’, ‘ఇస్లాం వ్యతిరేక విగ్రహారాధకులు’ వీళ్లను హతమారిస్తేనే.. లేదా మతం మారిస్తేనే.. ఈ దేశం సమస్తం తమ హస్తగతమవుతుంది. ఇక్కడి మూలాలను సమూలచ్ఛేదనం చేయడం.. మున్ముందు తరాలకు కనీసం ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేయడమే లక్ష్యంగా ఈ అమానుష మారణకాండ కొనసాగింది. కేవలం దోపిడీ వేరు.. పనిగట్టుకొని.. ఏరికోరి తమ మతాన్ని వ్యతిరేకించే మనుషులను పట్టుకొని నిలబెట్టి నరికేయడం వేరన్న విషయం హబీబ్‌లాంటి చరిత్రకారులకు ఎంతమాత్రం అర్థం కాలేదు. చివరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోనూ ఇదేరకమైన చరిత్రను రాసుకొంటూ వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పసాగారు. సతీశ్‌చంద్ర ఎన్‌సీఈఆర్టీ 11 వ తరగతి పిల్లల కోసం రాసిన మెడివల్‌ ఇండియన్‌ హిస్టరీలో రాసింది ఇదే. అసలు మంగోలులు, అరబ్బులు ఈ దేశాన్ని దోచుకొన్నారే కానీ ఎలాంటి ఘోరాలకు పాల్పడలేదన్నట్టుగానే రాసుకొంటూ వచ్చారు. కొందరు వ్యక్తులు చేశారే తప్ప మతానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఇక్కడ ఒక్క విషయం మాత్రం విస్పష్టం. భారతదేశంపై ఇస్లాం దండయాత్రల్లో.. దోపిడీకి.. మతానికి విడదీయరాని బంధం ఉన్నది. ఈ రెండింటినీ వేరుచేసి చూడటం సాధ్యం కాదు. సరైనదీ కాదు. వాళ్లు దోపిడీ చేసిన ప్రతిచోటా అన్యమత మూలాలను విధ్వంసం చేసుకొంటూ పోయారు. మహా మానవ మారణ కాండతో మతమార్పిళ్లకు పాల్పడి  ప్రతిచోటా అంతులేని సంపదను దోచుకొన్నారు. చరిత్రకు ఎవరు ఎన్ని భాష్యాలు చెప్పినా.. ఇదే సత్యమని దోపిడిదారులు రాసుకొన్న పుస్తకాలే చెప్తున్నాయి. తైమూర్‌ మాదిరిగానే బహుమనీ సుల్తానులు తాము సంవత్సరానికి లక్ష మంది విగ్రహారాధకులను చంపాలని ప్రతిజ్ఞ చేసి అమలు చేశారు. మళ్లీ మొఘలుల దగ్గరకు వద్దాం. ఢిల్లీలో మొఘల్‌ వంశాన్ని స్థాపించిన బాబర్‌.. ఇప్పుడు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ జిల్లాలోని మిలామత్‌ లోయలో తాను నరికి పారేసిన కాఫిర్ల రక్తంతో నేలంతా తడిసిపోయిందని.. ఆ రక్తపు తడి నేలలో గుడారాలు నిలువలేకపోవడంతో మూడుసార్లు తాను గుడారాలను మార్చాల్సి వచ్చిందని రాసుకొన్నాడు. అక్కడి యుద్ధంలో తాను చంపించిన మనుషుల శవాల నుంచి పుర్రెలను వేరుచేసి ఆ పుర్రెలతోనే ఒక స్తూపాన్ని నిర్మించాడు. అంతేనా, రాజాస్థాన్‌లోని ఖాణ్వాలో రాజపుత్రులపై యుద్ధం చేసి అక్కడా పుర్రెల స్తూపం కట్టాడు. మధ్యపద్రేశ్‌లోని చందేరీలోనూ బాబర్‌ పుర్రెల స్తూపం కట్టాడు. ఇవన్నీ ఈ మహానుభావుడు ఘనంగా రాసుకొన్నాడు. హిందువులే కాదు.. బౌద్ధులనూ అతి దారుణంగా ఊచకోత కోశారు. ఒక్క బాబరే కాదు.. పుర్రెలతో పిరమిడ్‌లు నిర్మించిన సుల్తానులు కొల్లలుగా కనిపిస్తారు. మహామానవతావాది అయిన అక్బర్‌ చిత్తోడ్‌ కోటను రాజ్‌పుత్‌లనుంచి 1568లో స్వాధీనం చేసుకొన్న వెంటనే.. తనకు చిక్కిన 30 వేల మంది రాజపుత్రుల తలలు నరికించాడు. అంతకుముందు దక్షిణాన విజయనగర సామ్రాజ్య పతనం తరువాత హంపీలో సుల్తాన్‌ల మూకలు నెలల తరబడి సాగించిన రాక్షస క్రీడను ఎంత వర్ణించినా సరిపోదు.

A cursory glance at all the non-Arab Muslim countries in the world reveals a well-known truth: their pre-Islamic history has been completely erased. That leaves us with a fundamental question: what precise elements of their past do they celebrate? The equally precise answer: a series of invasions and plunders and court intrigues and mass conversions and slavery of non-Muslims and wasteful royal extravagances, all underscored by the same event: the victory of Islam. Neither is this their own history. It is the regurgitation of the histories written by their Muslim conquerors. We don’t need to go really far back into history. A living example is available right next door. The seventy year-long—and continuing—attempt by Pakistan to rewrite its history from the scratch reveals the same phenomenon. The accurate word is “mindset” or “psyche.” What is true at the individual level is true at the national level. A new convert to Islam has to compulsorily disavow, disown, and detest his past. By summoning within himself a gushing fountain of unparalleled psychological violence. In the case of nations like Pakistan, it calls for not just a rejection but a conscious destruction of every vestige of its non-Islamic pastory. A living example is available right next door. The seventy year-long—and continuing—attempt by Pakistan to rewrite its history from the scratch reveals the same phenomenon. The accurate word is “mindset” or “psyche.” What is true at the individual level is true at the national level. A new convert to Islam has to compulsorily disavow, disown, and detest his past. By summoning within himself a gushing fountain of unparalleled psychological violence. In the case of nations like Pakistan, it calls for not just a rejection but a conscious destruction of every vestige of its non-Islamic past. Which evokes a related question: what history does Pakistan have if it rejects its Hindu past? None. And therefore it needs to invent a past filled with Islamic heroes, something it has already done. Invariably, all its heroes are foreign barbarians.

(కేఎం మున్షీ, ది కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఈజ్‌ ది కాంక్వెస్ట్‌ ఆఫ్‌ కల్చర్‌ బై దోజ్‌ హు లాక్డ్‌ ఇట్‌)

ఇస్లామిక్‌ సుల్తానుల గురించి మున్షీ కంటే గొప్పగా చెప్పేదేమున్నది? మన మతాన్ని నిలబెట్టాలంటే.. ఎదుటివాడి మూలాలను ఛిద్రం చేయాలన్నదే అరబ్బులైనా మంగోలులైనా పాటించిన సూత్రం. మానసికమైన హింసాత్మక వాతావరణాన్ని (సైకలాజికల్‌ వాయ్‌లెన్స్‌) సృష్టించడం ద్వారా మనుషులను బానిసలుగా మార్చుకొని.. తమ ప్రపంచాన్ని నిర్మించడం లక్ష్యంగానే ఈ దాడులు సాగాయి. వాళ్లు అరేబియాలో, పర్షియాలో.. భారత్‌లోని పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో సక్సెస్‌ అయ్యారు. హత్య చేయడం అంటే ఒకరో.. ఇద్దరినో చంపడం కాదు.. వెంటాడి.. వేటాడి వందలు, వేలు, లక్ష మందిని ఒకేసారి పట్టుకొచ్చి.. నాలుగు రోడ్ల కూడలిలో నిలుచోబెట్టి.. అత్యంత పైశాచికంగా చిత్రహింసలు పెట్టి.. చావే మేలు అన్న దశకు తీసుకొచ్చి హతమార్చడం చరిత్రలో ఏ దేశంలోనూ జరగలేదేమో. అ మారణకాండను కండ్లారా చూసిన తరువాత వారిముందున్న ప్రత్యామ్నాయం ఒక్కటే.. హిందువులంతా తమ చేతులతో తామే తమ ఇండ్లకు నిప్పు పెట్టుకోవడం.. తమ స్త్రీలను, పిల్లలను శత్రువులకు చిక్కకుండా చితిపేర్చి నిప్పుల్లో ఆహుతి చేయడం. బతికుంటే బలుసాకు తినవచ్చన్న సామెత ఈ భయానక పరిస్థితి నుంచే పుట్టుకొచ్చిందనుకొంటా.. ఈ మారణకాండ చూసి కూడా ఏ ఒక్క హిందువైనా తన మతాన్ని పాటించడానికి సాహసించగలడా? అయితే మతం మారాలి. లేదా మరణించాలి.. లేదా మరో దేశానికి పారిపోవాలి. ఇంతకు మించి మరో తరుణోపాయం కూడా లేదు. మన దేశంమీదకు ఘజ్‌నీ మహమ్మద్‌ దండెత్తి వచ్చిన 11వ శతాబ్దం నుంచి బాబర్‌ అడుగుపెట్టిన 16వ శతాబ్దం వరకు దాదాపు అయిదు శతాబ్దాలలో భారత్‌లో హిందువుల జనాభా దాదాపు 8 కోట్ల మేర తగ్గిందని ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ లాల్‌ అంచనా వేశారు. ఈ లెక్కలకు పెద్దగా శాస్త్రీయత లేకపోవచ్చు. కానీ ఘజ్‌నీ నుంచి ఔరంగజేబు వరకు జరిగిన రక్త చరిత్రను గమనిస్తే.. కేఎస్‌ లాల్‌ లెక్క చాలా తక్కువేమోననే అనిపిస్తుంది. పాతవన్నీ తవ్వుకోవడం వల్ల ఇప్పుడు ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. కానీ.. జర్మనీలో నాజీలు తమపై చేసిన దారుణాలు చెప్పుకోవడానికి ఏ యూదుడూ సంకోచించడు. ప్రపంచంలో ఏ మేధావీ దాన్ని తప్పుగా భావించడు. హిట్లర్‌ను గొప్పవాడని ఎవరూ అనరు. భారతదేశంలో మాత్రం చరిత్రను చరిత్రగా చెప్పుకోవడం తప్పుగా అనిపిస్తుంది. పరమత సహనం లేకపోవడంలా కనిపిస్తుంది. సెక్యులరిస్టు కాకపోవడంగా నిర్ధారణ అవుతుంది.. ఇంకా.. ఇంకా..

(సశేషం)

Exit mobile version