(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]ఒ[/dropcap]క దేశం రెండు వ్యవస్థలు.. అన్న సిద్ధాంతాన్ని 1940లో జిన్నా ప్రతిపాదించాడని చాలామంది అనుకొంటారు. ఇప్పటివరకు మనకు తెలిసింది ఇదే. కానీ ఈ సిద్ధాంతం 1590లోనే మన దేశంలోనే పుట్టుకొచ్చింది. మొఘలులు అలియాస్ మంగోలుల రాజ్యంలోనే ఇస్లామిక్ మత ఛాందసుడు అహ్మద్ అల్ ఫరూఖీ అల్ సిర్‌హిండి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాదు.. అత్యంత కఠినంగా అమలుచేశాడు. ప్రస్తుత పంజాబ్‌లోని సిర్‌హిండిలో జన్మించిన అహ్మద్ పదిహేడేండ్ల నాటికే కరడుగట్టిన మత ఛాందసుడిగా మారిపోయాడు. ఖ్వాజా బాఖీ బిల్లా ద్వారా సూఫీ మిషనరీలో చేరాడు. తద్వారా నక్షాబందీలో మాస్టర్ అయ్యాడు. మొఘల్ న్యాయస్థానంలో ప్రవేశించి నక్షాబందీని పాపులర్ చేశాడు. ‘షరియా, సూఫీ పరస్పర ఆధారితాలు. ఈ మార్గానికి బయట చెప్పినవాటన్నింటినీ ప్రవక్త నిషేధించాడు.’ కాబట్టి షరియాను కచ్చితంగా అమలుచేయాల్సిందే. ఇదీ ఇతని సిద్ధాంతం. సిర్‌హిండి సిద్ధాంతాన్ని సర్ ఆర్థర్ బుచ్లర్ మరింత వివరించాడు.
“Shariah is a multivalent and inclusive term encompassing outward acts of worship, faith, and the Sufi path. Sirhindi emphasizes Sufi initiation and practices as a necessary part of Shariah, and criticizes jurists who follow only the outward aspects of the sharia. In his criticism of the superficial jurists, he states: “For a worm hidden under a rock, the sky is the bottom of the rock.”
చాలా స్పష్టంగా సూఫీ మార్గానికి, షరియాకు అవతల చేసే ప్రార్థనలను, న్యాయ వ్యవస్థలను సిర్‌హిండి తిరస్కరించాడు. అల్లా ఆదేశాలను మాత్రమే పాటించాలి. ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని.. వ్యతిరేక మార్గంలో వెళ్తున్న వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపండి.. వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకోండి అని పిలుపునిచ్చాడు. అలా చేయడం ఎంతమాత్రం తప్పు కాదు. అల్లా వ్యతిరేకుల భవనాలను విధ్వంసం చేయడానికి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి దేవుడు అనుమతించాడు. అలా చేయడం మన హక్కు అని కూడా సిర్‌హిండి తీర్మానించాడు.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. సిక్కు మతానికి సంబంధించిన పది మంది మతగురువుల్లో ఐదవ గురువు గురు అర్జున్ దేవ్‌జీ. సిక్కు మతానికి చెందిన శాశ్వత గురువుగా, పదకొండో గురువుగా కూడా ప్రసిద్ధి చెందిన పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్‌ను సంకలనం చేసిన మహానుభావుడు. ఈయన కాలంలోనే అమృత్‌సర్ నిర్మాణం పూర్తయింది. తరన్‌తారన్ సరోవర నిర్మాణం, నిర్వహణ వ్యవస్థను పక్కాగా చేశాడు. అంతే కాదు కర్తార్‌పూర్‌లో పవిత్ర గురుద్వారా నిర్మాణం కూడా ఈయన కాలంలోనే పూర్తయింది. తనకు పూర్వం సిక్కు గురువుల బోధనలన్నింటినీ సంకలనం చేసి.. గురుగ్రంథ్ సాహిబ్‌గా రూపకల్పన చేశాడు. అంతకుముందు సిక్కు గురువులు కేవలం బోధనలు మాత్రమే చేశారు. ఒక సిక్కు గురువు సంకలనం చేసి ప్రచురితమైన రాతప్రతి గురుగ్రంథ్ సాహిబ్. సిక్కు మతావలంబులందరికీ ఈ గ్రంథం అత్యంత పవిత్రమైనది. సామాజిక జీవనం, సాధు జీవనాన్ని ప్రబోధించిన వాడు గురు అర్జున్ దేవ్‌జీ. అందరూ కలిసి వండుకొని.. సమిష్టిగా భోజనం చేసే సంప్రదాయాన్ని గురు అర్జున్ దేవ్ ప్రారంభించిందే. గురు అర్జున్ లాంగర్ (అందరూ కలిసి వండుకొనే వంటశాలలు)ల నిర్మాణానికి.. వాటిని ఒక సేవాభావంతో నిర్వహించడానికి వ్యవస్థీకృతం చేశాడు. ఇవాళ్టికీ గురుద్వారాలు, లాంగర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యున్నత సేవాభావంతో వీటిని నిర్వహిస్తారు. ఈ గురు అర్జున్ దేవ్ మొఘలుల పరమ పైశాచికత్వానికి బలైపోయిన సాధువు. మొఘల్ రాజు జహంగీర్.. గురు అర్జున్‌దేవ్‌ను అత్యంత దారుణంగా.. ఇంకా చెప్పాలంటే.. పైశాచికంగా చిత్రహింసల పాలుచేసి హతమార్చాడు. ఇస్లాంకు వ్యతిరేకంగా బోధనలు చేశాడని ఆరోపిస్తూ.. గురు అర్జున్‌దేవ్‌ను బంధించాడు. గురుగ్రంథ్ సాహిబ్‌లో కొన్ని పంక్తులను మార్చాలని ఒత్తిడి తెచ్చాడు. రెండు లక్షల దీనార్లు ఫైన్ వేశాడు. గురు అర్జున్‌దేవ్‌ను అత్యంత క్రూరంగా చంపేశాడు. రావి నదీతీరాన మండుటెండలో పొయ్యి పెట్టి దానిపై పెనం ఉంచి.. ఆ పెనం మీద కూర్చోబెట్టి నిప్పంటించి.. భయంకరంగా కాలే ఇసుకను.. సలసల మరిగించిన నీటిని బానల కొద్దీ తెప్పించి పైనుంచి కుమ్మరించి అత్యంత క్రూరంగా చంపించాడు.
ఈ జహంగీర్ ఎవరో తెలుసా? మనం మొఘల్ ఏ ఆజం, అక్బర్ సలీం అనార్కలీ, అనార్కలీ.. వంటి సినిమాల్లో చూశామే.. ఆ సలీమే ఈ జహంగీర్. ఘనత వహించిన అక్బర్ పాదుషా వారి సుపుత్రుడు. అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. అక్బర్ చనిపోయాక ఆ పీఠాన్ని ఎక్కి జహంగీర్‌గా రాజనామం తగిలించుకొన్న మహానుభావుడు. ఇతను చాలా గొప్ప ప్రేమికుడుగా, పక్షుల మీద పరిశోధకుడిగా, శాస్త్రవేత్తగా కూడా ఇతడిని మన చరిత్రకారులు పొగిడారు. కీర్తికిరీటాలు తగిలించారు. ఇంతకంటే గొప్ప ప్రేమికుడు మరొకడు ప్రపంచంలో లేడనేంతగా సినిమాలు తీశారు. కానీ నాణానికి మరోవైపు కూడా ఉన్నది. దాన్ని మాత్రం మన చరిత్రకారులు చూపించలేదు. అనార్కలిని ఇంతగా ప్రేమించాడని చెప్పుకొంటున్న సదరు సలీం అలియాస్ జహంగీర్ 1585 నుంచి 1611 వరకు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇరవైకి పైగా పెండ్లిళ్లు చేసుకొన్నాడు. ఈ మహానుభావుడిని అద్భుతమైన ప్రేమికుడిగా మనవాళ్లు చిత్రించారు. అఫ్‌కోర్స్ ఈయన కొడుకును అంతకంటే ఎక్కువగా నెత్తినెక్కించుకొన్నారనుకొండి.. అది వేరే గొప్ప చరిత్ర. హిందూ స్త్రీలను వివాహమాడటం మొఘలుల సెక్యులరిజానికి ప్రతీకలుగా మన సూపర్ హిస్టారియన్లు రాస్తారు.. నిర్మాతలు సినిమాలు తీస్తారు. కానీ వీళ్లు పెండ్లిళ్ల పేరిట అంతఃపురాలను వ్యభిచార కేంద్రాలుగా మార్చారన్నది అక్బర్ ది గ్రేట్ మొఘల్ అన్న గ్రంథాన్ని చూస్తే తెలిసిపోతుంది. అంతఃపురంలోని స్త్రీలను ప్రభువుల వారి వర్గానికి చెందిన ముఖ్యులకు పప్పు బెల్లాల్లా పంచిపెట్టారట. మొఘలు రాజుల చరిత్రను పరికిస్తే ఏ ఒక్క రాజు కూడా ఒక భార్యకు పరిమితమైన వారు కాదు. ఇద్దరు ముగ్గురితోనో సరిపెట్టుకొన్నవారూ కాదు. పదుల కొద్దీ ఆడవాళ్లను తెచ్చి అంతఃపురాల్లో పడేసేవారని చరిత్ర చెప్పకనే చెప్తున్నది. వీళ్లలో హిందూ స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఇదంతా ఒక చరిత్ర.
మనం మళ్లీ విషయానికి వస్తే.. లాహోర్ కోటలో గురు అర్జున్ దేవ్‌ను హతమార్చడం సిక్కు చరిత్రనే మార్చేసింది. సిక్కు సమాజంలో ఒక తీవ్ర సంచలనం సృష్టించింది. సిక్కుల దృక్పథాన్ని మార్చివేసింది. గురునానక్ స్థాపించిన నాటినుంచి శాంతికాముకంగా సాగిన సిక్కు మతోద్యమం ఈ ఘోర కలి కారణంగా మిలిటెన్సీ రూపం దాల్చింది. గురు హరగోవింద్‌సింగ్ నేతృత్వంలో ఆయుధాలు చేపట్టి పోరాట శక్తిగా ఎదిగింది. కానీ ఈ సందర్భంలో అహ్మద్ సిర్‌హిండి ఏమన్నాడో తెలుసా..? ‘గోయింద్వాల్ కాఫిర్‌ను హతమార్చడం మనం సాధించిన అతి గొప్ప విజయం. మన వ్యతిరేకులైన హిందువులకు గొప్ప ఓటమి.’ (మక్తూబాత్ లెటర్ 193) అని కొనియాడాడు.
Sirhindi’s deep-seated hatred of the non- Muslims can be best illustrated by his rejoicing at the execution in 1606 of Arjun, the fifth guru of the Sikhs.In a letter to Shaykh Farid Bukhari Sirhindi says: “These days the accursed infidel of Goindwal was very fortunately killed. It is a cause of great defeat for the reprobate Hindus. With whatever intention and purpose they are killed – the humiliation of infidels is for the Muslims life itself …” (dar in waqt kushtan-i kafir-i la*in-i goindwal bisvar khub waqi* shud waba*ith-i shikast-i *azim bar hunud-i mardud gasht bi-har nivvat kih kushtah bashand wa bi-har gharai halak kardah khwari-vi kuffar khwud naqd-i waqt-i ahl-i islam ast). Else where he says: ’’Whenever a Jew is killed, it is for the benefit of Islam” Liuhud har kih shawad kushtah sud-i islam ast)
(Shaykh Ahmad Sirhindi by Yohanan Friedmann, p.111)
జహంగీర్ తన ఆత్మకథ తజుక్‌లో కూడా గురు అర్జున్‌దేవ్‌జీ హత్యను రికార్డు చేశాడు. అతని ప్రాపర్టీని సీజ్ చేసినట్టు కూడా పేర్కొన్నాడు.
“In Gobindwal which is on the river Beas, there was a Hindu named Arjun, in the garments of sainthood and sanctity, so much so that he had captivated many of the hindus and even of the ignorant and foolish followers of Islam.. they called him guru and from all sides stupid people crowded to worship and manifest complete faith in him. For three or four generations they had kept this shop warm. Many times it had occurred to me to put a stop to this vain affair or to bring him into the assembly of the people of Islam.”
(tuzuki-i jahangiri rogers and beveridge vol 1.p72)
జహంగీర్ మతోన్మాదానికి కరడు గట్టిన మతోన్మాది అహ్మద్ సిర్‌హిండి తోడయ్యాడు. పంజాబ్‌లో సిక్కు మతం వేగంగా విస్తరిస్తుండటం అతనికి ఎంతమాత్రం ఇష్టం లేకుండాపోయింది. దీనికి తోడు.. జహంగీర్ తండ్రి అక్బర్ తనకు తానుగా ఏర్పాటు చేసిన కొత్త మతం దిన్ ఇలాహీని కూడా అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. అన్ని మతాల్లోని కొన్ని కొన్నింటిని ఏరికూర్చి కషాయంలా తయారుచేసి తానే కొత్త దేవుడిగా ప్రకటించుకొన్న అక్బర్ మతాన్ని ఇతను తిరస్కరించాడు. కేవలం షరియా మాత్రమే అనుసరణీయం.. ఇతర మత వ్యవస్థలు ఉండరాదని తీర్మానించాడు. తన అనుచరులను ఊరూరా పంపించి షరియా, సూఫీ సిద్ధాంతాలను కథలుగా ప్రచారం చేయించాడు. తాను రాసిన మక్తూబాత్ పుస్తకంలో పనికిమాలిన సిద్ధాంతాలను వల్లెవేసి.. అవి ప్రవక్త చెప్పినట్టుగా ప్రవచించాడు. అక్బర్ మతాన్ని తోసిరాజి.. మొఘల్ వంశాన్ని తిరిగి పూర్తి స్థాయిలో ఇస్లాంవైపు తిరిగి తీసుకొని వచ్చినవాడు సిర్‌హిండి. అక్బర్ తెచ్చిన కొత్తమతం అక్బర్‌తోనే మటుమాయమైపోయింది. యోహనాన్ ఫ్రీడ్‌మాన్ షేక్ అహ్మద్ సిర్‌హిండి గురించి ఒక విస్తారమైన గ్రంథాన్నే రాశాడు. భారతదేశంలో ఇస్లామిక్ కల్చర్ విసృ్తతమవడంలో సిర్‌హిండిది కీలక పాత్ర అని స్పష్టంగానే చెప్పాడు.
“Sirhindi follows up his utter rejection of the beliefs and practices of Hinduism by an equally out spoken attitude regarding the position of the Hindus in the Mughul empire. The honour of Islam demands the humiliation of the infidels and of their false religion. To achieve this objective, jizya should be mercilessly levied upon them, and they should be treated like dogs. Cows should be slaughtered to demonstrate the supremacy of Islam. The performance of this rite is, in India, the most important symbol of Islamic domination. One should refrain from dealing with the infidels unless absolutely necessary, and even then treat them with contempt Islam and infidelity are two irreconcilable opposites. One thrives upon the degradation of the 17 other.” (Shaykh Ahmad Sirhindi by Yohanan Friedmann, p.110)
హిందువుల మీద అత్యంత క్రూరంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చాడు. తమ మతం కానివారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం ఇస్లాంకు గౌరవమని పేర్కొన్నాడు. దుర్మార్గులైన అవిశ్వాసులను కత్తిపోట్లకు బలివ్వండని చెప్పాడు. అల్లా మీకు మేలు చేస్తాడని ప్రవచించాడు. తప్పుడు మతావలంబులపై ఎంతమాత్రం క్షమ లేకుండా జిజియా పన్ను విధించాలన్నాడు. వాళ్లకు కుక్కల మాదిరిగా చూడాలని చెప్పాడు. ఇస్లాం ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం గోవులను ఊచకోత కోయాలని పిలుపునిచ్చాడు. ఇది ముస్లింల హక్కు అని చెప్పుకొంటూ వచ్చాడు. అంతేకాదు.. ఇస్లాం ఆధిపత్యానికి అత్యంత ముఖ్యమైన ప్రతీకగా గోహత్యను నిర్వచించాడు. ఇంకాస్త ముందుకు వెళ్లి ఆహారం సంపాదించుకోవడం ప్రవక్తను అనుసరించే వాళ్ల హక్కు అని.. అందుకోసం వారు ఏమైనా చేయవచ్చన్నాడు. ‘ఇస్లాం కోసం తిరుగుబోతునయ్యాను, కాఫిర్లతో, హిందువులతో యుద్ధాలు చేశాను.. మృతవీరుణ్ణి కావాలనే నిశ్చయించుకొన్నాను.. ధన్యవాదం దేవా.. పవిత్ర యుద్ధ వీరుడినయ్యాను’ అని బాబర్ తన బాబర్ నామాలో రాసుకొన్న గీతం సిర్‌హిండీకి బాగా నచ్చినట్టుంది. ఈ మౌఢ్యాన్నే సిర్‌హిండీ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అనంతర వర్తమాన కాలంలో జిహాద్‌కు కూడా ఇలాంటివే రసాయనాలుగా మారాయి. తమ విలువైన సమయాన్ని ఇస్లాం ఆధిపత్యం కోసం వెచ్చించాలని సిర్‌హిండి పిలుపునిచ్చాడు. బహుదేవతారాధన అనే చీకట్లను తొలిగించి ఇస్లాం పతాకాన్ని సర్వత్రా ఎగురవేయాలని శాసించాడు. సిర్‌హిండిని నియంత్రించడానికి మొఘల్ రాజు జహంగీర్ కొంత ప్రయత్నించాడని చెప్తారు కానీ.. అది నిజం కాదు. సిర్‌హిండి ప్రభావం భారత్‌పై తీవ్రంగా చూపింది. దేశంలో ఉన్మాదం పెచ్చరిల్లడానికి సిర్‌హిండి మరింత ఆజ్యం పోశాడు. ఇతను నిర్వచించిన కాఫిర్లు అనబడే హిందువులపై దాడి హెచ్చుమీరింది. దారుణాలను తట్టుకోలేక మత మార్పిళ్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మతం విస్తరిస్తూ వచ్చింది. షరియా తప్ప మరేదీ అనుసరణీయం కాదన్న వాదన బలపడుతూ వచ్చింది. ఇది స్వాతంత్య్రం వచ్చేనాటికి రాజ్యాంగం కూడా వీరికి అవసరం లేకుండా పోయింది. చివరకు భారత పాలకవర్గమే షరియా అమలుకు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది.
(సశేషం)