దేశ విభజన విషవృక్షం-16

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]‘హిం[/dropcap]దుస్తాన్‌ అంత అందమైనదేం కాదు.. కానీ.. అందులో సుందరంగా కనిపించే అంశం ఏమిటంటే.., బంగారపు రాసులతోనూ, ధనంతోనూ తులతూగుతున్న దేశం.’ అని బాబర్‌ తన బాబర్‌నామాలో రాసుకొన్నాడు. మొఘలులు మూడు వందల ఏండ్లపాటు చేసింది ఈ దోపిడీయే. ఇక్కడ ఉండి ఇక్కడి మతాన్ని, నాగరికతను ధ్వంసం చేసి.. పర్షియన్‌ భాషను రాజభాషగా తప్పనిసరిగా ప్రజలను తమ మతంలోకి, భాషలోకి, సంస్కృతిలోకి మార్చారు. అందుకోసం హిందువులు అధికంగా విశ్వసించే.. విధేయంగా ఉండే దేవీదేవతల ఆనవాళ్లు నామరూపాలు లేకుండా నాశనం చేశారు. ఔరంగజేబు మనుమరాలు.. ‘సాఫిహా ఈ చాహల్‌ నసయ్యా బహదూర్‌ షాహీ’ అనే పుస్తకాన్ని 1707లో పర్షియా భాషలో రాసింది. ఈమె బహదూర్‌ షా ఆలంగీర్‌ కుమార్తె. తమ తండ్రులు, తాతలు చేసిన ఘనకార్యాలను ఈమె రికార్డు చేసింది. ఈ గ్రంథాన్ని లక్నోకు చెందిన మీర్జా జాన్‌ అనే రచయిత 1856లో హదీఖా ఇ షహాదా అనే గ్రంథంలో ఔరంగజేబు మనవరాలు రాసిన పర్షియన్‌ రాతప్రతిని పునర్లిఖించాడు. ఆయన గ్రంథంలోని 47 పేజీలలో రాసిన విషయాన్ని చదవండి.

“..the mosques built on the basis of the king’s orders (ba farman-i Badshahi) have not been exempted from the offering of the namaz and the reading of the Khutba [therein]. The places of worship of the Hindus situated at Mathura, Banaras and Awadh, etc., in which the Hindus (kufar) have great faith – the place of the birthplace of Kanhaiya, the place of Rasoi Sita, the place of Hanuman, who, according to the Hindus, was seated by Ram Chandra over there after the conquest of Lanka – were all demolished for the strength of Islam, and at all these places mosques have been constructed. These mosques have not been exempted from juma and jamiat (Friday prayers). Rather it is obligatory that no idol worship should be performed over there and the sound of the conch shell should not reach the ear of the Muslims …”

‘రాజుగారి ఆదేశాల ప్రకారం మసీదుల నిర్మాణం జరిగింది. నమాజు చేసుకోవడానికి ఎలాంటి మినహాయింపు లేదు. హిందువులు పవిత్రంగా పూజించే మధుర, బనారస్‌, అవధ్‌ (అయోధ్య) తదితర ప్రాంతాల్లో.. కన్హయ్య (కృష్ణుడు) పుట్టిన ప్రాంతం, రసోయీ సీత (సీత వంటగది), హనుమాన్‌ కొలువైన ప్రాంతం, లంకను జయించిన తరువాత రామచంద్రుడు ఎక్కడైతే కూర్చున్నాడో.. ఆ ప్రాంతాన్ని.. ఇస్లాం మతాన్ని బలోపేతం చేయడానికి ధ్వంసం చేశారు. అన్ని చోట్లా మసీదులు నిర్మించారు. ఈ మసీదుల్లో శుక్రవారపు పూజలను కూడా మినహాయించలేదు. తప్పనిసరి చేయబడింది. విగ్రహారాధన చేయడం నిషేధించబడింది. ముస్లింల చెవుల్లో శంఖనాదం ఎట్టి పరిస్థితుల్లోనూ వినిపించకూడదు’ అని ఔరంగజేబు మనవరాలు రాసింది.

అంతేకాదు.. ఇంకాస్త ముందుకెళ్లి.. “ఇస్లాం విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ముస్లిం పరిపాలకులందరూ.. విగ్రహారాధకులను ఇస్లాంకు విధేయులుగా మార్చేయాలి. ఇందుకోసం జిజియా పన్ను వసూలు చేయడంలో ఎంతమాత్రం వెసులుబాటు ఇవ్వరాదు. ఈద్‌ రోజుల్లో కూడా ప్రార్థనలు జరిగేంతవరకు హిందువులు మసీదుల వెలుపల వేచి ఉండాలి. ఇందులో కూడా ఎలాంటి వెసులుబాటు ఇవ్వకూడదు. మధుర, బనారస్‌, అవధ్‌(అయోధ్య) లలో నిర్మించిన మసీదులను సామూహిక ప్రార్థనలకు వినియోగించాలి…” ఇదీ ఆమె రాసింది.

అవధ్‌ అంటే అయోధ్యలో ఏ బాబ్రీ మసీదు కట్టడం పైనైతే వందేండ్లకు పైగా కేసు నడిచిందో.. ఏ బాబ్రీ మసీదు స్థానంలో అంతకుముందు ఎలాంటి గుడి లేదని వాదించారో.. ఆ గుడికి.. దానిపైన కట్టిన మసీదు నిర్మాణానికి ఈ మొఘల్‌ యువరాణి రికార్డు చేసిన చరిత్రే తార్కాణం. మొఘలులు ఎవరూ మనుష్యుల ప్రేమికులు కారు. మనుషులను చిత్రహింసలు పెట్టి చంపడం వారి సరదా.. బాబర్‌ నుంచి ఔరంగజేబు దాకా ఇదే తంతు.. ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడు. ఇక ఆడవాళ్లయితే వాళ్లకు జస్ట్‌ ఆట బొమ్మలే. అక్బర్‌ రాజ్‌మహల్‌ ముందు మీనాబజార్‌ అనే సంత శుక్రవారం జరుగుతుండేది. అక్కడికి పురుషులు రావడం నిషేధం. మహిళలు రకరకాల షాపులు ఏర్పాటుచేసుకొని.. మహిళలే షాపింగ్‌ చేసేవారు. ఈ మీనాబజార్‌ మొఘల్‌ రాజుల కామకేళికి వనరుగా మారింది. అక్బర్‌ మహిళ వేషం వేసుకొని వెళ్లి.. మీనా బజార్‌ అంతా కలియతిరిగి నచ్చిన మహిళలను ఎంచుకొని.. అనుచరులకు చెప్పి వెళ్లేవాడు. రాత్రికల్లా ఆ మహిళలు రాజుగారి పడకగదికి చేరాల్సిందే. ఆయనగారి కుమారుడు.. జహంగీర్‌, ఆయనగారి కుమారుడు షాజహాన్‌ ఈ ముసుగు కూడా లేకుండా నేరుగా మీనాబజార్‌కు వెళ్లి అక్కడి ఆడవాళ్లను ఎంచుకొని వచ్చేవారు. అక్కడ ఉండే స్త్రీలు సామాన్యులు కారు. కులీనులు, రాజపుత్ర స్త్రీలు. రాజుగారు కోరటమే తరువాయి.. వెళ్లి వారి కోరిక తీర్చాల్సిందే. సంతృప్తి కలిగే దాకా తీర్చాల్సిందే. ఎప్పటికీ తీరకపోతే.. అంతఃపురంలో బానిసగా పడి ఉండాల్సిందే. ఈ మొఘలు రాజులంతా ఎంత నీచులంటే.. ఏ తాజ్‌మహల్‌ కట్టాడని మనం షాజహాన్‌ను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నామో.. ఆ షాజహాన్‌ తన పెద్ద కూతురు బేగం సాహెబాను విపరీతంగా ప్రేమించడం కాదు.. కామించాడు. ఇదేమని అడిగితే.. రాజుగారి దర్బారులో ఉన్న న్యాయాధిపతులు.. విత్తనం వేసి చెట్టు పెట్టినవాడికి దాని ఫలాన్ని అనుభవించే అధికారం ఎప్పటికీ ఉంటుందని సెలవిచ్చారు. ఫ్రాంకోయిస్‌ బెర్నియర్‌ అనే విదేశీ యాత్రికుడు ట్రావెల్స్‌ ఇన్‌ ది మొఘల్‌ ఎంపైర్‌ అన్న పేరుతో రాసిన గ్రంథంలోని 11వ పేజీలో మాటే ఇది. ఈ షాజహానే.. ఏ అర్జుమంద్‌ బాను బేగం అలియాస్‌ ముంతాజ్‌ను ఆమెకు 18 ఏండ్ల వయసులోనే పెండ్లిచేసుకొని 19 ఏండ్లు కాపురం చేసి.. 14 మంది పిల్లలను కని.. (అంటే దాదాపు ఏడాదికో బిడ్డ అన్నమాట) 40 ఏండ్లలోపే చనిపోవడానికి కారకుడైన అనురాగ మూర్తి. అనంతమైన ప్రేమికుడు. ఇతడు ఎంత మదపిచ్చి ఉన్నవాడంటే.. మొఘల్‌ దర్బారులో ఉన్నవాళ్లు కూడా ఏమిట్రా వీడు.. అని గుసగుసలు పెట్టుకొన్నారుట. ఎవరో ఒకరు ధైర్యంచేసి.. ఏమయ్యా.. మరీ అందంగా లేని.. మామూలుగా ఉన్న వాళ్లనూ ఎందుకు వదిలిపెట్టడం లేదు అని అడిగితే.. మిఠాయి అన్నది ఏ కొట్టు నుంచి తెచ్చినా తియ్యగానే ఉంటుంది అని అన్నాడట. ఈ మాట షాజహాన్‌ ఆస్థానంలోనే ఉన్న మాన్యుయీల్‌ రాశాడు. ఇంత దారుణమైన, నీచుడైన వ్యక్తిని ప్రపంచంలోనే గొప్ప ప్రేమికుడిగా తెలిసి తెలిసీ ఎలా చెప్పుకోగలుగుతున్నాం.. ఇది మన దేశంలో మాత్రమే సాధ్యమైన చరిత్ర. మనం మాత్రమే.. నిస్సిగ్గుగా ప్రచారం చేసుకొనే చరిత్ర.

భారత దేశానికి, ప్రపంచ ఇతర దేశాలకు.. ఘజ్‌నీ వాదులు తీసుకొచ్చినది ఏమిటంటే ఒక కొత్తతరహా యుద్ధనీతి. దానిపేరు జిహాద్‌. అంటే.. కేవలం ఒక దేశాన్ని గెలవడం కాదు.. ఆ దేశంలోని చరిత్రను, నాగరికతను సర్వనాశనం చేయడం. అంతర్గతంగా, బహిరంగంగా ఉండే అనేక రంగాల్లో, రాజకీయ, దౌత్య రంగాల్లో తాత్త్విక, మనోవైజ్ఞానిక, ఆర్థిక మిలటరీ రంగాల్లో శత్రువును పట్టు కోల్పోయేలా చేయడం. అన్ని రంగాలను సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం. ఇదీ ఈ కొత్త తరహా యుద్ధం నిర్వచనం. ‘జిహాద్‌ అంటే.. సైనికులు సైనికులతో పోరాడటమే కాదు.. పిల్లలు, మహిళలు, సామాన్యులపై కూడా తెగబడటం. శత్రువును భయభ్రాంతుడిని చేయడం మన లక్ష్యం కావాలి. ఆ భయంతో శత్రువు నిర్ణయాన్ని తీసుకొనేలా చేయడం కాదు.. మన నిర్ణయాన్నే శత్రువు తీసుకొనేలా చేసేంతగా భయం సృష్టించాలి’ పాకిస్తానీ మాజీ పాలకుడు జనరల్‌ జియాఉల్‌హక్‌.. స్పాన్సర్‌ చేసిన ‘ది ఖురానిక్‌ కాన్సెప్ట్‌ ఆఫ్‌ వార్‌’ పుస్తకంలోని మాటలివి. మంగోలులు.. వారి వారసులు ఈ దేశంపైనే కాదు.. వారు కాలుమోపిన ప్రతిచోటా ఇదే చేశారు. ఇరాన్‌ (పర్షియా), ఈజిప్టు లలో వేల సంవత్సరాల క్రితం కొనసాగిన గొప్ప గొప్ప నాగరికతలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో మూలాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు తాలిబన్లతో శ్మశానం తప్ప మిగిలిందేమీ లేదు. మొఘలుల సామ్రాజ్యంలో పరిపాలన మొత్తం ఇంతే అరాచకంగా, భయంకరంగా సాగింది. (ఎన్‌ఎస్‌ రాజారాం డిస్టార్షన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ నుంచి).

సిక్కులు, రాజపుత్రులు ఒక్కరొక్కరుగా నేలకొరుగుతున్న క్రమంలో దేశంలో ఇస్లాం విస్తరించడం మొదలైంది. ఒకవైపు అష్టవర్షాత్‌ భవేత్‌ కన్య అన్న సూత్రాన్ని తీసుకొచ్చి.. హిందువులు తమ పిల్లలకు చిన్న వయసులోనే పెండ్లిళ్లు చేయడం మొదలుపెట్టారు. పెండ్లిళ్లు చేసి పరదా చాటున ఉంచడం ప్రారంభించారు. మహిళలను రక్షించుకోవడానికి మరోమార్గం లేకుండా పోయింది. హిందూరాజులు బలహీనమవుతున్న కొద్దీ.. తప్పనిసరిగా మతమార్పిళ్లు వేగం పుంజుకున్నాయి. రాజులు ముస్లిం మహిళలను వివాహం చేసుకోవడం ప్రారంభించారు. హిందూ మహిళలు ముస్లిం రాజులను, రాజపుత్రులను వివాహం చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని వివరాలు చూడండి..

రాజా మాన్‌ సింగ్‌ అక్బర్‌ మేనకోడలు.. ఆదంఖాన్‌ కూతరును పెండ్లి చేసుకొన్నాడు. ఆమెపేరు ముబారక్‌

ఛత్రసాల్‌ బుండేలా.. రుహానీ బేగం

గజ్‌నీ సలీం.. బప్పారావల్‌ కూతురు

ధరమ్‌ చంద్‌ (కటోచు రాజ్‌పుత్‌).. బాబర్‌ కూతురు

మాన్‌సింగ్‌ కొడుకు జగత్‌సింగ్‌.. కుతుబ్‌ఖాన్‌ కూతురు మర్యమ్‌

గజ్‌సింగ్‌.. అనారాబాయ్‌ బేగం

ఆజమ్‌గఢ్‌ రాజు విక్రమ్‌జిత్‌ సింగ్‌.. ముస్లిం మహిళ (పేరు తెలియదు)

రాణా ఉదయ్‌ సింగ్‌ .. లాలాబాయ్‌ బేగం

హన్వంత్‌సింగ్‌ రాథోడ్‌.. జుబేదా బేగం

ఇట్లా చెప్పుకొంటూ పోతే.. చాలా చాలా పెద్ద జాబితా వస్తుంది.

భారత దేశ సామాజిక పరిణామ చరిత్రలో ఇది పెను మార్పును తీసుకొని వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ అప్పటికే దాదాపు ముస్లిం మెజార్టీ ప్రాంతాలుగా మారాయి. కాశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌ తదితర ప్రాంతాలన్నీ కూడా ముస్లిం డామినేషన్‌ పెరిగింది. క్రమంగా ఇక్కడ మతం మారినవారు తమ మూలాలను మరిచిపోవడం మొదలైంది. మొఘల్‌ రాజు చెప్పిందో.. లేక ఖలీఫా చెప్పిందో వినడం తప్ప.. ఆ మత గ్రంథంలో రాసింది తు.చ. తప్పకుండా పాటించడం తప్ప.. భారతదేశంలో అప్పటివరకు సర్వమానవ సౌభ్రాతృత్వం విలసిల్లిన భారతదేశంలో మత ఛాందసవాదం పెచ్చరిల్లింది. ఇస్లాంను అనుసరించేవారు.. ఇతర మతాలను ఆచరించేవారితో సఖ్యంగా ఉండకూడదు. వారి ఇండ్లలో జరిగే శుభాశుభ కార్యాలకు వెళ్లరాదు. ఊరేగింపుల్లో పాల్గొనరాదు. మొఘలులు.. సూఫీ సిద్ధాంతకర్త అహ్మద్‌ సిర్‌హిండి లాంటి వారి మార్గదర్శనంలో అమలుచేసిన కఠిన నిబంధనలు. ఈ రకమైన ఆంక్షలు.. దీర్ఘకాలంలో భారతదేశ సామాజిక జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ముస్లిమేతరుల ప్రభావం ఏ మాత్రం పడినా.. ముస్లింలు.. మళ్లీ చేజారిపోతారని.. సిర్‌హిండి ముందే హెచ్చరించాడు. అందువల్లే ఎటువంటి ప్రభావాలకు లోనుకాకుండా ఉండేందుకే ఇలాంటి ఆంక్షలు విధించారు. ముస్లింలు ఈ దేశంలో తమ మూలాలను పూర్తిగా మరచిపోసాగారు. తాము తమకు ముందు తరము మతం మారామన్న విషయాన్ని మరచి.. పవిత్రగ్రంథం తప్ప మరేదీ తమకు జీవితంలో లేనే లేదనే దశకు చేరుకొన్నారు. ఇది దేశంలో సామాజిక ఐక్యతను దారుణంగా విచ్ఛిన్నం చేసింది. ముస్లింలు తమను తాము ప్రత్యేక వర్గంగా భావించసాగారు.

ఇంతెందుకు.. మొన్నటికి మొన్న (2022) గుజరాత్‌లో ఒక టీవీ చానల్‌ వారు.. ముస్లిం పిల్లలను ప్రశ్నిస్తుంటే.. వాళ్లకు టీవీ అంటే ఏమిటో తెలియదంట. తాము టీవీ కానీ, సినిమాలు కానీ చూడం అని అమాయకంగా చెప్తున్న వీడియో వైరల్‌గా మారింది. టీవీ ఎందుకు చూడరు అని అడిగితే దేవుడి పేరు చెప్తారు. ఈ మాట ఎవరు చెప్పారని ప్రశ్నిస్తే.. మౌల్వీ సాహబ్‌ చెప్పారని అంటారు. అమాయకమైన పిల్లలకు నేటి మదరసాల్లో బోధిస్తున్న విద్యాబోధన ఇది. వారికి ఆధునిక విద్య అందదు. గణితం, సైన్స్‌ తెలియవు. జీవితమంతా మతమౌఢ్యంలోనే జీవిస్తుంటారు. వ్యక్తిత్వ వికాసమన్నదే వారికి లేకుండా చేస్తున్నారు. ఉపాధి ఉండదు. టెక్నాలజీకి దూరంగా ఉండిపోతారు. ఇతరులతో కలవరు. ఫలితం.. ఎప్పటికీ కూడా వారు కూపస్థ మండూకాల్లాగానే ఉండిపోతారు. హిందూ ధర్మంపై అంతెత్తున ఎగిరిపడే ఈ దేశంలోని ఎలీట్‌ చరిత్రకారులు.. ఇలాంటి వాటిపై పెదవి కూడా విప్పరెందుకో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here