(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]ఔ[/dropcap]రంగజేబు సూఫీ తత్త్వాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. దాన్ని బాగా వంటబట్టించుకున్నాడు. ఆ తాత్త్వికతను తు.చ. తప్పకుండా అమలు చేశాడు.. ఇవీ మన చరిత్ర పాఠాలు చెప్తున్న సంగతులు. ఏమిటీ సూఫీ..? సూఫీ తాత్త్వికత అంటే ఏమిటి? సూఫీ గురించి మనకు పలు రకాలైన నిర్వచనాలు కనిపిస్తాయి. వినిపిస్తాయి.
- మొదటి ప్రచారం – సూఫీ చాలా సహనశీలత కలిగిన సిద్ధాంతం. ఇస్లాంలోని శాంతి కాముకత పార్శ్వమే సూఫీ.
- రెండో ప్రచారం – భారతదేశంలోని హిందూ తాత్త్వికత.. ఇస్లాంపై చూపించిన ప్రభావం నుంచి సూఫీ అభివృద్ధి చెందింది.
- మూడో ప్రచారం – హిందూ ముస్లింల మధ్య ప్రేమానురాగాలు, సామరస్యం, సుహృద్భావం, సౌభ్రాతృత్వాన్ని పెరిగేందుకు సూఫీ ఎంతో కృషి చేసింది.
- నాలుగో ప్రచారం – క్రైస్తవ మిషనరీల మాదిరిగానే.. ఇస్లాంను శాంతియుతంగా ప్రచారం చేసుకోవడానికి సూఫీలు భారతదేశానికి వచ్చారు.
సూఫీ సిద్ధాంతాన్ని పాపులరైజ్ చేయడంలో మన హిందీ సినిమా పరిశ్రమది సింహభాగం. సూఫీ సంగీతం, కవిత్వం మాత్రమే కాకుండా సూఫీలు ఎంత శాంతి కాముకతతో ఉంటారో వేషం కట్టి స్థిరీకరించడంలో హిందీ సినిమా చేసిన కృషి సామాన్యమైందేమీ కాదు. సూఫీలు.. శాంతికి చిహ్నంగా భావించే తెల్లని వస్త్రాలు ధరించి.. తెల్లని గడ్డం పెంచుకొని.. తెల్లని తలపాగా చుట్టుకొని.. చేతిలో జపమాల పెట్టుకొని.. నిరంతరం జపం చేస్తూ కనిపించే వ్యక్తులుగా హిందీ సినిమా వారిని ప్రచారం చేస్తూ వచ్చింది. ఔరంగజేబ్ సూఫీ తత్వం గురించి తెలుసుకునే ముందు సూఫీ ఆవిష్కారానికి మూలం ఎక్కడి నుంచి జరిగిందో ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
- Allah gave the message through the prophet that Islam is the comprehensive, completed religion for all mankind, and it is duty of every muslim to perform jihad till the whole world accepts it. (holy quran 2:193)
- “Lo! Allah hath bought from the believers their lives and their wealth because the garden will be theirs: they shall fight in the way of Allah and shall slay and be slain..” (holy quron 9:111)
- “Say: if your fathers, and your sons, and your brethren, and your wives, and your tribe, and the wealth ye have acquired, and merchandise for which ye fear that there will no sale, and dwellings ye desire are dearer to you than Allah and his messenger and striving in his way: then wait till Allah bringeth his command to pass. Allah guideth not wrong doing folk” (holy quron 9:24)
ఇస్లాం అనేది అల్లా ఆదేశానుసారం మహమ్మద్ ప్రవక్త ద్వారా స్థాపించబడింది. యావత్ ప్రపంచంలో ఇస్లాం మాత్రమే మతంగా చేయడం కోసం ప్రార్థన, ఉపవాసం, జిహాద్ అనే మూడు మార్గాల ద్వారా ప్రవక్తకు ఆయన అనుచరులు తమ విధేయతను ప్రకటించారు. ప్రవక్త మక్కా నుంచి మదీనాకు చేరుకున్న తరువాత ముస్లిమేతరులపై హింసాత్మక జిహాద్ ద్వారా విరుచుకుపడి.. ఒక్కో దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు. సౌదీ నుంచి ప్రారంభమైన ఈ జిహాద్.. వెయ్యేండ్ల పాటు భారత్‌ను ఛిన్నాభిన్నం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. ఈ మూడు మార్గాల్లో ప్రార్థన, ఉపవాసాలకు ప్రాధాన్యం తగ్గి.. మత విస్తరణ కోసం కేవలం జిహాద్‌కు అతి ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. జిహాద్‌ను పవిత్ర యుద్ధంగా అభివర్ణించారు. ఈ పవిత్ర యుద్ధంలో త్యాగం అత్యంత ప్రధానమైంది. కుటుంబాన్ని, స్నేహితులను, సమాజంలోని అన్ని బంధాలను త్యాగం చేసి జిహాద్‌లో పాల్గొన్న వారు నేరుగా ‘జన్నత్’ (ఇస్లాంకు సంబంధించిన స్వర్గం) కు చేరుకుంటారని విపరీతంగా మెదళ్లలోకి ఎక్కించారు. రాను రాను ఇది ఛాందసంగా మారిపోయింది. ఇవాళ హిందూ మతాన్ని సముద్ధరిస్తామని నోటికొచ్చినట్టల్లా వాగే మేధావులు.. ఈ ఛాందసాన్ని గురించి మాట్లాడే సాహసం కూడా చేయరు.
భారతదేశంపైనా ఇదే తరహా జిహాదీ దాడి జరిగింది. కానీ వాళ్లు కోరుకున్న సంపూర్ణ ఇస్లామీకరణ జరుగనే లేదు. ఈ పరిణామ క్రమంలోనే మనం ఇవాళ వాయవ్య భారతాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాం. మనం పోగొట్టుకునే నాటికి ఈ వాయవ్య భారతంలో కూడా పూర్తిగా ఇస్లామీకరణ జరుగలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే.. వాయవ్య భారతాన్ని భారతీయ నేతల అసమర్థత కారణంగా బ్రిటిష్ వాడు విభజించిన తరువాతే.. మహమ్మద్ బిన్ ఖాసిం నుంచి ఔరంగజేబ్ దాకా ఎలాగైతే సామూహిక మానవ హననం చేశారో.. అదే పద్ధతిలో మహా మానవ మారణ హోమం చేసి వాయవ్య భారతాన్ని ఇస్లామీకరించారు. విభజన సమయంలో జరిగిన మారణకాండ గురించి చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు మన చరిత్రకారులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మాత్రం హిందువులు, సిక్కులు మాత్రమే దారుణాలు చేశారని చెప్పుకొస్తారు. సరే.. దీని గురించి ముందు ముందు లోతుగా చర్చించుకోవచ్చు.
ఈ రకమైన మతోన్మాద, యుద్ధోన్మాద ఇస్లాం నుంచి ఒక పాయగా సూఫీయిజం పుట్టుకొచ్చింది. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ఇస్లాం ఆవిర్భావానికి ముందు కాలాన్ని జహిలియా లేదా అజ్ఞాన యుగం లేదా సంస్కృతి లేని కాలం అని పిలుస్తారు. అబ్బాసిడ్ ఖలీఫాగా ఉన్న కాలంలో పర్షియన్ సంస్కృతి ప్రభావం పెరగడంతో ఇస్లాంపై అరబ్ ప్రభావం కొంతమేర క్షీణించడం ప్రారంభించింది. ఈ కాలంలో హిందూ, గ్రీకు తత్వవేత్తలు, శాస్త్రవేత్తల నుంచి జ్ఞానం సంపాదించాలని ఆకాంక్ష ఇస్లాంలో కొంత వచ్చినప్పటికీ.. అందంతా అజ్ఞాన యుగానికి చెందిన జ్ఞానమంటూ సూఫీ దాని విస్తరణకు అడ్డుగా నిలిచింది. ఇస్లాం బోధనలు, సూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఎలాంటి జ్ఞానాన్ని అది అంగీకరించలేదు.
మరోవైపు ఇస్లాం విస్తరణ కాంక్ష విశృంఖలంగా పెరిగిపోయింది. కాలక్రమంలో విస్తరణ యుద్ధాలు తీవ్రమయ్యాయి. ఒక్కో దేశం తమ వశమవుతుండటంతో ఇస్లాం మతంలోని మూలాలలో సంస్కరణలు తీసుకొని రావడమూ, మూలాలను మార్చడమన్న అవసరం ఇక లేదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఇస్లాంలో సంస్కరణ పూర్తిగా ఆగిపోయింది. ఒక దేశం తరువాత ఒక దేశాన్ని జయించుకుంటూ వచ్చారు. ఒక దేశాన్ని జయించిన తరువాత ప్రధాన సైనిక బలం తిరిగి స్వదేశానికి వెళ్లినప్పటికీ.. మత సైన్యం.. (మతం కోసం మాత్రమే పనిచేసే సైన్యం..) మాత్రం కొత్తగా ఆక్రమించుకున్న దేశ సరిహద్దుల్లో రిబాట్స్ అనే చిన్న చిన్న కోటలు లేదా శిబిరాలు నిర్మించుకొని బయటి ప్రపంచానికి దూరంగా, ఏకాంతంగా ఉండేవారు. ఎందుకంటే వారు కరడుకట్టిన ఇస్లామిక్ సైనికులుగానే ఉండాలి. వారికి అలాగే శిక్షణ ఇస్తారు. వీరిని ఘాజీలు అని పిలిచేవారు. వీళ్లు సరిహద్దుల్లోనే ఉంచడానికి ప్రధాన కారణం కూడా జిహాదే. వారిని నిరంతరం జిహాద్‌కు సంసిద్ధంగా ఉంచడం కోసమే సరిహద్దుల్లో ఉంచేవారు. కుటుంబాలు, స్నేహితుల గురించి వారికి ఎంతమాత్రం ఆలోచన రాకూడదు. ఖలీఫా నుంచి ఆదేశం రాగానే పక్కన ఉన్న దేశంపై విరుచుకుపడతారు. వీళ్ల లక్ష్యం దేశాన్ని ఆక్రమించుకోవడం కాదు. అందుకోసం ప్రధానమైన సైనిక దళాలు వస్తాయి. వీరి లక్ష్యం.. ప్రజలపై విరుచుకుపడి భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి అప్పటివరకు అనుసరిస్తున్న మతాచారాలను ధ్వంసం చేసి ఇస్లాంను స్థాపించడమే లక్ష్యంగా ఈ ఘాజీలు పనిచేస్తారు. రోజులు గడిచిన కొద్దీ సరిహద్దుల్లోని రిబాట్లలో జిహాద్ కోసం వేచి ఉండే కాలం కూడా బాగా పెరిగిపోయింది. పని ఏమీ చేయలేకపోవడంతో నెమ్మదిగా హింసాత్మక ధోరణి నుంచి బౌద్ధ సన్యాసుల మాదిరిగా మారిపోవడం మొదలైంది. క్రమంగా అల్లాపై వారి విశ్వాసం అహింసామార్గాలలో వ్యక్తమవటం మొదలైంది. ఈ రిబాట్ల నుంచి ఇస్లాంలో సన్యాసం వైపు మొగ్గు చూపే వారి తెగ ఒకటి పుట్టుకొచ్చింది. రిబాట్లలో ఏకాంతంగా ఉన్నవారే సూఫీలుగా ప్రసిద్ధి చెందారు. ప్రఖ్యాత చరిత్రకారుడు ఉమ్రుద్దీన్ చెప్పిన ప్రకారం తొలి దశలో సూఫీయిజం, ఇస్లాం మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండేది. కాకపోతే జిహాద్‌కు వీరు కొత్త నిర్వచనం చెప్పనారంభించారు. ప్రాపంచిక ఆనందాలు, కోరికలకు వ్యతిరేకంగా, అంతర్గత తాత్విక పోరాటంగా జిహాద్‌ను అర్థం చేసుకోవాలని ప్రతిపాదించారు. హింసాత్మక పోరాటం ద్వారా ఇస్లామీకరణ నుంచి మరో మార్గంలో ఇస్లామీకరణకు కొత్త దారులు పరిచారు. విలాసవంతమైన జీవనాన్ని పూర్తిగా తిరస్కరించడం, ఒంటరిగా జీవించడం, తాత్త్వికతలో ముందుకు పోవడానికి అడ్డుపడే ప్రతి విషయానికీ దూరంగా ఉండాలని సూఫీలు నిర్ణయించుకున్నారు. ఇస్లాంలో కేవలం ఆచారాలు కాకుండా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాలని.. సహజమైన ఇస్లాంలో నూతన మార్గాన్ని ఆత్మజ్ఞానం ద్వారా అహంకారాన్ని నిర్మూలించుకొని మోక్ష మార్గంలో పయనించాలని.. సూఫీయిజం తన సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది. హిందూ మతంలోని అద్వైత తాత్త్వికతకు ఇది ఎంతమాత్రం వేరు కాదు. కాకపోతే.. శాంతియుత సహజీవనం అన్నది ఇస్లాం ఆలోచనా వ్యవస్థకు సాధ్యం కాలేదు. మన దేశంలో చార్వాకులు, పూర్ణ కశ్యప్‌లు, మఖాళీ గోశాల వంటి వేదకాలం నాటి తాత్త్విక ధోరణులు అనేకం ఉన్నాయి. అవి ఇతర తాత్త్విక సిద్ధాంతాలతో సమానంగా, సమాంతరంగా ముందుకు సాగుతూ వచ్చాయి. అందువల్లనే ఇవాళ దేవుడు లేడనే వాడు.. దేవుడిని చూపించాలని అడుగగలుగుతున్నాడు. కానీ ఇది ఇస్లాంలో పూర్తిగా సాధ్యం కాలేదు.
కొంతకాలానికి సూఫీ ఇమామ్ ఘజాలీ.. సూఫీయిజాన్ని ఇస్లాం ప్రధాన స్రవంతిలోకి తిరిగి తీసుకొని వచ్చారు. దాని ఆమోదాన్ని చాలా వరకు పునరుద్ధరించారు. కొన్ని ఆచార వ్యవహారాలను మినహాయిస్తే.. సంప్రదాయ ఇస్లాం నుంచి దూరం పోకుండా సూఫీయిజానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఘజాలీ రూపొందించిన సూఫీయిజం ప్రకారం సూఫీలు ప్రవక్త చెప్పిన మార్గాన్ని తు.చ తప్పకుండా అనుసరించాలి. ప్రవక్త కొన్ని రోజులు ధ్యానం చేయడానికి హిరా పర్వతం లోకి అప్పుడప్పుడు వెళ్లినట్టే, సూఫీలు కూడా తమను తాము వేరు చేసుకొని మెడిటేషన్లో ఒంటరిగా గడపాలి. మెడిటేషన్ లోకి వెళ్లినప్పుడు ప్రవక్త ట్రాన్స్ లోకి వెళ్లినట్టే సూఫీలు కూడా ఆత్మానుభవాన్ని పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇట్లాంటి ఒకటి రెండు ఆచారాలను మినహాయిస్తే.. మిగతా మొత్తం ఇస్లాం లోని మూల సూత్రాలను సంపూర్ణంగా అనుసరించేలా సూఫీయిజాన్ని ప్రతిపాదించాడు. దీంతో ఇస్లాంలోని ప్రాపంచిక ఆచారాల కంటే పైకి ఎదగటం ద్వారా తొలి దశలో మేధోపరమైన పురోగతిని సాధించిన సూఫీయిజం.. కొన్ని ఆచారాలు, సంప్రదాయాలను ప్రత్యేకంగా పాటిస్తూనే ప్రాచీన ఇస్లాం వైపు తిరిగి వెళ్లిపోయింది. క్రమంగా ముస్లిం ప్రపంచం ఈ రూపంలోని సూఫీ వాదాన్ని అంగీకరించింది. ఇస్లాంలోని రెండు పార్శ్వాలు.. అనుసరణీయం కావడంతో ఎవరికీ అభ్యంతరం కాలేదు. ప్రాచీన ఇస్లాంకు తోడుగా కొన్ని ఆచారాలు మాత్రమే చేరడంతో ఆమోదానికి, అనుసరించడానికి అడ్డంకులు రాలేదు. 1206 సంవత్సరంలో ముస్లింలు భారతదేశంలో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఘజాలీ ప్రతిపాదించిన సూఫీయిజమే ముస్లిం ప్రపంచంలో బాగా విస్తరించింది. ఈ సమయంలో జరిగిన ఇస్లామిక్ దండయాత్రల నేపథ్యంలో సూఫీలు పెద్ద ఎత్తున భారతదేశంలోకి ప్రవేశించడం మొదలైంది. తమకు తాము సూఫీ అని వేసుకున్న మాస్క్‌తో దేశంలోకి ప్రవేశించిన వారు.. ఈ దేశంలో జరుగుతున్న హింసను, దేవాలయాల ధ్వంసాన్ని, వేలమంది అమాయకుల ఊచకోతను మహిళలపై అత్యాచారాలను పూర్తిగా సమర్థించారు. హిందువులపై జిజియా పన్ను విధించడాన్ని ఆహ్వానించారు. నిజంగా వారు అహింసా మార్గం ఎంచుకొని ఉన్నవారైతే.. ఒక్కరు కూడా చొరబాటుదారుల మారణకాండను వేలెత్తి చూపనే లేదు. పైగా ఈ దోపిడీలలో వారూ పాలుపంచుకున్నారు. బలవంతపు మతమార్పిళ్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇస్లామీకరణ చేయడం.. ఇందుకోసం ఎంతకైనా తెగించడం తమ హక్కుగా వ్యవహరించారు. నిజాముద్దీన్ ఔల్యా, మొయినుద్దీన్ చిష్టీ వంటి వారు జిహాద్ లో పాల్గొనే ఉద్దేశంతోనే భారతదేశానికి వచ్చారు. వారి లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నారు. అమీర్ ఖుస్రూ, నసీరుద్దీన్ చిరాగ్ లేదా జలావుద్దీన్ వంటి సాదువులు చాలా మంది మతోన్మాదులు, తీవ్రమైన అసహనవాదులే. సూఫీలు సున్నీ స్కూల్ చిష్టి, నక్షాబందీ, సుహ్రావర్దీ, ఖాద్రీ షియా స్కూల్, నూర్ బక్షియాకు చెందినవారు. వీరంతా జిహాద్కు కరడుకట్టిన మద్దతుదారులు. మతపరమైన సిద్ధాంతాలను కచ్చితంగా గౌరవించి తీరాలని.. తాము చెప్పినవన్నీ తప్పనిసరిగా ఆచరించాలని ప్రబోధించినవారే. అలీ అల్ హుజ్విరి అనే సూఫీ.. కష్ఫ్ అల్ మహజిబ్ అనే గ్రంథాన్ని సూఫీయిజం మీద రాశాడు. ఇది సూఫీయిజానికి గ్రామర్‌గా చాలామంది భావిస్తారు. సూఫీలంతా దీన్ని అనుసరిస్తారు కూడా. అందులో హుజ్విరి స్పష్టంగా పేర్కొన్నాడు.
‘THAT THERE IS NO GOD BUT ALLAH IS THE ULTIMATE TRUTH, AND THE WORDS OF HIS PROPHET MUHAMMAD PAIGAMBAR IS THE UNCHANGEABLE LAW’
11 వ శతాబ్దంలో సూపీ ప్రవర్తకుడు అల్ ఖుష్హరీ ఏం చెప్పాడో చూడండి.. సూఫీ సిద్ధాంతమైన హకీకా.. షరియాల మధ్య ఏమీ తేడా లేదని..
అందుకే నక్షాబందీ నుంచి వచ్చిన మహమ్మల్ సర్హండి.. షరియాను భారతదేశంలో తీవ్రంగా అమలుచేశాడు. ఔరంగజేబ్ కాలంలో ఇది పరాకాష్టకు చేరింది. మతం అనే మహమ్మారి ఈ దేశానికి చెదలు పట్టించింది.
(సశేషం)