(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]బెం[/dropcap]గాల్ విభజన ద్వారా భారతదేశాన్ని దారుల్ ఇస్లాం చేయాలన్న సంకల్పం పాక్షికంగానైనా నెరవేరినట్టయింది. ముస్లింలు, బ్రిటిష్ అధికారుల సహాయంతో రెచ్చిపోవడానికి మరింత అవకాశం ఏర్పడింది. ఒకవైపు ముస్లిం లీగ్, వారికి పూర్తి అనుకూలంగా బ్రిటిష్ అధికారులు బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళనను అణచివేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. 7వ శతాబ్దంలో భారతదేశంలో హిందువులపై మొదలైన హింస 20వ శతాబ్దంలో కూడా కొనసాగుతూ వచ్చింది. అదే దేవాలయాల విధ్వంసం, అదే హత్యాకాండ అలాగే కొనసాగింది. అప్పుడు సుల్తానులు ప్రత్యక్షంగా పాల్గొంటే.. ఆ తరువాత బ్రిటిషర్లు సంపూర్ణంగా సహకరించారు. 1947 వరకూ కూడా కంటిన్యూ అయింది. ఒక ఊళ్లో అప్పటి వరకు రెండు మతాల ప్రజలు సంతోషంగా ఉండేవారు. రాత్రికి రాత్రి అకస్మాత్తుగా ఏదో జరిగేది. అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగేది. అప్పటి వరకు మిత్రులుగా ఉన్నవారే.. ఒక్కసారిగా ఒకరిమీద ఒకరు కలియబడి కొట్టుకొనేవారు. చంపుకునేవారు. ఇదీ బ్రిటిష్ కాలంలో పెచ్చరిల్లిన పరిస్థితి. ఒకవైపు వందేమాతరం ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్నది. మరోవైపు మతపరమైన అల్లర్లు బెంగాల్‌ను పతాక స్థాయికి తీసుకొని వెళ్లాయి. స్వదేశీ ఉద్యమం తీవ్రతరమై దేశమంతటా విస్తరించింది. ముఖ్యంగా పారిశ్రామికంగా, విద్యపరంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అన్ని రూపాల్లో విస్తరించడం చూసి బ్రిటిష్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ పెను భూతాన్ని ఎలా హతమార్చాలో తెలియక మింటో తల పట్టుకున్నాడు. ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్సీ మజుందార్ ఏం రాశారో ఒక్కసారి చదవండి..
‘The four-fold ramification of the Swadeshi movement industrial, educational, cultural and political – and its spread all over India unnerved the Government of India. It was not long before they realized that a local movement for removing a local grievance was being slowly, but steadily, developed into an all-India national movement against British rule. Lord Minto found it difficult to kill the hydra-headed monster let out of the basket of his predecessor. Lord Curzon.’
స్వదేశీ ఉద్యమాన్ని అణచివేసేందుకు మింటోకు చక్కగా దొరికినవాడు ఢాకా నవాబు షమీవుల్లా. నిజానికి బెంగాల్ విభజన చేయడానికి ముందే.. అప్పటి వైస్రాయ్ కర్జన్ 1904లోనే షమీవుల్లాను లొంగదీసుకొన్నాడు. అతడికి అతి తక్కువ వడ్డీకే 14 లక్షల రూపాయల రుణాన్ని సమకూర్చి పెట్టాడు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగే అల్లర్లను అణచివేయడంతో పాటు.. హిందూ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసమే అతడిని ఉదారంగా ప్రోత్సహించాడు. మింటో కూడా షమీవుల్లానే ముందుకు తోశాడు. బ్రిటిష్ ప్రభుత్వ సహాయంతోనే షమీవుల్లా రెచ్చిపోయాడు. అతని నేతృత్వంలోనే 1906లో ముస్లింలీగ్ రాజకీయ పార్టీగా అవతరించింది. ముస్లింలపై ఉలేమాలకు మంచి పట్టు ఉండటంతో వారి ద్వారా తన కార్యాచరణ ముందుకు తీసుకొని పోవడానికి షమీవుల్లాకు సులువైంది. ఈ ప్రాజెక్టుకు నాయకుడిగా ఇబ్రహింఖాన్ అనే మతోన్మాదిని షమీవుల్లా నియమించుకున్నాడు. ఇతడు బహిరంగంగానే హిందూ వ్యతిరేక చర్యలకు తెగబడ్డాడు. అత్యంత తీవ్రమైన హిందూ వ్యతిరేక చర్యలకు ముస్లింలను ప్రేరేపిస్తూ ఏకంగా ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశాడు. ఈ కరపత్రాన్ని లాల్ ఇష్తదార్ లేదా రెడ్ ఫాంఫ్లెట్ అని కూడా పిలుస్తారు. అందులోని కొన్ని భాగాలను ఇక్కడ మీ ముందుంచుతున్నాను.
- The Hindus, by various stratagems, are relieving the Mahomedans of nearly the whole of the money earned by them. Among the causes of the degradation of Mahomedans is their association with the Hindus.
- Among the means to be adopted for the amelioration of Mahomedans, is boycotting Hindus.
- Ye Musalmans arise, awake! Do not read in the same schools with Hindus. Do not buy anything from a Hindu shop. Do not touch any article manufactured by Hindu hand. Do not give any employment to a Hindu. Do not accept any degrading office under a Hindu. You are ignorant, but if you acquire knowledge you can at once send all Hindus to jehannum (hell). You form the majority of the population of this Province. Among the cultivators also you form the majority. It is agriculture that is the source of wealth. The Hindu has no wealth of his own and has made himself rich only by despoiling you or your wealth. If you become sufficiently enlightened, then the Hindus will starve and soon become Mahomedans.
- Hindus are very selfish. As the progress of Mahomedans is inimical to the self-aggrandisement of Hindus, the latter will always oppose Mahomedan progress for their selfish ends.
- Be united in boycotting Hindus. What dire mischief have they not done to us! They have robbed us of honour and wealth. They have deprived us of our daily bread. And now they are going to deprive us of our very life.
హిందువులందరినీ అన్ని రూపాలలోనూ బహిష్కరించాలని ఇబ్రహింఖాన్ ఇచ్చిన పిలుపు ఇది. ముస్లింలు అందరూ కూడా దీన్ని తుచ తప్పకుండా పాటించారు. కానీ హిందువులు మాత్రం ముస్లింలను బహిష్కరించలేకపోయారు. ఎందుకంటే వీరికి నిర్లక్ష్యం, నిర్లిప్తత, మనం ఒకళ్లం బహిష్కరించినా, బహిష్కరించకపోయినా పెద్దగా ఏమవుతుందిలే.. అన్న తేలికపాటితనం. వెనుకటికి ఒక కథ ఉన్నదిట. బహుశా ఇది అందరికీ తెలిసిన కథే. వర్షన్లు చాలా ఉండవచ్చు. ఒక రాజు తన ఇంట్లో ఒక శుభకార్యం మొదలుపెట్టాడంట. ఈ సందర్భంగా ప్రజలందరినీ.. ఒక్కొక్కరు ఒక్కో గ్లాసు చొప్పున పాలు తెచ్చి కుండల్లో పోసి నింపాలని ఆదేశించాడంట. ప్రజలంతా బారులు గ్లాసులతో బారులు తీరి నింపారు. తెల్లవారి చూస్తే అన్ని కుండల్లో నీళ్లే ఉన్నాయి. ఏమిటంటే ఇంతమంది పాలు పోస్తుంటే.. నేనొక్కరిని నీళ్లు పోస్తే పోయేదేమున్నది? తెలిసేదేమున్నది అనుకున్నారు అందరూనూ.. చివరకు అందరూ నీళ్లే పోశారు. ఈ కథలో ప్రకారమే ముస్లింలు బహిష్కరించిన స్థాయిలో హిందువులు ఏమీ చేయలేకపోయారు. మన వాళ్ల నిర్లిప్తత పర్యవసానాల వల్లనే ఇవాళ కూడా దేశాన్ని దారుల్ ఇస్లాం చేయాలన్న కుట్రలు కొనసాగుతున్నాయి.
ఈ రెడ్ పాంఫ్లెట్ లోనే ఒక కవిత కూడా ఉన్నది. ఈ కవిత సారాంశం ఏమిటంటే.. భారతదేశంపై అరబ్బుల సైనిక దాడులు తిరిగి జరగాలి. భారత దేశంలో ఇస్లాంకు పూర్వ వైభవం రావాలి. ఇదీ ఆ కవిత. రెడ్ పాంఫ్లెట్ విడుదల తరువాత తూర్పు బెంగాల్‌లో నరమేధమే జరిగింది. 1907 మార్చి 4వ తేదీన ప్రస్తుత బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ జిల్లాలోని కొమిల్లా (ప్రస్తుతం కుమిల్లా అని పిలుస్తున్నారు) ప్రస్తుత బంగ్లాదేశ్ లోని మైమేన్ సింగ్ డివిజన్‌లో ఉన్న జమాల్‌పూర్ ప్రాంతాల్లో హిందువులపై ముస్లింలు భయంకరంగా దాడులకు తెగబడ్డారు. ఇదేమీ యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు. నవాబ్ షమీవుల్లా కొమిల్లాను అదే రోజు సందర్శించి అల్లర్లకు మరింత ఆజ్యం పోసి వెళ్లిన తరువాతే ఈ దారుణం జరిగింది. 1907 మార్చి 4 ఉదయం షమీవుల్లా బహిరంగ వీధుల్లో ర్యాలీగా వెళ్లుతున్న సమయంలోనే హిందూ స్వదేశీ దుకాణాలపై దోపిడీ మూకలు దాడులు చేశాయి. వారి ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, అధికారులు ఏమీ చేయకుండా చోద్యం చూస్తూ ఉండిపోయారు. ముస్లింలు లాఠీలతో, మారణాయుధాలతో యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నా వారిని అడ్డుకునే ప్రయత్నాలేవీ జరుగలేదు. దీంతో తూర్పు బెంగాల్ లోని మైనార్టీ హిందువుల్లో తీవ్రమైన భయాందోళనలు మొదలయ్యాయి. షమీవుల్లా మూకలు హిందువుల రక్తాన్ని ఏరులై పారించాయి. కమిల్లా తరువాత జమాల్‌పూర్‌ను ఎంచుకున్నారు. ఆర్సీ మజుందార్ తన బెంగాల్ విభజన గ్రంథం 2, 3 సంపుటాల్లో రాసిన అంశాలు చదువుతుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జమాల్‌పూర్‌లో తీవ్రమైన అలజడిని సృష్టించడంలో ముస్లింలు సక్సెస్ అయ్యారు. వందలాది హిందువులు.. మహిళలతో సహా ఒక దేవాలయంలో రాత్రంతా రహస్యంగా దాచుకోవాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున హిందువుల మీద విధ్వంస కాండ చెలరేగింది. ఆర్సీ మజుందార్ రాసిన చరిత్రను చరిత్రే కాదనే వారు.. అదే సమయంలో బ్రిటిష్ వార్ కరస్పాండెంట్ హెచ్ డబ్ల్యూ నెవిన్సన్ రాసిన ది న్యూ స్పిరిట్ ఆఫ్ ఇండియా గ్రంథంలో రాసిన పంక్తులు ఆనాటి వాస్తవాలను కండ్లకు కట్టిస్తాయి. ఈ పుస్తకం 1908లో అచ్చయింది.
I have almost invariably found English officers…on the side of the Mohammedan, where there is any rivalry of.. religion.. in Eastern Bengal this national inclination is now encouraged by the Government’s open resolve to retain the Mohammedan support of the Partition by any means.. It was against the Hindus only that all the petty persecution of officialdom was directed. It was they who were excluded from Government posts; it was Hindu schools from which Government patronage was withdrawn. When Mohammedans rioted, the punitive police ransacked Hindu houses.. mullahs went through the country preaching the revival of Islam and proclaiming to the villagers that the British Government was on the Mohammedan side, that the Law Courts had been specially suspended for three months, and no penalty would be exacted for violence done to Hindus, or for the loot of Hindu shops, or the abduction of Hindu widows A Red Pamphlet was everywhere circulated, maintaining the same wild doctrines… In Comilla, Jamalpur and a few other places, rather serious riots occurred…lives were lost, temples were desecrated, images broken, shops plundered, and many Hindu widows carried off. Some of the towns were deserted, the Hindu population took refuge in “pukka” houses (i e., house with brick in stone walls), women spent nights hidden in tanks, the crime known as “group-rape” increased, and throughout the country districts there reigned a general terror, which still prevailed at the time of my visit.
ఇబ్రహింఖాన్ జనంలోకి వదిలిన రెడ్ పాంఫ్లెట్ ఎక్కడ పడితే అక్కడ ఈ విలేఖరికి కనిపించింది. ఇది కనిపించిన ప్రతిచోటా అల్లర్లు, అశాంతి, భయం పెద్ద ఎత్తున కనిపించాయి.
శ్రీ అరవిందుల నేతృత్వంలో ప్రచురితమైన జుగంతర్ పత్రికలో జమలాపూర్, కమిల్లా అల్లర్ల గురించి విస్తారమైన కథనాలు అచ్చయ్యాయి. 1907 మే 5వ తేదీ సంచికలో తొలి పేజీలో ముస్లింలు చేసిన విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను అచ్చు వేశారు. భాంగా, ఛిన్నమస్త, బసంతి మాతల విగ్రహాలను ధ్వంసం చేసిన ఫొటోలు వేసి వాటి కింద.. అమ్మ పరిస్థితి ఎలా అయిందో చూడండి అని క్యాప్షన్ పెట్టారు. అప్పటి మైమేన్ సింగ్ కరస్పాండెంట్ ప్రత్యక్ష కథనాన్ని యథాతథంగా ప్రచురించింది.
‘I saw Hindu shops with broken doors their wares looted by muslims. The sight that greeted me at the durgabari prevented me from calling myself a Hindu. The Durga idol was headless so were the idols of Kartik and Ganesha. The marks of a hundred blows adorned the mothers body. It was one of terror and panic – the ladies all shuddering and crying in the house adjacent to the sanctorum. An injured guard with a broken rifle trying to protect the temple and raving muslim mobs. Circling the road and pounding on the door and a head priest crying at the altar asking the mother for protection. (aghater shatachinna mar ange brjajman) – jamalapur katha by bishesh sangbadatar patra (special correspondent report).
ఈ విలేఖరి మరింత లోతుగా జమలాపూర్ లోని పరిస్థితులను అధ్యయనం చేసి తన కథనంలో పొందుపరిచాడు. వాస్తవానికి ఇతను అక్కడి దాకా వెళ్లి ప్రాణాలతో వెనక్కి సురక్షితంగా తిరిగి రావడమే అదృష్టమని చెప్పాలి. ఈ విషయాన్ని కూడా అతను తన కథనంలో పేర్కొన్నాడు.
I thought once of dragging all those who live without worry under a foreign (firinghi) government and wish to die as slaves, all those who run the length and breadth of the country making speeches at conferences and conferences and who keep petitioning and telegramming Morley [then Secretary of state for India referred to here as a symbol of foreign over lordship], I felt like dragging these fellows and making them see this scene similar to that of a cremation ground. Shame on those who are unable to protect their mothers, their wives and their daughters, shame on their life, shame on their speechmaking and shame on their university titles and recognitions.’
ఈ దారుణాలపై వందేమాతరం పత్రికలో శ్రీ అరవిందులు తన ఆగ్రహాన్ని తీవ్రంగా వెలిబుచ్చారు. ‘the broken image of Durga, the outraged sanctity of religion, the blood of our kindred, the offended honour of our cause and country, all cry out for succour and vindication’ (bande mataram, April 25, 1907)
ఈ అల్లర్లకు సంబంధించి, దాని భయంకరమైన స్వభావం గురించిన బహిర్గతమైన మరొక సాక్ష్యం ఉన్నది. ఈ సాక్ష్యం ఏమిటంటే.. అల్లర్లకు సంబంధించి విచారించిన ప్రత్యేక మెజిస్ట్రేట్ తన తీర్పులో తాను పరిశీలించిన అంశాన్ని పొందుపరిచాడు. అదేమిటంటే..
The accused, Habil Sircar had read over a notice to a crowd of Musalmans and had told them that the Government and the Nawab Bahadur of Dacca had passed orders to the effect that nobody, would be punished for plundering and oppressing the Ilindas. Soon after, the image of Kali (Hindu goddess) was broken by the Musalmans and the shops of the Hindu traders were also plundered.
హబిల్ సిర్కర్ అనే నిందితుడు ముసల్మానులను ఒక్క చోట సమీకరించి వారితో స్పష్టంగా తనకు నవాబు నుంచి వచ్చిన ఉత్తర్వుల గురించి వివరించాడు. హిందువులపై దాడులు చేసినా, వారి ఆస్తులను ధ్వంసం చేసినా, దోపిడీలు చేసినా, హత్యలు చేసినా ఎలాంటి శిక్షలు ఉండవని ఢాకా నవాబు బహద్దూర్ షమీవుల్లా ఆదేశించాడని హబిల్ సిర్కర్ ఒక నోటీసును ముసల్మానులకు చదివి వినిపించాడు. అతను నోటీసు చదవటం పూర్తి చేయడంతోనే ముస్లింలో పక్కనే ఉన్న హిందూ దేవత కాళీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న హిందూ వ్యాపారుల దుకాణాల్లోకి చొరబడి ధ్వంసం చేసి దోపిడీ చేశారు.
మరి రెడ్ పాంఫ్లెట్ ను సృష్టించి దాన్ని జనాల మీదకు వదిలి మైనార్టీ హిందువుల మీద పాశవికమైన దాడులు జరగటానికి ప్రధాన కారకుడైన ఇబ్రహింఖాన్ ఏమయ్యాడో తెలుసా..? అతడి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మైమేన్ సింగ్ జిల్లా కోర్టులో విచారణ కూడా జరిపించారు. జడ్జిగారు వాదోపవాదనలు కూడా విన్నారు. అంతా అయిపోయిన తరువాత ఇబ్రహింఖాన్ కు జడ్జిగారు ‘ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు’ అని పే.. ద్ద వార్నింగ్ ఇచ్చారు. వెయ్యి రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద అతడిని స్వేచ్ఛగా బజారులోకి వదిలేశారు. అదే సమయంలో ఇదే జడ్జిగారు వీధుల్లో బహిరంగంగా వందేమాతరం గేయాన్ని ఆలపించినందుకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించారు.
బెంగాల్ విభజనకు మరో పార్శ్వం ఇది. బెంగాల్ విభజనకు సంబంధించి మన పాఠాలలో, చరిత్రలో కేవలం పరిమితంగానే చెప్తూ వచ్చారు. అవి కూడా బుల్లెట్ పాయింట్ల మాదిరిగా. బెంగాల్‌ను విభజించారు. వ్యతిరేక ఉద్యమం జరిగింది. వందేమాతరం ఉద్యమంగా స్వదేశీ ఉద్యమం జరిగింది. 1911లో విభజన రద్దు చేసి రాజధానిని ఢిల్లీ మార్చారు. ఇంతకంటే ఏమీ చెప్పరు. కానీ.. కమిల్లా అల్లర్ల గురించి కానీ, జమలాపూర్ దారుణాలు కానీ చరిత్రలో ఎక్కడా దుర్భిణీ వేసి చూసినా కనిపించవు. ఈ దేశంలో ఏ దశలోనూ హిందూ ముస్లింల మధ్య సామరస్యం లేదనేది విస్పష్టం. లేకుండా, రాకుండా చేయడానికి మొఘలులు, బ్రిటిషర్లు, ఇప్పుడు కమ్యూనిస్టు హేతువాద స్వేచ్ఛామతవాద మేధావులు శాయశక్తులా ప్రయత్నించారు. ప్రయత్నిస్తూనే ఉన్నారు.
(సశేషం)