Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-57

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]కే[/dropcap]వలం గాంధీగారి కోసమే ఖిలాఫత్‌కు సమర్థిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమానికి కాంగ్రెస్ అంగీకరించింది. మరోవైపు ఖిలాఫతిస్టులు ప్లాన్ బి ని కూడా సిద్ధం చేసుకొన్నారు. 1921 మే నాటికి ఖిలాఫత్‌వాదుల ప్రసంగాలు క్రమంగా ముస్లింలను రెచ్చగొట్టే దిశగా సాగుతూ వచ్చాయి. బ్రిటిష్ సైన్యంలో చేరవద్దు.. చేరడం హరామ్ అంటే పాపం అని ఫత్వా విడుదల చేశారు.. కానీ.. ఆ ఫత్వాను బహిర్గత పరచకుండా.. కొంతకాలం పాటు రహస్యంగా బ్రిటిష్ భారత సైన్యంలోని ముస్లింలకు పంచసాగారు. అదే సమయంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేందుకు మరో పక్కా ప్రణాళిక రచించారు. ఇందుకోసం సైనికులకు పెద్ద ఎత్తున లంచాలు ఇవ్వటం జరిగింది.

“We do not mean to say that the Khilafat movement lost its religious character; the Jamiat-ul-Ulama in November, 1920, even evolved its own religious basis for non-co-operation by issuing the Mutafiqa fatwa which declared that co-operation with the British, being enemies of Islam, was haram – forbidden by the sharia.  Here national honour was not hinted at! But all the same, the Khilafat leaders in Congress – the Ali brothers, Abul Kalam Azad, Hakim Ajmal Khan, Dr. Ansari and Umar Sobani among them – accepted that their religious demands were considered as being dependent upon securing recognition of India’s national status. This means that at least among Khilafat leaders a considerable shift towards Indian nationalism had taken place.” (the khilafat movement of India p.110)

ఖిలాఫత్ క్రమంగా హింసాత్మక రూపం దాల్చింది. అటు ఆఫ్ఘనిస్తాన్ రాజును బ్రిటిష్ ఇండియాపై దండెత్తేలా చేయడానికి కావాల్సినన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన దండెత్తి వస్తే.. ముస్లింలు అందరూ ఆయన్ను సమర్థించేలా.. అండగా నిలిచేలా.. మరొకసారి మొఘల్ వైభవం తీసుకొని రావాలన్నది లక్ష్యంగా సాగుతూ వచ్చింది. ఇదే ధోరణి భారత దేశ విభజన వరకు కూడా కొనసాగుతూనే వచ్చింది. షా వలీవుల్లా కొడుకు షా అబ్దుల్ అజీజ్ (1746-1824) ఇచ్చిన నాటి ఒక ఫత్వాను అనుసరించి ముస్లిం చట్టాల ప్రకారం పరిపాలన సాగేలా అధికారం సాధించడం ముస్లింల అందరి బాధ్యతగా ఖిలాఫతిస్టులు కరపత్రాలు పంచసాగారు. మహ్మద్ ప్రవక్త 622 సంవత్సరంలో హిజ్రత్ పై ఎనిమిది సంవత్సరాలు మదీనాకు వెళ్లిన అనంతరం మక్కాపై విజయం సాధించి తిరిగి వచ్చారు. అదే విధంగా అవసరమైతే హిజ్రత్‌కు వెళ్లాలని భావించారు. ఈ ఆలోచన ముస్లిం నాయకుల్లో ఖిలాఫత్ ఉద్యమం తొలి నాళ్ల నుంచే ఉన్నది.

About 1870 the rebellion of these fighting Wahabis or mujahidin was largely suppressed by the British forces which, however, never annihilated it completely. Their main significance in relation to our  subject seems to be that they operated with the concept of dar-ul-Islam and dar-ul-harb, and, declaring India to fall within the latter category,  had no other choice than jihad or hijrat – a theme recurring in the days of the Khilafat movement. About 1870, this concept lost something of its sting, because authoritative fatwas had assured the Indian Muslims that jihad in their case was not justified. One fatwa argued that India had not become dar-ul-harb; another one contended that it was no longer dar-ul-Islam, but that in the prevailing conditions Indian Muslims were bound to obey the new rulers. Hunter, explaining these arguments at considerable length,75 concludes; “The Indian Musalmans, therefore, are bound by their own law to live peaceably under our Rule. But the obligation continues only so long as we perform our share of the contract, and respect their rights and spiritual privileges.” There was the danger – changing conditions could revive the theme of dar-ul-harb and the connected ideas of jihad and hijrat, as happened in the days of the Khilafat movement. (the khilafat movement 1919-1924 p.33)

ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. స్పష్టమైన ఆధారాలను ప్రస్తావించకుండా చూపించకుండా మనం ఏమీ మాట్లాడలేము కాబట్టి. పాకిస్తాన్ మూవ్‌మెంట్ అని పాకిస్తాన్ రచయితలు సికందర్ హయత్, షాందానా జహీద్ సంయుక్తంగా రాసిన గ్రంథాన్ని.. ఇస్లామాబాద్ లోని అల్లామా ఇక్బాల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రచురించింది. ఇందులో కూడా ఖిలాఫత్‌పై స్వల్పంగానైనా చర్చ కనిపిస్తుంది. ఒక వేళ తాము అనుకున్నట్టుగా భారత్‌లో పూర్తి ఇస్లామీకరణ సాధ్యం కాకపోతే.. ఇస్లాం పూర్తిగా అమల్లో ఉన్న ప్రాంతానికి వెళ్లి బలం కూడగట్టుకొని తిరిగి తాము వదిలి వెళ్లిన భూమిని సాధ్యం చేసుకోవాలి అన్నది హిజ్రత్ అర్థం. అంటే వీలైనంతమందిని ఆఫ్ఘనిస్తాన్‌కు వలస పంపించి.. సర్వసన్నద్ధం చేసి తిరిగి భారత్‌కు వచ్చి.. దారుల్ ఇస్లాంను సాధించాలన్నది ఈ వ్యూహంలోని అసలు లక్ష్యం.  జిహాద్‌కు హిజ్రత్‌కు అర్థంలో పెద్దగా తేడా లేదేమో.. ఈ దృష్టితోనే ఆఫ్ఘన్ రాజు హాజీ అమీర్‌తో ఖిలాఫతిస్టులు మాట్లాడిన చర్చలు కొంత సానుకూల ఫలితాలను ఇచ్చాయి. భారత్.. దారుల్ హర్బ్ గా మారిందని.. అందువల్ల దారుల్ ఇస్లాంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు వలస వెళ్లి తిరిగి శక్తి పుంజుకొని రావాలని భావించారు. ఆఫ్ఘన్ రాజు అమీర్‌కు కూడా కొంత ఆశ ఉన్నది. టర్కీలో ఖలీఫా కూలిపోతే.. ప్రపంచ ఇస్లాంకు తానే దిక్కు కావాలని.. తానే ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆశ పడ్డాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే.. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ముస్లింలకు (ఆషాడం, శ్రావణం, దసరా, దీపావళి, సంక్రాంతి మాదిరిగా) ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాడు. ఈ వలస వచ్చేవారిని ముజాహరీన్ అని పిలిచారు. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కైవ్స్‌లో ప్రచురించిన హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ ఆఫ్ ఇండియా: ఖిలాఫత్ మూమెంట్ పదవ సంపుటంలోని 398, 399 లో ఈ అమీర్ ప్రకటించిన ఆఫర్లు యథాతథంగా ఉన్నాయి గమనించండి..

S.B., North-West Frontier Province. —From Abstract, dated June 5th, para. 465.— C.I.D., N.W.F.P., May 31st.—Following Rules and Regulations have been framed by the Amir of Kabul to be observed by the Muhajirin. from the British territory intending to settle in Afghanistan

(Signed) ABDUL RAHMAN,

Sadr-i-Kharijiyya.

The above Nizamnama has been approved of by the mighty Ghazi Amir.

(w) Sind, C.I.D., June 14. —Extract from the Al-Wahid of 14th June —

……………………………………………………….

(1) Emigrants should proceed to Peshawar Cantonment Station, whence they will be escorted by Volunteers with crescent flags to the “Makan Nimak Mandi”, Peshawar City, where they will be properly looked after.

(2) During the hot weather, caravans will leave Peshawar at 5p.m. on Fridays.

(3) The British boundary, Landhi Kotal, is 29 miles away from Peshawar.

(4) A tonga accommodating four persons costs Rs. 16 from Peshawar to Landhi Kotal, so that each person will have to pay Rs.4 as gharry hire.

(5) Very little kit can be carried in the gharry, for luggage, camels, horses, mules and donkeys can be hired.

(6) From Landhi Kotal one will have to go on foot to Duki, a distance of 9 miles, in the Amir’s territory. The road is very smooth and straight. Pardha-nashin ladies and weak and delicate men can go to this place direct from Peshawar in carriage by passing extra fare.

(7) From Duki to Jallalabad arrangements will be made for the journey by ” Khuddan Jumma Dallah Rubania”. Jallalabad is 40 miles from Duki and Kabul 90 miles from Jallalabad.

(8) For passports, each person will have to pay one Kabuli rupee and a family five Kabuli rupees (a family may consist of any number of people). In Peshawar one Kabuli rupee is equal to fourteen annas.

(9) A passport can be had in Peshawar through Haji Jan Muhammad, Secretary of” Istakabalia Hajra Committee

(10) Proper arrangements are made in Peshwar for the residence and onward journey of Pardha-nashin ladies.

(11 )lf any person wishes arrangements to be made for him, he should give intimation to that three days previously and send the expense also.

(12) Each emigrant should have with himself at least Rs.35 on arrival at Peshawar. If he has more he can make himself comfortable.

(13) Emigrants should arrive at Peshawar on Wednesday or by Calcutta Mail on Thursday in order to leave on Friday. Failing this they will have to wait until the following Friday.

(14) Emigrants should provide themselves with warm clothes and bedding.

(15) Any person wishing to subscribe to help this cause should send money to Haji Jan Muhammad, Treasurer and Secretary,” Istakabalia and Intazamia Committee.”.

ఆఫ్ఘనిస్తాన్‌కు వలస రావాలనుకునే ముసల్మానులకు లేదా ఇతర వ్యక్తులకు పెషావర్‌లో పాస్‌పోర్టు ఇస్తారు. ఆ వ్యక్తి మహమ్మదీయ చట్టాలకు లోబడి జీవించాలి. వారికి కావలసిన భూమి, ఇల్లు, ఇతర వసతులు కల్పించబడతాయి. అవివాహిత వ్యక్తికి 10.49 ఎకరాలు, వివాహితుడికి 8 జరబ్‌ల భూమి ఇస్తారు. పంట చేతికొచ్చేవరకు వారికి గోధుమపిండి వంటి ఆహారపదార్థాలు సరఫరా చేస్తారు. దీనికి కూడా పై లేఖలో లెక్కలున్నాయి. గమనించవచ్చు. భూమి శిస్తు మినహాయింపు మూడేళ్లు ఇస్తారు. ఇలా రకరకాల ఆఫర్లతో ఆఫ్ఘనిస్తాన్ రాజు హాజీ అమీర్ ప్రతిపాదన చేశారు.

దీంతో ఖిలాఫతిస్టులు ఎంతో సంతోషించారు. 1920 ఏప్రిల్ 25 న జరిగిన ఖిలాఫత్ కార్మిక సదస్సు హర్షం ప్రకటించింది. హిజ్రత్‌ను మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పూర్తిగా సమర్థించారు. 1920 జూలై 30 న అల్ ఏ హదిత్ ఉర్దూ దినపత్రికలో ఒక వ్యాసం రాస్తూ.. (దాని పేరు హిజ్రత్ కా ఫత్వా) ‘షరియత్ లో అన్ని నిబంధనలు సమకాలీన సంఘటనలు, ముస్లింల ప్రయోజనాలు రాజకీయ అంశాల్లో అనుకూల, ప్రతికూల అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాత భారత్‌లో ముస్లింలకు ఇక్కడి నుంచి వలస పోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని నాకు నమ్మకం కలిగింది. వెంటనే వలస పోలేని వారు వలసపోయేవారికి సహాయపడాలి. చివరలో తన అభిప్రాయానికి రాజకీయపరమైన ఎటువంటి ప్రాతిపదిక లేదని పేర్కొన్నారు. (hijrat: the flight of the faithful a British file on the exodus of muslim peasants from north India to Afghanistan in 1920, dietrich reetz veri. Das arabische buch, berlin, 1995, p35-36).

ఒకవైపు ఖిలాఫత్ ఉద్యమం కొనసాగుతున్నది. మరోవైపు మసీదుల ప్రాతిపదికన హిజ్రత్‌ను ప్రోత్సహించే కార్యక్రమం కూడా సమాంతరంగా కొనసాగుతూ వచ్చింది. ప్రవక్తలు, రచయితలు ప్రవచనాలు చెప్పారు. వలస వెళ్లకపోతే నాస్తికులవుతారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. 1920 మే 15న తొలి బృందం ఆఫ్ఘన్‌కు ఖబర్ కనుమల గుండా వెళ్లింది. మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ.. తరువాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ, క్రమంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ వలసదారులకు చోటు లభించలేదు. చాలా చాలా దారుణాలు జరిగిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ స్థానిక ప్రజలు రానివ్వలేదు. వీరిపై దాడులు చేశారు. అత్యంత దారుణంగా దోపిడీలు చేసి మారణకాండకు పాల్పడ్డారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో వేలకొద్దీ ముహాజరీన్ (ముస్లింల)ల సమాధులు ఉన్నాయి. చివరకు హిజ్రత్ విఫలమైపోయింది. కానీ.. వారి లక్ష్యం దిశగా ప్రస్థానం మాత్రం ఆగలేదు.

1921 మధ్యన ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ దగ్గర ఉన్న చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఖిలాఫత్, కాంగ్రెస్ స్వచ్చంద కార్యకర్తల సంస్థల సంయుక్త స్వచ్చంద సేన కార్యాలయం ఒకటి ఏర్పడింది. చౌరీ చౌరా స్టేషన్ కు సరిగ్గా ఒక మైలు దూరంలో ఈ కార్యాలయం ఉన్నది. 1922 ఫిబ్రవరి 4న ఈ కార్యాలయంలో కార్యకర్తలు సమావేశమయ్యారు. ఆ తరువాత అదే రోజు మధ్యాహ్నం మూడు వేల నుంచి ఐదు వేల మంది వరకు ప్రదర్శనకారులు చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు కాల్పులు ప్రారంభించారు. వారి తుపాకుల్లో గుళ్లు అయిపోయాయని తెలియగానే వారిపై నేరుగా దాడి చేశారు. ఈటెలతో పొడిచారు. పెట్రోల్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ దాడిలో 21 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. జలియన్ వాలాబాగ్ తరువాత జరిగిన అతి పెద్ద దుర్ఘటన ఇది. ఈ మారణకాండతో గాంధీగారు చాలా కలత చెందారు. వెంటనే ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది. కానీ, ఖిలాఫత్ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఖిలాఫత్ ఉద్యమంలో అతి పెద్ద మారణ కాండల్లో ఒకటి హిజ్రత్ అయితే.. మరొకటి చౌరీ చౌరా.. ఇంకొకటి మోప్లా.

(సశేషం)

Exit mobile version