దేశభక్తి గేయం

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ ‘దేశభక్తి గేయం’తో భరతమాతకి వందనాలు అర్పిస్తున్నారు మట్ట వాసుదేవమ్. [/box]

[dropcap]జ[/dropcap]యభారత జనయిత్రీ వందనం!
జయ జయ జయ దివ్య ధాత్రీ వందనం!!

గంగ యమున గోదావరి ప్రవహించిన పుణ్య భూమి
మహానది, నర్మద, కావేరీలకు పుట్టినిల్లు
మహోన్నత హిమాలయములు కిరీటముగా ధరించు మాత!
వింధ్యాచలమే మలనూలై అలరారు వనిత                                       జయ ॥

శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు నీదు బిడ్డలై వెలసిరి!
లోకాలకు ధర్మబద్దమైన దారి చూపించిరి!!
గౌతముడు మహావీరుడు నీదు బిడ్డలే కదమ్మా!
అహింసయే పరమ ధర్మమనుచు భువిని ప్రవచించిరి!!               జయ ॥

కాళిదాసు వాల్మీకి కవిశ్రేష్ఠులై వెలసిరి!!
నీదు దివ్య వర్ణనలను నిలువుటద్దమున చూపిరి
ఆతుకూరి మొల్ల రంగాజమ్మలు తమ రచనలందు!
నవరసాలనద్ది నీకు నవతేజము కల్పించిరి!!                          జయ ॥

రాణాప్రతాప్ ఛత్రపతి రణధీరులు నీ బిడ్డలు
నీ దాస్య శృంఖలము తెంప కడవరకు పోరినారు
రాణి రుద్రమ ఝాన్సీ రాజసంపు నీ దుహితలు
విరోధులను మట్టి కుడిపి వీర జ్యోతులై వెలిగిరి                        జయ ॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here