Site icon Sanchika

“దేశభక్తి కథలు” పుస్తకావిష్కరణ

[dropcap]సం[/dropcap]చిక – సాహితి సంయుక్తంగా ప్రచురించిన “దేశభక్తి కథలు” పుస్తకావిష్కరణ ది.15 ఆగస్టు 2018 నాడు విజయవాడలో ఘనంగా జరిగింది.

తొలుత మాచవరంలోని ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ వీరపనేని రామదాసు చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.  కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంచిక తరఫున లంకా నాగరాజు, కస్తూరి మురళీకృష్ణ, సోమ శంకర్ హాజరయ్యారు.

అనంతరం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీ కోనేరు శ్రీధర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కథారచయిత శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు సభకు హాజరయ్యారు.

సాయంత్రం శ్రీ హేమచంద్ర బాలాంత్రపు గారి నివాసంలో పుస్తకావిష్కరణ, పరిచయ సభ జరిగింది. విజయవాడ మాజీ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారు, శ్రీ పన్నాల సుబ్రహ్మణ్యభట్టు గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సభకు రచయితలు, సాహితీవేత్తలు, ప్రచురణకర్తలు హాజరయ్యారు. కస్తూరి మురళీ కృష్ణ ఈ పుస్తకం ప్రచురించడంలోని ఉద్దేశం, కథల ఎంపిక, వర్గాల వారీగా కథల విభజన గురించి వివరించారు. అనంతరం కథా సంకలనంపై చర్చ జరిగింది. శ్రీమతి బాలాంత్రపు ప్రసూన వందన సమర్పణ చేశారు.

 

 

 

 

 

 

Exit mobile version